Posts

Showing posts with the label దక్షిణాయనము

దక్షిణాయనము

Image
ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగిన మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్థం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే, అది సరిగ్గా తూర్పు దిశలో జరుగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే. మొదటిది సెప్టెంబరు ఇరవై మూడవ తేది. రెండవది మార్చి ఇరవై ఒకటవ తేది. మిగతా రోజులలో ఆరు నెలల కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగానూ, మరో ఆరు నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగానూ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు కాలాన్ని రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి లోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారటాన్నే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోనూ సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ప...