Posts

Showing posts with the label చాణక్యుడి నీతి వాక్యాలు

(Telugu) చాణుక్యుని "నీతి దర్పణము

Image
[:te] క్రీ//పూ//300సంవత్సరములలో నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము వెలసినది.సర్వ కాలములలోనూ,సర్వావస్థలలోనూ సర్వ దేశములకూ ఆదర్శ ప్రాయమైన సిద్ధాంతాలను వచిస్తూ,నిర్వచిస్తూ ఈ మహోన్నత ప్రమాణాలు కలిగిన గ్రంధ రాజమును నిర్మించిన వ్యక్తి"విష్ణు గుప్తుడు".అతని తండ్రి పేరు "చణకుడు" అగుటచే "చాణుక్యునిగా" లోక ప్రసిద్ధి గాంచాడు."ద్రమిశుడూ,"కౌటిల్యుడు"అనే నామ ధేయములతో కూడా వ్యవహరించ బడే వాడు. చంద్ర గుప్త మౌర్యునికి కుడి భుజముగా నిలిచి,ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ,అలనాడే"శ్రేయో రాజ్యమును"నెలకొల్పిన ధీశాలి. నాటి మగధ రాజైన ధనక నందునితో విభేదించి,విరోధించి,చంద్ర గుప్త మౌర్యుని రాజుగా చేసి,పాటలీ పుత్రము రాజధానిగా ,సామ్రాజ్యము తీరు తెన్నులను రూప కల్పన చేసి,రాజ్య వ్యవహారాలను నిర్వహించేవాడు. చంద్ర గుప్తునికి మహా మంత్రిగా,సలహా దారునిగా,సైనిక దళముల పర్య వేక్షకునిగా,పదవులను,బాధ్యతలను,చేపట్టి,బహు చాతుర్యంగా నిర్వహిస్తూ,తన ఆ అనుభవ సారముతో "రామ రాజ్యము"ను ఎలాగ రూపొందించ గలము?"అని అహో రాత్రులూ మధన పడి,అహర్నిశలూ శ్రమించి,రూపొందించిన ఉద్గ్రంధమే...

(Telugu) జల్లెడల పద్ధతి

[:te]ఒక సారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు. మొదటి జల్లెడ “నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు. “అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు. సరే రెండో జల్లెడ “మంచి ” – ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు, “కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు . “అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు. మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గు...

(Telugu) చాణుక్యుని "నీతి దర్పణము"

[:te] క్రీ//పూ//300సంవత్సరములలో నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము వెలసినది.సర్వ కాలములలోనూ,సర్వావస్థలలోనూ సర్వ దేశములకూ ఆదర్శ ప్రాయమైన సిద్ధాంతాలను వచిస్తూ,నిర్వచిస్తూ ఈ మహోన్నత ప్రమాణాలు కలిగిన గ్రంధ రాజమును నిర్మించిన వ్యక్తి"విష్ణు గుప్తుడు".అతని తండ్రి పేరు "చణకుడు" అగుటచే "చాణుక్యునిగా" లోక ప్రసిద్ధి గాంచాడు."ద్రమిశుడూ,"కౌటిల్యుడు"అనే నామ ధేయములతో కూడా వ్యవహరించ బడే వాడు. చంద్ర గుప్త మౌర్యునికి కుడి భుజముగా నిలిచి,ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ,అలనాడే"శ్రేయో రాజ్యమును"నెలకొల్పిన ధీశాలి. నాటి మగధ రాజైన ధనక నందునితో విభేదించి,విరోధించి,చంద్ర గుప్త మౌర్యుని రాజుగా చేసి,పాటలీ పుత్రము రాజధానిగా ,సామ్రాజ్యము తీరు తెన్నులను రూప కల్పన చేసి,రాజ్య వ్యవహారాలను నిర్వహించేవాడు. చంద్ర గుప్తునికి మహా మంత్రిగా,సలహా దారునిగా,సైనిక దళముల పర్య వేక్షకునిగా,పదవులను,బాధ్యతలను,చేపట్టి,బహు చాతుర్యంగా నిర్వహిస్తూ,తన ఆ అనుభవ సారముతో "రామ రాజ్యము"ను ఎలాగ రూపొందించ గలము?"అని అహో రాత్రులూ మధన పడి,అహర్నిశలూ శ్రమించి,రూపొందించిన ఉద్గ్రంధమే...

(Telugu) మరీ ముక్కు సూటిగా వుంటే ముక్కుకే ప్రమాదం!

Image
[:te] “A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first.”        –   Chanakya ‘మనిషి మరీ ముక్కుసూటిగా ఉండకూడదు. నిటారుగా ఉండే చెట్లను ముందు కూల్చేస్తారు. నిజాయితీగా ఉండేవారిని ముందు ఇబ్బందిపెడతారు.’ అది చాణక్యుని అనుభవ సారం. చాణక్య తత్త్వ సారం. చాణక్యుడు చణకుని కొడుకు. అందుకే అతనికి  చాణక్యుడు అన్న పేరు. అతని అసలు పేరు  విష్ణుగుప్తుడు. తన గోత్ర నామంతో ‘కౌటిల్యుడు’ అని కూడా ప్రసిద్ధుడు. అతడిని అవమానించడానికి కొందరు అతడి గోత్ర నామాన్ని ఉపయోగించుకుని, కుటిలుడని ప్రచారం చేశారు. అతని వ్యూహాలు శత్రుదుర్భేద్యమైన కుటిలత్వంతో కూడుకుని ఉండటం వల్ల కూడా ‘కౌటిల్యుడు’ అనే పేరు సార్ధకమైంది. ‘చాణక్య నీతి’ రాజనీతిజ్ఞులకు, రాజకీయ నాయకులకు శిరోధార్యమైంది. కుటిల రాజనీతిజ్ఞతకు, శత్రు నిర్మూలనలో అనితర సాధ్యమైన వ్యూహ చాతుర్యానికి అతడు ప్రపంచ రాజనీతిజ్ఞులకు మార్గదర్శకుడు. చాణక్యుడు అక్షరాలా కింగ్ మేకర్. మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుని అసమాన యోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా తీర్చిదిద్ది, రోమన్ చక్రవర్తి అలెగ్జాండర్ నే నిలువరించి భారతీయ మేధా శక్తిని, యుద్ధ న...

(Telugu) చాణక్య నీతి సూత్రాలు

[:te] ఆముదం చెట్టు ఆసరా చూసుకుని ఏనుగకు కోపం కలిగించ కూడదు ఎంత లావుగా పెరిగినా బురుగచెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించదు కర్నికారం (కొండగోడు) కర్ర ఎంత పొడవు గా ఉన్నా రోకలి గా ఉపయోగించదు ఎంత ప్రకాశిస్తున్నా మెరుగుడుపురుగు నిప్పు కాదు (ధనాదుల చేత) బాగా ఎదిగినంత మాత్రాన సద్గుణాలు రావు ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తెరకు (సరోతా) ఉపయోగపడదు విత్తనాన్ని బట్టి దిగుబడి ఉంటుంది చదువును పట్టి బుద్ధి కులాన్ని పట్టి ఆచారం (నడవడిక) ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు [:]

(Telugu) పురుషులు ఎవరితో పంచుకోకూడని 4 విషయాలు: భార్యకు సంబంధించిన రహస్యాలు మస్ట్ .!

[:te] ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని కూడా పలువురు చెబుతున్నారు. అయితే చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన నీతి సూత్రాల్లో కింద ఇచ్చిన కొన్నింటిని మాత్రం పురుషులు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. అలా చేస్తే జీవితంలో ఇక ముందుకెళ్లరట. ఇప్పుడు ఆ ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పవద్దట. డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదట. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరట. పైపెచ్చు అవతలి వారు ఏదైనా సహాయం చేస...

(Telugu) చాణక్య సూత్రాలు

[:te]* ముందు ఆత్మని సంపాదించుకున్న తరువాత, అనగా తనకు తాను చక్కబరుచుకున్న తరువాత సహయుల్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. * సహాయులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేడు .సుఖ దుఃఖాలు సమానంగా పంచుకున్నవాడే సహాయకుడు. * స్నేహితుడు కదా అని విద్యావినయాలు లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు . * ఆలొచనలు బయటపెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకుంటాడు. ఆలొచనలు చాలా రహస్యంగా ఉంచడం చాలా శ్రేష్టమైనది . * ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు. మిత్రులని సంపాదించడం చేత బలం చేకూరుతుంది. * లేనిదాన్ని సంపాదించడం , సంపాదించినదాన్ని రక్షించుకోవడం , దాన్ని వృద్ధి పొందించుకోవడం , తగినరీతిలో వినియోగించుకోవడం , ఈ నాలుగే రాజ్యతంత్రం అంటారు. * మద్య ఒకరాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజైనవాడు మితృడు. వీరిద్దరు సహజ శత్రుమిత్రులు. ఏదో ఒక కారణాన్ని బట్టి కూడా శత్రు, మిత్రులు అవుతుంటారు. * బలం తగ్గిపోయినవాడు సంధి చేసుకోవాలి . బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు. * బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకొవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో గాని , సమునితో గాని విరోధం పెట్టుకోకూడదు . * శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ...

(Telugu) చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలు

[:te] చాణక్యుడు ఎన్నో రహస్యమైన విషయాలను అర్ధమయ్యేలా సవివరంగా చెప్పాడు…అందులో భాగంగా స్త్రీల గురించి కూడా కొన్ని రహస్యాలను వివరించాడు…చానిక్యుడు మహిళల గురించి చెప్పిన ఈ విషయాలు తెలిస్తే ఎలాంటి అమ్మాయినైనా వశం చేసుకోవచ్చు… ఆ వివరాలు వివరాలు మీకోసం… అబ‌ద్దాలు చెప్ప‌డం, స్వార్థం, అసూయ‌, క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మూర్ఖ‌త్వం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం, క్రూర‌త్వం వంటి అంశాలు స్త్రీల‌లో ప్ర‌ధానంగా ఉంటాయ‌ట‌. వీటి వ‌ల్ల చాలా మంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతార‌ట‌. ఇవి వారికి బ‌ద్ద శ‌త్రువుల‌ట‌. పురుషుల క‌న్నా స్త్రీల‌కు ఆక‌లి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఏ విష‌యంలోనైనా స్త్రీ భ‌ర్త అనుమ‌తి తీసుకోవాల‌ట‌. అలా తీసుకోక‌పోతే ఆ భ‌ర్త ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌. అంతే కాదు, అలాంటి భ‌ర్త క‌న్నా భార్యే ముందు చ‌నిపోయి న‌ర‌కంలో బాధ‌లు అనుభ‌విస్తుంద‌ట‌. పురుషుడి శ‌రీరంలో ఉన్న బలాన్ని, శ‌క్తిని స్త్రీ ఒక్క దెబ్బ‌కే లాగేయ‌గ‌ల‌ద‌ట‌. మ‌ళ్లీ ఆ బ‌లం, శ‌క్తి పాలు తాగితేనే వ‌స్తాయ‌ట‌. యువ‌తి ఎంత అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెం...

(Telugu) చాణక్యుడి నీతి వాక్యాలు

[:te] ‘అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం  అనుమానం వచ్చినా సరే, యెంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి.లేకపోతే మొదటికే మోసం.’ ‘అన్ని  పాములు విషప్పురుగులు కావు.  విషపూరితం కాకపోయినా  పైకి అలా  కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.’ ‘ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన, తిరుగులేని  శక్తులు. ఒకటి యువశక్తి. రెండోది ఆడదాని అందం.’ ‘ఎవ్వడు కూడా  ఎలాటి స్వార్ధం లేకుండా మరొకడితో  జట్టు కట్టడు.  ఏ ప్రయోజం ఆశించకుండా  వుట్టిగా స్నేహం  చేస్తున్నానని ఎవడయినా  చెబితే దాన్ని నమ్మినవాడే  శుద్ద  అప్రయోజకుడు.’ ‘యెందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల  ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? - ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏపనీ మొదలు పెట్టవద్దు.’ ‘పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వొదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.’ ‘పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం  నాలుగు దిక్కులకూ వ్యాపిస్తుంది.’ ‘భగవంతుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం.’ ‘మంచి పుస్తకాలు మనిష...