(Telugu) ఆర్ధిక నిర్ణయం ఇక మన వంతు!

[:te]ఒక రోజు.. గంట సమయాన్నిచ్చి జీవితానికి ఉపయోగపడే ఆర్ధిక నిర్ణయాలు తీసుకోమంటే ఏం చేస్తారు? ఆ మధ్య కొన్ని ఆర్ధిక సంస్థలు ఇదే ప్రశ్న మహిళల ముందుంచాయి.
*నలభైరెండు శాతం మంది తమకిచ్చిన గంటలో అధికభాగం బడ్జెట్ అదుపులో ఉంచుకోవడానికీ, ఖర్చులని తగ్గించుకోడానికీ ఏం చేయాలో ఆలోచించారట. ఆ తర్వాత పొదుపు గురించి మాట్లాడారు. మిగతావాళ్లు ఎలా పెట్టుబడులుపెడితే సంపద పెరుగుతుందో ఆ దిశగా ఆలోచనలు చేస్తామని చెప్పారు.
*ప్రతి నలుగురిలో ఒకరు ఆర్ధిక నిర్ణయాలు తీసుకునే బాధ్యత పూర్తిగా మగవాళ్లూ, ముఖ్యంగా భర్తే చూడాలని అన్నారట. ఆర్థిక నిపుణులు మాత్రం ఆ భావనకి కాలం చెల్లిందని అంటున్నారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాలు మహిళలే తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము