(Telugu) జ్యోతిషానికి తొలి గురువు - పరాశరుడు
[:te]హిందువుల విజ్ఞానంలో జ్యోతిషానికి గొప్ప స్థానం ఉంది. మానవుల జీవితంలో శుభాశుభాలను అంచనా వేసేందుకే కాకుండా ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఈ జ్యోతిషాన్ని ప్రమాణికంగా నమ్ముతారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ జ్యోతిషశాస్త్రానికి ఒక భూమికను ఏర్పరిచినవాడు పరాశరుడు. ‘పరాశరహోర’ పేరుతో ఆయన రచించిన గ్రంథాన్ని ఇప్పటికీ భక్తితో అనుసరించేవారు ఉన్నారు. తండ్రి కోసం పగపట్టి సప్తర్షులలో ఒకరైన వశిష్టునికి, శక్తి అనే కుమారుడు ఉన్నాడు. ఆ శక్తిమహర్షికి జన్మించినవాడే పరాశరుడు. ఓసారి శక్తి మహర్షిని ఓ రాక్షసుడు సంహరించేశాడు. దాంతో తన తండ్రి చావుకి కారణమైన రాక్షసజాతి ఉండటానికి వీల్లేదని పరాశరుడు పగపట్టాడు. ఆ పగతో ఆయన వందలాది రాక్షసులను సంహరించాడు. చివరికి పరాశరుని శాంతింపచేసేందుకు సాక్షాత్తూ అతని తాత వశిష్టుడు దిగిరావల్సి వచ్చింది. ‘వ్యక్తిగత ద్వేషంతో సృష్టిధర్మాన్ని తిరగరాయద్దని’ వశిష్టుడు నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు. జాలరి అమ్మాయితో ప్రేమ పరాశరుడు సకలశాస్త్రాలనూ అభ్యసిస్తూ నిత్యం ప్రయాణించేవాడు. అలాంటి ప్రయాణంలో ఓమారు యమునా నదీ తీరాన ఉన్న ఓ జాలరి గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో అడుగుపెట్టిన పరా...