(Telugu) పెళ్ళి.. పిల్లలు.. మరి ఉద్యోగం?

[:te]*కుటుంబం కోసం మహిళల కొలువుల త్యాగం
*వారి ఇంటి దగ్గరే పని కల్పిస్తున్న సంస్థలు
భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులు... పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ సందర్భాల్లో ఉద్యోగినులు తమ కొలువులను వదులుకుంటున్నారు. అప్పటివరకు సమర్ధంగా పనిచేసిన వారు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. తమను తాము నిరూపించుకోవాలనుకునే ఆకాంక్షలను వదిలేసుకుంటున్నారు. బాధ్యతలు తీరాక తిరిగి కొలువులో చేరదామంటే అవకాశాలు చిన్న చూపు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయిని నిపుణులు అంటున్నారు.
జనాభాలో సగం.. పనిచేసే చోట మాత్రం ఉద్యోగినులు 28 శాతం. ప్రపంచ సగటు ఇది. మన నగరంలో ఇది ఇంక తక్కువ. ఐటీ రంగాల్లో దాదాపుగా సమానంగా కనిపొస్తోంది. మిగతా రంగాల్లో ఇప్పుడిప్పుడే క్రమంగా వీరి శాతం పెరుగుతున్నా.. ఆ వెంటనే బంధాలు వారిని వెనక్కి లాగుతున్నాయి. ఉద్యోగమా? పిల్లల ఆలనాపాలనా? అంటే రెండోదానివైపే ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. ప్రభుత్వ కొలువుల్లో మినహా ప్రైవేటు సంస్థల్లో మహిళలు త్వరగా ఉద్యోగాల నుంచి వైదొలుగుతున్నరు. వివాహమై.. పిల్లలు పుట్టగానే ఎక్కువమంది మహిళలు పనివేళలు సర్దుబాటు కాక ఉద్యోగాలు మానేస్తున్నారు. వృత్తిపరమైన నైపుణ్యమున్నా సమయం సర్దుబాటు చేయలేక వదులుకుంటున్నారు.
వదల్లేక వదులుతున్నారు
అమ్మాయి ఉద్యోగం చేస్తే వరుడు దొరకడం సులభమవుతుంది.. కట్నం తక్కువగా ఇవ్వొచ్చు.. ఇది తల్లిదండ్రుల ఆలోచన. భర్త సంపాదనకు వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడవుతాయని కుటుంబానికి ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవని భార్యల భావన. ఇప్పటికీ ఇలా ఆలోచించేవారు ఉన్నా.. ఈతరం అమ్మాయిలు అంతకుమించి తమ వ్యక్తిత్వం కోసం.. తమను తాము నిరూపించుకునేందుకు ఉద్యోగాలు, వృత్తులు చేపట్టాలనుకుంటున్నారు. ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పురుషులతో పోటీపడికొలువులు దక్కించుకున్నా.. మధ్యలోనే అర్ధంతరంగా వదిలేయాల్సి రావడం వారిని కలిచివేస్తోంది.
సవాళ్లున్నా..
బహుళజాతి సంస్థల రాకతో నగరంలో కార్యాలయాలు 24 గంటలు పని చేస్తున్నాయి. వేళాపాళా లేదు.. రాత్రిళ్లూ పనిచేయాల్సి వస్తోంది. ఆరోగ్య, భద్రతా సమస్యలు ఒకవైపు.. కుటుంబ బాధ్యతలు మరోవైపు వీరికి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడం అందరి వల్లాకావడం లేదు. ముఖ్యంగా చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆర్ధికంగా ఇబ్బందిలేని వారు తమ ఇష్టమైన ఉద్యోగాన్ని,వృత్తులను త్యాగం చేస్తున్నారు.

బాధ్యతలు తీరాక
పిల్లలు పెద్ద కావడం.. కొంత వెసులుబాటు వచ్చాక తిరిగి కొలువుల్లో చేరాలనుకుంటే మాత్రం అవకాశాల పరంగా రాజీపడాల్సి వస్తోందని మహిళలు అంటున్నారు. విదేశాల్లో మాదిరి ఇక్కడ వారంలో నెలలో కొన్ని గంటల పని చేయించుకునే సంస్కృతి ఉండాలని కోరుకుంటున్నారు.
*కార్యాలయానికే రాచాల్సిన పనిలేదు.. ఇంటి దగ్గరా చేసుకోవచ్చు. నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేస్తే చాలు. ఆ మేరకు కంపేనీలు ప్రత్యేక అసైన్‌మెంట్లను మహిళలకు కేటాయిస్తున్నాయి. వేళల్లో వెసులుబాటును కల్పిస్తున్నాయి.
*ఐటీ, ఐటీయేతర కంపేనీల్లో అవకాశాలతో పాటూ మరెన్నో రంగాల్లో మహిళలకు అవకాశాలు ఉన్నాయని... ప్రత్యేకించి కొన్ని వెబ్‌సైట్స్ ఈ తరహా సేవలు అందిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇంటిదగ్గర, పరిమితవేళల్లో చేసే పనిని, అసైన్‌మెంట్లను సంస్థలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని చెబుతున్నారు.
*ఈ-బిజినెస్‌లోనూ కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. పరిమిత గంటలు పనిచేస్తే చాలు.
*కొన్ని సంస్థలు పార్ట్‌టైమ్ ఉద్యోగులతో పని చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీవో, కేపీవో, ఐటీ సంస్థల్లో ఈ తరహా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
*క్షేత్రస్థాయి ఉద్యోగాలకు మహిళలు సై అంటున్నారు. మొదటి ప్రాధాన్యం మాత్రం డెస్క్‌టాప్ ఉద్యోగాలకే ఇస్తున్నారు. ఇప్పటికీ ఎక్కువగా టెలీకాలర్స్, టెలీ మార్కెటింగ్ అవకాశాలను మహిళలకు ఎక్కువ కల్పిస్తున్నాయి.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము