Posts

Showing posts with the label పవిత్ర గ్రంధాలు

పవిత్ర గ్రంధాలు

మానవుని జీవితం మీద పవిత్ర గ్రంధాల ప్రభావం ఎంతైనా ఉంది. సామాజిక వ్యవస్థను తీర్చిదిద్ది, క్రమబద్ధం చేసేవి పవిత్ర గ్రంధాలు. కాబట్టి ప్రతి మతంలోనూ ఈ గ్రంధాలకు పవిత్రత, గౌరవం ఉంది. నిత్య సత్యాలను ప్రకటించేవి వేదాలు. ప్రజల యొక్క ధార్మిక తత్వాన్నీ, సాంస్కృతిక సంపదను వెల్లడి చేసేవి వేదాలు. ప్రతి మతానికీ ఆ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంధాలు ఉన్నాయి. ఆయా పవిత్ర గ్రంధాలను అనుసరించే ఆయా మతాలు నిరూపించబడుతున్నాయి. మన ప్రాచీన ఋషులు ఎంతో శ్రద్ధగా వేద రచన చేశారు. వేద రహస్యాలు దేవతలు చెప్పగా ఋషులు విని పఠించినవి. కాబట్టే వీటిని శృతులు అన్నారు. ఈ శృతులను క్రమబద్ధం చేసి ప్రచారం చేసిన ఘనకీర్తి వేదవ్యాసుల వారికే దక్కుతుంది. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, స్దామవేదం, అధర్వణవేదం అని నాలుగు విభాగాఉగా ఉనాయి. మన సంస్కృతి అంత వేదాల మీదే ఆధారపడి ఉంది. ప్రపంచంలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. దీనిలో మొత్తం 10,500 ఋక్కులున్నాయి. కొన్ని ఋక్కులను కలిపి సూక్తం అంటారు. ఋగ్వేదంలో 1017 సూక్తులున్నాయి. ఈ సూక్త్లు తిరిగి మండలాలుగా విభజించబడ్డాయి. ఋక్కులలో స్తోత్రాలు, ప్రార్ధనలు, మంత్రాలు, సాధారణ పాటలు ఉన్నాయి. మతాలన్నిటికంటే హిందు మ...