పులి - మేక

[:te]అనగనగ ఒక మేకల గుంపు అడవిలోకి వెళ్లి మేత మేస్తు ఉండేవి కానీ ఒక రోజు మేకపోతు గుంపు నుండి విడిపోయింది. అది దారి తెలియక ఒక గుహలోకి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఉన్న ఎముకులను చూసి భయపడింది. ఇది పులి ఉండే గుహ అని తెలుసుకున్నది.దానికి భయం వెసిన్ధి. చీకటి పడే సమయం వచ్చింది. పులి రానే వచ్చింది .అది గుహ బయట ఉండగానే మేక దానితో ఆగు నేను నిన్ను చంపి తినటానికే వచ్చాను అన్నాది . పులి ఒక్కసారిగా కంగు తిన్నది. నేను నీ కన్నా పెద్ద మృగాన్ని నిన్ను చంపి తినటమే నాకు కావాలి అన్నది మేక. దానితో పులి కంగారు పడింది. మేక గడ్డాన్ని,మెరిసే కళ్ళను, వాడిగా పెరిగిన కొమ్ములను చూసింది. అవును ఇది నాకన్నా పెద్ద మృగం లాగా కనిపిస్తుంది. అనుకున్నది పులి. ఈ మృగం తో మనకు ఎందుకు వచ్చింది బతికి ఉంటె ఏదో జంతువుని తిని ఉండవచ్చు అనుకుని అక్కడనుంచి నెమ్మదిగా పులి జారుకున్నది.ఉదయం అయ్యేంత వరకు అక్కడే ఉండి. ఉదయం అవ్వగానే అటుగా వెళుతున్న తన గుంపుతో వెళ్లి పోయింది తరువాత మళ్ళి ఇటు వైపుకే రాలేదు .

నీతి:భయం వేసినప్పుడు భయాన్ని పక్కన పెట్టి ఆలోచనాతో అడుగులు వెయ్యాలి.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము