Posts

Showing posts with the label విజయదశమి

నవరాత్రోత్సవము(దసరా)

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈపండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బ...

ఆయుధపూజ

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఆంధ్రుల కనకదుర్గ...తెలంగాణ ‘బతుకమ్మ’...కన్నడిగుల చాముండి... ఇలా ప్రాంతాలు వేరయినా..విశ్వవ్యాప్తంగా ఎవరు ఏ పేరున పిలచినా...కొలిచినా విజయదశమి పర్వదినాలలో దేవి తన భక్తులను అనుగ్రహించి... ఎవరైతే త్రికరణశుద్థిగా, సత్సంకల్పసిద్ధితో కార్యక్రమాన్ని తలపెడతారో వారి మనోసంకల్పాన్ని జయప్రదంచేసి అష్టైశ్వర్యములు ప్రసాదించే భాగ్యప్రధాయని. అందుకే అంబిక,దుర్గ,భవాని..ఇత్యాది ఏ పేరున పిలచినా పలికే అమ్మలగన్న అమ్మగా...ముజ్జగాలకే మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విజయానికి ప్రతీకగా..చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా సదా ఈ పర్వదినాన్ని ప్రజలంతా జరుపుకుంటారు. అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట padakundaa శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు. అజ్ఞాతవాస ముగింపులో విజయదశమినాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాద...

అన్నపూర్ణ దేవత

Image
అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద...

(Telugu) రామ్‌లీల- రావణదహనం

[:te]దసరా అనగానే దక్షిణాదిన అమ్మవారి పూజకి ఎంతగా ప్రాధాన్యత ఉంటుందో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు. వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు... రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ, చివరి రోజున ‘రావణ దహన్‌’ పేరుతో రావణుని భారీ దిష్టిబొమ్మను కాలుస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉత్తరాదిన ఘనంగా సాగే ఈ రామ్‌లీల సంప్రదాయం ఎప్పుడు మొదలైంది అన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 500 ఏళ్లకు పైగానే, ఈ ఆచారం కొనసాగుతోందని మాత్రం జానపద సాహిత్యం ద్వారా తెలుస్తోంది. కాకపోతే 16వ శతాబ్దంలో తులసీదాసు రామచరితమానస్‌ను రాసిన తరువాత, దాని ఆధారంగా రామలీలలు రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. అప్పటివరకూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని ప్రజలు నిత్యం మాట్లాడుకునే హిందీలో తనదైన శైలిలో అనువదించడంతో, రామచరితమానస్‌ ఇంటింటి రామాయణంగా మారిపోయింది. దానిని ఆధారం చేసుకుని తులసీదాసు శిష్యుడైన మేఘాభగత్‌ రామ్‌లీలకు మరింత ప్రచారాన్ని కల్పించాడు. ఉత్తరాది అంతటా రామ్‌లీల ఫలానా చోట ఫలానా విధంగా సాగుతుందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఉ...

(Telugu) జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?

[:te]దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి. కాస్త జమ్మి గురించి... జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది. పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు...

(Telugu) నవరాత్రి ప్రాముఖ్యత

[:te]హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో, దేవతకి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు! అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు... అది చలనానికి ప్రతీక! ఆ శక్తిని భిన్నరూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. శక్తి ఆరాధన విశ్వంలోని స్త్రీ తత్వాన్ని ఆరాధించేందుకు నవరాత్రులు ఓ గొప్ప సందర్భం. ఆ స్త్రీ మనకు మాతృమూర్తిగా (దుర్గ), ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లిగా (లక్ష్మి), జ్ఞానాన్ని అందించే తొలిగురువుగా (సరస్వతి) సుపరిచితమే! అందుకనే కొందరు నవరాత్రులో మూడు మూడు రోజుల చొప్పున ఈ దేవతలను ఆరాధిస్తారు. మరికొందరు బాలపూజ, సువాసినీ పూజ పేరుతో చిన్న పిల్లలనీ, ముత్తైదువలనూ సాక్షాత్తూ అమ్మవారిగా భావించి పూజచేస్తారు. సృష్టిలోని శక్తికి స్త్రీలంతా ప్రతిరూపాలే అని భావించి, వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది. కుండలిని మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము. మనిషి మనిషిలోనూ ఉన్న ఆ షట్‌చక్రాలను ఛేదించిన రోజున తనకీ, ఈ సృష్టికీ మధ్య ఉన్న అభేదాన్ని గ్ర...

(Telugu) దసరాలో ఆసక్తికరమైన ఆచారాలు

[:te]భారతీయ పండుగల సమయంలో దేవీ దేవతలను ఆరాధించుకోవడం ఒక ఎత్తైతే... ప్రాచీన సంప్రదాయాలని ఆచరించడం మరో ఎత్తు. వినాయక చవినినాడు పత్రి పూజ, సంక్రాంతి నాడు పశువుల పూజ, దీపావళినాడు బాణాసంచా పేలుడు... ఇలా ప్రతి పండుగతోనూ మనకి తెలియకుండానే ఆచారాలను అప్రతిహతంగా కొనసాగిస్తూ వస్తున్నాము. ఇక నవరాత్రుల సందర్భంలో అయితే చెప్పనే అక్కర్లేదు. రావణదహనం, ఆయుధపూజ వంటి ఆచారాలతో పాటుగా దేశంలోని నలుమూలలా పలు సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవి ఇవిగో... ఘటస్థాపన దక్షిణభారతంలో నవరాత్రులు తొమ్మిదిరోజులూ అమ్మవారిని కలశరూపంలో ఆరాధించే సంప్రదాయం ఉంది. కానీ ఉత్తరభారతంలో ఈ ఆచారం మరికాస్త విభిన్నంగా కనిపిస్తుంది. ఘటస్థాపన పేరుతో సాగే ఈ క్రతువులో కుండలో మట్టి పోసి దాని మీద బార్లీ గింజలను చల్లుతారు. తొమ్మిదిరోజుల పాటు ఆ ఘటాన్ని అమ్మవారిగా భావించి పూజిస్తారు. ఇక నవరాత్రులు ముగిసిన తరువాత ఆ బార్లీ మొలకలను ప్రసాదంగా పంచుతారు. ఈ క్రతువుకు రెండు కారణాలు కనిపిస్తాయి.  ఒకటి- వ్యవసాయాన్ని శాసించే ప్రకృతికి ప్రతీకగా అమ్మవారిని భావించడం, రెండు- సంతాన సాఫల్యానికి అమ్మవారి అనుగ్రహం అవసరం అన్న నమ్మకం. మన నాగరిక...

(Telugu) దసరా చెప్పే కబుర్లు

[:te]భారతీయ జీవనంలో పండుగలు ముఖ్యమైన భూమికలు. అవి మన జీవితాల్లో సందడిని మాత్రమే కాదు. మనసుల్లోకి వెలుగుని కూడా తీసుకువస్తాయి. అలా దసరా నేర్పే కొన్ని మంచి విషయాలు… దశహర: రావణాసురుడిని రాముడు దసరా రోజునే సంహరించాడట. దశ కంఠుని హరించాడు కాబట్టి `దశ హర` అనే పేరుమీదుగా దసరా వచ్చిందని కూడా ఓ నమ్మకం. ఇంతకీ రావణాసురునికి పదితలకాయల వెనుక ఏదన్నా అంతరార్థం ఉందా అంటే ఒక్కొక్కరూ తమకి తోచిన జవాబుని చెబుతారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల (మొత్తం కలిపి 10) మీదా అదుపులేనివాడు అన్న సూచనే పది తలలు అని కొందరు; అరిషడ్వర్గాలతో పాటు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలకి పది తలలు ప్రతీక అని మరి కొందరు అంటారు. ఎవరు ఎలా నిర్వచించినా రావణాసురుడు విపరీతమైన అహంకారానికి ప్రతీక అన్నది మాత్రం అందరూ ఒప్పుకునేదే! అలాంటి విపరీతమైన అహంకారం మన పీకలమీదకి వస్తుందనీ, ఆ అహంకారాన్ని జయించిన ప్రతివాడూ దైవసమానుడనీ తెలియచేస్తుంది దసరా! మహిషాసురుడు: ఒకరిలో చలనం లేకపోతే `దున్నపోతు మీద వానపడినట్లు` అంటాము. ఒకరిలో సంస్కారం లేకపోతే `మనిషా దున్నపోతా!` అని తిట్టుకుంటాం. మొత్తానికి మందకొడితనం, అజ్ఞానం, విచక్షణ లేకపోవడానికి మనం దున్నప...

(Telugu) విజయానికి ఎనిమిది మెట్లు – విజయదశమి!

[:te]మహిషాసురుని అంతమొందించిన విజయదశమి రానే వచ్చింది. మహిషాసురుడంటేనే దుర్గుణాలకు ప్రతీక. మరి దుర్గాదేవేమో శక్తి స్వరూపం. దేవతలంతా తమ శక్తిని చేర్చి, ఆయుధాలన్నింటినీ కూర్చి సన్నద్ధం చేసిన దేవత దుర్గ. ఇప్పటి రోజుల్లో మహిషాసురుడు లేకపోవచ్చు. కానీ అజ్ఞానం, అలసత్వం, అపజయం వంటి దుర్గుణాలన్నీ మహిషునితో సమానమే. ఆ బలహీనతలను జయించలేకపోతే, జీవితమనే యుద్ధంలో పరాజయం తప్పదు! ఒక్కసారి ఆ కనకదర్గను కళ్లముందు నిల్పుకుంటే ఆమె ప్రతి చేతిలోనూ విజయానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. శంఖం: యుద్ధాన్ని ప్రారంభిస్తూ అమ్మవారు శంఖాన్ని పూరించగానే, మహిషాసురుని గుండెలు అదిరిపోయాయి. శంఖాన్ని పూరించడం అంటే సమరానికి మనం సన్నద్ధమన్న విషయాన్ని తెలియచేయడమే. శ్రీకృష్ణుని పాంచజన్య నినాదంతోనే కదా కురుక్షేత్రం మొదలైంది. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా వెనుతిరగకుండా, దాన్ని ఎదుర్కోవాలని శంఖం చెబుతోంది. అనుకున్న పనిని సాధించేందుకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాన్ని అది అందిస్తోంది. విల్లు, బాణం: విల్లుని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించడం లక్ష్యసాధనను గుర్తుచేస్తుంది. ప్రతి మనిషికీ ఏదో ఒక లక్ష్యం ఉండాలి. బాణాన్ని సంధించాలి అంటే ఏదో ఒక గు...