Posts

Showing posts with the label శివరాత్రి

ఉపవాసం ఇలా చేసి చూడండి

శివరాత్రి అనగానే ఉపవాసం గుర్తుకువస్తుంది. ఉపవాసం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు... ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ అది చేకూర్చే లాభం అసమాన్యం. అలాంటి ఉపవాసాన్ని చేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. - చాలామంది రేపు ఉపవాసం అనగానే ముందురోజు రాత్రి సుష్టుగా భోజనం చేస్తారు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. శరీరాన్ని నిదానంగా ఉపవాసాన్ని సిద్ధపరచడం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలంటే దశమి రాత్రి నుంచే మొదలుపెట్టాలనీ, శివరాత్రి ఉపవాసాన్ని కూడా ముందురోజు నుంచే ఆరంభించాలనీ చెబుతుంటారు. - ఉపవాసం ఉండటం మంచిదే! కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండితీరాలన్న నియమం ఏదీ లేదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు, విపరీతంగా కాయకష్టం చేసే పనిలో ఉండేవారు ఉపవాసం ఉండటం వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు. - స్వల్ప వ్యాయామం చేసినా కానీ మనకి తెలియకుండానే శరీరంలోని శక్తంతా దహించుకుపోతుంది. దానిని తిరిగి భర్తీ చేసేందుకు తగిన ఆహారం అందదు కాబట్టి నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఉపవాసం చేసే రోజున వ్యాయామానికి సెలవివ్వడం మంచిది. - శర...

మృత్యువుని దూరం చేసే బిల్వదళాలు

శివరాత్రి వచ్చిందంటే నీటితో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చనా గుర్తుకువస్తాయి. శివుని ఎన్ని విధాలా పూజించినా, అందులో బిల్వ పత్రం లేనిదే మనసుకి లోటుగానే ఉంటుంది. మరి ఆ పరమేశ్వరునికే ప్రీతిపాత్రమైనదంటే... బిల్వ పత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి కదా! వాటిలో కొన్ని... - బిల్వవృక్షంగా పిలుచుకునే మారేడు చెట్టు మన దేశంలోనే ఉద్భవించిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ చెట్టు -7 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని ఎంతటి నేలలో అయినా ఎదుగుతుంది. కాబట్టి ఊరూరా కనిపించే ఆ బిల్వదళాలు అటు అర్చనకే కాదు ఇటు ఆయుర్వేదంలోనూ విస్తృతంగా వినియోగించేవారు. - గాలి, వెలుతురు సరిగా సోకని గర్భగుడులలోని తేమకి రకరకాల సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. కానీ అక్కడ శివలింగం చెంతన ఉండే బిల్వదళాలు అక్కడి వాతావరణాన్ని మార్చేస్తాయి. మిగతా ఆకులతో పోలిస్తే బిల్వదళాలు రోజుల తరబడి తాజాగా ఉంటాయి. పైగా సూక్ష్మక్రిములను సంహరించే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు వీటి సొంతం. కాబట్టి గర్భగుడిని నిరంతరం పరిమళభరితంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో బిల్వానిది గొప్ప పాత్ర! - చక్కెర వ్యాధికి బిల్వం గొప్ప ఔషధం. బిల్వపత్రాల నుంచి తీసి...

శివరాత్రి రోజు ఏం చేయాలి!

వేల ఏళ్లు గడిచి ఉండవచ్చు, వైదిక కాలం దాటిపోయి ఉండవచ్చు... కానీ భరతజాతికి శైవారాధన మీద ఉన్న మక్కువ తగ్గనేలేదు. ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో మాత్రమే కాదు... సృష్టి తత్వాన్ని బోధపరుస్తాడనీ, సంసారం నుంచి విముక్తం చేస్తాడనీ ఆయన చెంతకు చేరతారు. అందుకు ఓ గొప్ప సందర్భమే శివరాత్రి! మన పండుగలన్నీ పగటి పూజలతోనూ, పిండివంటలు ఆరగించడంతోనూ గడుస్తాయి. కానీ శివరాత్రి దీనికి విరుద్ధం. ఉపవాసంతోనూ, జాగరణతోనూ, రాత్రివేళ పూజలతోనూ శివరాత్రిని జరుపుకుంటాము. శివుడు లింగరూపంలో దర్శనమిచ్చిన సందర్భం శివరాత్రి అని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ కూడా చాలామందికి సుపరిచితమే! బ్రహ్మ, విష్ణుదేవుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదులాట మొదలైందట. ఈ సమస్యని తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన ఒక అగ్నిస్తంభంగా అవతరించాడు. ఆ అగ్నిస్తంభపు చివరను ఎవరైతే తెలుసుకోగలరో వారే గొప్పవారంటూ శివుడు సూచించాడు. అంతట విష్ణువు వరాహరూపంలో స్తంభపు దిగువు భాగాన్ని పెళ్లగిస్తూ, బ్రహ్మదేవుడు హంస రూపంలో స్తంభం పైభాగంలోకి ఎగురుతూ దాని ఆద్యంతాలను కనుగొనే ప్రయత్నం చేశారు. చివరికి వారిరువురూ కూడా శివ...

(Telugu) శివరాత్రి విశేషాలు...

[:te]అమవాస్య ముందురోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మాహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి, దీన్ని మహాశివరాత్రి అంటూ ఓ పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్న మాట వినగానే మనకు పిండివంటనే గుర్తుకువస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనసుకే పండుగ! ఉపవాసజాగరణలతో శివసాయుజ్యానికై తపించే వేడుక! అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు... వాటి వెనుక ఉన్న విశేషాలు... చతుర్దశి విశేషం! పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒకో రోజూ గడిచేకొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అమావాస్య నాటికి, ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి- నిస్తేజంగా...

మహా శివరాత్రి వ్రత మహాత్యం

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే. ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని, ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ, విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని, ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి. జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవా...

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. 1.ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉప...