Posts

Showing posts with the label వసంత పంచమి

వసంత పంచమి

Image
  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు . దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది . శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు . మన రాష్ట్రములోని బాసర క్షేత్రం లోనూ , మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు .ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని హేమాద్రి తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది. వసంతరుతు...