Posts

Showing posts with the label హోళీ

ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... వాటిలో కొన్ని... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ... రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒ...

రంగు పడుతుంది జాగ్రత్త!

హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే1 రంగు – ఆకుపచ్చ. ఉపయోగించే రసాయనం – కాపర్‌ సల్ఫేట్‌. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు. ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్‌. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్‌కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్‌ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్‌ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్‌. విష...

మణిపూర్‌లో హోళీని చూసితీరాల్సిందే!

హోళీ అనగానే రంగులే గుర్తుకువస్తాయి. ఆ రంగులతో పాటు పంచుకునే సంబరాలూ గుర్తుకువస్తాయి. కానీ హోళీ ముసుగులో ఆకతాయిలు హద్దులు దాటేస్తారనీ, తాగుబోతులు పీపాలు పట్టిస్తారనీ ఆరోపణ ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన జరిగే హోళీ అనేక అపవాదులకు తావిస్తూ ఉంటుంది. కానీ వీటన్నింటికీ భిన్నంగా హోళీ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మణిపూర్. మణిపూర్లో హోళీని ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదురోజులపాటు చేసుకుంటారు. అక్కడ ఈ పండుగను ‘యాసంగ్‌’ అని పిలుస్తారు. హోళీకి ఐదురోజుల ముందర హోళికా దహనంతో ఆ యాసంగ్ సంబరాలు మొదలవుతాయి. దీనికోసం ఎండుగడ్డిన ఓ గుడిసె ఆకారంలో నిర్మించి దానికి నిప్పు అంటిస్తారు. యాసంగ్‌ పండుగ జరిగే అయిదు రోజుల్లోనూ రాష్ట్రమంతా క్రీడల పోటీలు నిర్వహించడం విశేషం. ఉదయం వేళల్లో కుర్రకారంతా ఆటల్లో మునిగిపోతే, పిల్లలేమో ఇళ్లిళ్లూ తిరుగుతూ చందాలు సేకరిస్తుంటారు. ఇక యాసంగ్‌నాటి రాత్రివేళల్లో జరిగే నృత్యం గురించి చెప్పుకొని తీరాలి. యాసంగ్‌ సందర్భంలో మాత్రమే జరిగే ఈ నృత్యం పేరు ‘తబల్‌ చోంగా’. తబల్‌ అంటే వెన్నెల, చోంగా అంటే నృత్యం. పౌర్ణమి రోజుల్లో వచ్చే యాసంగ్‌ రాత్రుళ్లో యువతీయువకులు కలిసి ఈ నృత్యం చే...

హోళీ ఆడే తీరు... ఒకో చోట ఒకోలా!

హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి... లాఠ్‌మార్‌ హోళీ ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్‌మార్‌ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు. షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగక...

హోళీ పండుగ కావాలంటే!

హోళీకి రసాయనాలతో చేసిన మందులు వాడవద్దు, వీలైనంతవరకూ సహజసిద్ధంగా దొరికే మందులనే వాడండి. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త, బెలూన్లను వాడవద్దు, పిల్లలని ఓ కంట గమనించుకోండి... అంటూ రకరకాల సూచనలు వినిపిస్తూ ఉంటాయి. మనం వాటిని పాటించినా, నలుగురిలోకి వెళ్లి హోళీ ఆడేటప్పుడు రసాయనాల రంగులతో ముద్ద కాక తప్పుదు. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే... ఇలాంటి బట్టలు హోళీ అడేటప్పుడు పాతబట్టలు వేసుకున్నామో లేదో గమనిస్తామే కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. హోళీ అడేటప్పుడు ఒంటిని వీలైనంత కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అవి కూడా కాటన్ దుస్తులైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్‌ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా... వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే ఆ రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి. శరీరానికి తగినంత తేమ పొడబారిన చర్మం మీద పడే రంగుల చర్మరోగాలకు దారితీస్తాయి. అందకనే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకోసం ఒంటినిండా కాస్త నూనెని పట్టించడం మేలు. అది మరీ అతిగా కనిపిస్తుందనుకుంటే... అందుబాటులో ఉన్న మాయిశ్చరైజింగ్‌ లోషను ఏదన్నా రాసుకోవచ్చు. జుట్టు పాడవకూడదనుకుంటే, త...

శివకేశవుల పండుగ... ఆనందాలు నిండుగ... హోళీ

మన పండుగలలో ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేకత. ఒక పండుగ వ్యవసాయపనులకు సంబంధంగా ఉంటే, మరో పండుగ రుతువులకు సంబంధించినదిగా ఉంటుంది. ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే, అన్నాచెల్లెల్లు కలిసి జరుపుకునే పండుగ ఒకటి. అలాగే హోళీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది సామాజికమైన పండుగ! ఇందులో పిండివంటలు చేసుకున్నామా, దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు. గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకుని, ఇరుగుపొరుగుతో సంతోషాలను పంచుకునే పండుగ. హోళీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం మూడు... తెలుగునాట హోళీని కామదహనం అనీ, కాముడి పున్నమి అని పిలవడం కద్దు. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రుషులను, సత్పురుషులను, దేవతలను, ప్రజలను.... వాళ్లూ వీళ్లూ అని లేకుండా రాక్షసులు కాని వారందరినీ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుడు అమిత బలవంతుడు. పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది. ఇంకేం! తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు. కనీసం కళ్లు కూడా తెరవని సమాధిస్థితిలో ఉన్నాడు. మరి శివ సతి అయిన పార్వతి మీద అ...