Posts

Showing posts with the label ఆశ్రమధర్మాలు

నారదుడు చెప్పిన ఆశ్రమధర్మాలు

పూర్వం బదరికావనంలో నారాయణుని వలన విన్న సనాతన ధర్మాన్ని నారదుడు ధర్మరాజుకు వివరించాడు. ఆంధ్ర మహాభాగవతం ఏడవస్కంధంలో ఈ భాగాన్ని చూడవచ్చు. ప్రజలందరకు ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు ముచ్చటగా ముప్పది. సత్యం ,సంతోషం , సమదృష్టి , సదసద్వివేకం, శౌచం, క్షమ, దయ, మార్దవం,మనోనిగ్రహం, మహాజనసేవ, మితభాషిత్వం, ఇంద్రియజయం, బ్రహ్మచర్యం, ప్రతిప్రాణిలోను పరమాత్మను చూచుట, దానం, అభేదబుద్ధి తో నుండుట, ఉపవాసాదికం, అహింస, ఆత్మావలోకనం , అన్నోదకాలను పంచిఇవ్వడం, అసభ్య వాంఛలు,అనర్ధకమైన క్రియలు విడిచిపెట్టడం, దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయ ణుని చరణాలను స్మరించడం, కీర్తించడం, కథాశ్రవణం,సేవ, ఆరాధనం, నమస్కృతి, దాస్యం, సఖ్యం, ఆత్మ సమర్పణం అనే ముప్పది గుణాలు అలవడాలి. ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసమ ని నాలుగు రకాలు. బ్రహ్మచారి అనేవాడు మౌంజీ, కౌపీనం, యజ్ఞోపవీతం, కృష్ణాజినం, పలాసదండం, కమండలం, దర్భలను ధరించి ఉండాలి. కేశ సంస్కారం చేసుకోకూడదు. మౌనంగా ఉండాలి. మూడు సంధ్యల లోను బ్రహ్మ గాయత్రిని జపించాలి. ప్రాతస్సంధ్యా కాలాలలో సూర్యోపాసన , అగ్ని ఆరాధన, గురపూజ , దేవతార్చన చేస్తుండాలి. గురువు గారి ఇంటిలోనే సేవకునివలే భక్తి విన...