పరమేశ్వరుడి దశావతారాలు ఏమిటో తెలుసా?
పరమ శివునికి అనేక నామములు ఉన్నవన్న విషయం మనందరికి తెలిసినదే. కానీ... అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు అయిన పరమ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నవి. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. శతరుద్ర సంహితాలలో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈ ఈశ్వరావతారమును వివరిస్తాడు. ఆ అవతారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శివుని ప్రధమ అవతారము మహాకాలుడు. మహాకాళి ఈ మహాకాలునికి భార్య. వీరిరువురు భక్తులకు భుక్తి, ముక్తిని ఇచ్చుచు వారి కోరికలను నెరవేర్చుచుందురు. 2. ఈశ్వరుని ద్వితీయ అవతారము తారకావతారము. తారకాదేవి ఈయన అర్థాంగి. వీరిని సేవించినవారు భక్తి, ముక్తులతో పాటు సమస్త శుభములను పొందుదురు. 3. ముక్కంటి తృతీయ అవతారము బాలభువనేశ్వరావతారము. బాలభువనేశ్వరి భువనేశ్వరుని అర్థాంగి. ఈ అవతారము సత్పురుషులకు సుఖములను కలిగించును. 4. శంకరుని చతుర్థ అవతారము షోడశ విద్యేశ్వరుడు. షోడశ విద్యేశ్వరి ఇతని ధర్మపత్ని. భక్తులకు సర్వ సుఖములను ప్రసాదించుట ఈ అవతార ప్రాశస్త్యము. 5. మహేశ్వరుని పంచమ అవతారము భైరవావతారము. భైరవి ఇతని భార్య. ఈ భైరవుడు ఉపాసనాపరులకు సర్వ కామ్యములను ఒనగూర్చును. 6. మంజునాధుని ఆరవ అవతారము ...