Posts

Showing posts with the label అందమే ఆనందం

ఇవి కూడా ఫేస్ ప్యాక్‌లే!

ఫేస్‌ ప్యాక్‌ అనగానే ముల్తానీ మట్టి, పెరుగు, తేనె, పసుపు... ఇలాంటి పదార్థాలే గుర్తుకువస్తాయి. కానీ మన చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా పదార్థాలనే ఫేస్ ప్యాక్‌ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. కాదేదీ ఫేస్‌ ప్యాక్‌కు అనర్హం అనేది వారి మాట! టమాటా ఫేస్ ప్యాక్‌ వంటకాలకి రుచి తేవాలన్నా, ఒంటికి పోషకాలు లభించాలన్నా టమాటాను మించింది లేదు. అలాంటి టమాటాని మొహానికి పట్టిస్తే అందానికి కూడా తిరుగుండదంటున్నారు. ఇందులో ఉండే A విటమిన్‌ చర్మానికి కాంతిని ఇస్తుంది. ఇక పులుపుదనంతో కూడిన C విటమిన్‌ మొటిమల వంటి సమస్యలు దూరమవుతాయి. టామాటాల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. పుదీనా ఫేస్ ప్యాక్‌ టూత్‌పేస్టు దగ్గర నుంచి టీ పౌడరు వరకూ వీలైనన్ని పదార్థాలలో పుదీనాని వాడతాం. పుదీనా కలిగించే తాజాదనం, సువాసన అలాంటిది మరి! టామాటాలో ఉన్నట్టే పుదీనాలో కూడా A,C విటమిన్లు పుష్కలంగా కనిపిస్తాయి. వీటికి తోడు పుదీనాలో ఉండే మెగ్నీషియం చర్మం పైపొరలో జరిగే రక్తప్రసరణను పెరుగుతుంది, జిడ్డుదనాన్ని తగ్గుతుంది. ఇక పుదీనా ఫేస్ ప్యాక్‌తో చర్మం తాజాగా మారిపోతుందని వేరే చెప్పాలా! బంగాళ...

(Telugu) కాటుక కళ్లతో లోకానికే అందం!

[:te]మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి. ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు! అది కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనదీ కాదు! దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టు వాసులు కాటుకని ధరించేవారన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆనాటి చిత్రాలను గమనించినప్పుడు వారు కాటుకని ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం! ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వల్లే కనుగుడ్డు ఎటు కదులుతోందో? మనిషి కళ్లు పలుకుతున్న భవాలు ఏమిటో? తెలుస్తాయి. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని పూయడం వల్ల కళ్ల పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు. తెల్లటి భాగ...

(Telugu) బ్యూటి టిప్

[:te]ఒక టీ స్పూన్ మీగడలో అంతే మోతాదులో నిమ్మరసం కలిపితే హోమ్‌మేడ్ క్లెన్సింగ్ క్రీమ్ రెడీ. దీనిని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో కాని గోరువెచ్చటి నీటితో కాని శుభ్రం చేయాలి. ఇది చర్మానికి టోనర్‌గా పని చేస్తుంది. చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడా. *రోజుకు ఒక టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి చప్పరిస్తే క్రమంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. *టేబుల్ స్పూన్ శనగపిండి, ఒకటిన్నర టీ స్పూన్ల నీళ్లు, చెంచాడు తేనె కలిపి ముఖానికి రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. *నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖం నిగనిగలాడుతుంది.[:]

(Telugu) మెరిసెందుకు టమాటా రసం

[:en]మెరిసెందుకు టమాటా రసం అన్ని ఇంట్లొ దొరికె పండ్లు, కూరగాయలే వీటితొనే అందాన్ని సంరక్షించు కొవచ్చు కీరదోస రసానికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్లో భద్రపరచండి. ఎండలోకి వెళ్లడానికి గంట ముందూ, వచ్చిన తరవాతా ముఖానికి రాసుకోవాలి. గంధం పొడికి చిటికెడు పసుపూ, కొంచెం పాలూ కలిపి ముఖానికి రాసుకొని, కొన్ని నిమిషాలయ్యాక కడిగేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది. తేనెకి పాల మీగడని కలిపి ముఖానికి మర్ధన చేసుకోవాలి. ఇలా వారానికి నాలుగైదు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. తాజా పాలకి, చిటికెడు ఉప్పూ నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ రంద్రాలు శుభ్రపడి తెరుచుకుంటాయి. దీనివల్ల ముఖం తాజాగా ఉంటుంది. అలాగే బొమాటో రసానికి నిమ్మరసం కలిపి రాసుకున్నా మంచిదే. నెయ్యి గ్లిజరిన్ కలిపి రాసుకుంటే, మంచి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, గులాబీ | రేకలూ, వేపాకులూ, తులసి ఆకులూ కలిపి మిక్సీలో పేస్తులా చేసుకుని ముఖానికి రాసుకున్నా మంచిదే. [:de]మెరిసెందుకు టమాటా రసం అన్ని ఇంట్లొ దొరికె పండ్లు, కూరగాయలే వీటితొనే అందాన్ని సంరక్షించు కొవచ్చు కీరదోస రసానికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఆ మి...