శకున ఫలితములు
తేనెపట్టు : తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం. అరటిగెల : తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం మొండిచేయ్యి : తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును. పుట్టు మచ్చల ఫలితములు ముక్కుమీద - కోపము, వ్యాపార దక్షత కుడికన్ను - అనుకూల దాంపత్యము ఎడమకన్ను - స్వార్జిత ధనార్జన నుదిటి మీద - మేధావి, ధన వంతులు గడ్డము - విశేష ధన యోగము కంఠము - ఆకస్మిక ధన లాభం మెడమీద - భార్యద్వారా ధనయోగం మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట పొట్టమీద - భోజనప్రియులు పొట్టక్రింద - అనారోగ్యం కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు బొడ్డులోపల - ధనలాభములు కుడితొడ - ధనవంతులు ఎడమతొడ - సంభోగం చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర...