(Telugu) ఉద్యోగం చేయం...మేమే ఇస్తాం...
[:te]*మారుతున్న నగర యువతుల ధోరణి
*సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి
ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడటమో.. లేదా ఇంటి బాధ్యతలకే పరిమితం కావాలనో నేటి తరం యువతులు కోరుకోవడం లేదు. సొంతంగా తమ కాళ్ళ పై తాము నిలబడాలనే అత్యధికులు భావిస్తున్నారు. సొంతంగా ఒక సంస్థనో ... పరిశ్రమనో ఏర్పాటు చేసి మరికొందరికీ ఉపాధి కల్పించాలనే ఆలోచనే వీరిలోనూ చాలామందిలో కనిపిస్తోంది.
శిక్షణ పొందేందుకు ఉత్సాహం...
327 మంది యువతులు.. వీరంతా ఉద్యోగం కోసం పాకలాడకుండా తమ ఉపాధిని తామే చూసుకోవడంతోపాటు .. ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికి అవసరమైన శిక్షణ తీసుకొన్నారు.
సొంతంగా పరిశ్రమ పెడితే దానిని ఎలా నిర్వహించాలి.. ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం ఎలా.. మార్కెటింగ్‌లో తెలుసుకోవాల్సిన మెలకువలు ఎమిటి? ఇలాంటి అంశాలపై బాలానగర్‌లోని సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఎంఈ)లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు శిక్షణ ఇస్తుంటారు. ఇక్కడ గత ఏడాదికాలంలో మొత్తం 22 విడతల్లో శిక్షణ ఇచ్చారు. ఈ తరగతులకు మొత్తం 364 మంది హాజరైతే వీరిలో 37 మంది మాత్రమే యువకులు. మిగిలిన వారంతా యువతులు.. ఎక్కువమంది నగరవాసులే కావడం గమనార్హం.
అత్యధికులు ఉన్నత విద్యావంతులే..
శిక్షణకు హాజరైన వారిలో ఇంజినీరింగ్, ఎంబీఏ లాంటి కోర్సులు చేసే వారూ చాలామంది ఉన్నారు.కొత్తగా ఏదో సాధించాలనే తపన.. పరిశ్రమను నెలకొల్పి నిర్వహణలో సత్తా చాటుకోవాలనే ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. యువతుల్లో అత్యధికులు డిగ్రీ ఆపై చదువులు చదివిన వారేనని ఎంఎస్ఎంఈ అధికారి సుధీర్ తెలిపారు. దాదాపు సగం మంది ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు.. 30 శాతం మంది ఎంబీఏ ఇతర విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు ఆయన వివరించారు. మిగిలినవారంతా ఇంటర్, పాలిటెక్నిక్ తదితర కోర్సులు చేసిన వారని పేర్కొన్నారు.ఆదాయం ఎంత ఉంటుందన్న దానికంటే.. సొంతంగా ఎదగాలన్న తపనే అనేక మందిని కొత్తగా పరిశ్రమలు, సంస్థలు స్థాపించేలా చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని కష్టాలనూ ఎదుర్కొనేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. బ్యాంకుల నుంచి సహకారం.. తీసుకోవాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులు, ఇతర సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఈ శిక్షణ పొందుతున్నారు. యువయులు ఎక్కువగా దుస్తులు, సంచులు తయారీ లాంటి యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. మొదట పది మందికి ఉపాధి కల్పిచడంతో ప్రారంభించి తర్వాత.. సంస్థను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించుకొంతున్నారు.మీకూ ఆసక్తి ఉంటే...
పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాల్లో శిక్షణ పొందాలని భావించే వారు వివరాలకు.. బాలానగర్‌లోని సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను 040-23078131, 23078133 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.[:]

Comments
Post a Comment