(Telugu) అవసరమైతేనే ఖర్చు

[:te]చాలామందికి డబ్బుని పొదుపు చేయడం ఎలా.. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియదు. పేరుకు ఒక ప్రయత్నం చేసి పెద్ద ఫలితం కనిపించలేదని పెదవి విరిచేస్తారు. కానీ ఏ ప్రయత్నం అయినా చిన్న అలవాటుగా మొదలుపెట్టాలి. డబ్బు విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కొంతమంది కూడబెట్టినట్టే కూడబెట్టి ఏదో ఒక అవసరానికి తీసి వాడేస్తుంటారు. అలా తీసుకొనే ముందు ప్రస్తుతమున్న మీ అవసరాలు, భవిష్యత్తు అవసరాలకంటే పెద్దవి అయితేనే తీయండి. లేదంటే వీలైనంత వరకూ సర్దుబాటు చేసుకునేందుకే ప్రయత్నించండి. వెనక్కి తీసుకోలేని విధంగా నిబంధలున్న పొదుపుని ఇరవైల్లోనే మొదలుపెడితే, ముప్ఫైల్లో అడుగుపెట్టేసరికి ఆ ఫలితాలు మొగ్గతొడుగుతాయి. ఇక్కడో చిన్న కిటుకు, చక్రవడ్డీ వచ్చే ప్రభుత్వ పొదుపు పధకాల్లో దాచుకొంటే ఫలితాలు ఇంకా బాగుంటాయి.[:]

Comments

Popular posts from this blog

(Telugu) మధ్వాచార్యులు

గురుశిష్యులు

పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత