Posts

Showing posts with the label సుమతీ శతకం

(Telugu) సుమతీ శతకము.!.......లో కొన్ని పద్యాలు

[:te] పూర్వ కాలంలో ఈ సుమతీ శతకం లోని పద్యాలు రాని వారు తెలుగునాట ఉండేవారు కారు.కాని ఇప్పుడు ఇంగ్లీషు Rhymes ను తమ పిల్లల చేత పాడించుకుంటూ తన్మయం లో మునిగిపోయి , మమ్మీడాడీ లమై పొయిన మనం ఈ నీతిశతకాలను మరచి పోవుచున్నారు.  అందుకనే నావంతుగా ఇందు పొందు పరుస్తున్నాను  అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా నెక్కినఁ బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ ! ఓ సుమతీ.! అవసర సమయం లో వచ్చి సహాయ పడని బంధువు , నిత్యము పూజలు చేసినా కష్టాలొచ్చినపుడు ఆదుకోని దేవుడు , యుద్ధరంగము లోకి దూకిన తరువాత పరుగెత్తని గుఱ్ఱము , ఇవి ఉండి కూడ ప్రయోజనం లేనివి కాబట్టి వీటిని వెంటనే వదలివేయాలి. బంధము వలన ఏర్పడేదే బంధుత్వము . వారి పిల్లను మనం చేసుకోవడమో , మన పిల్లవాడిని వారికివ్వడమో ఇటువంటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాల మూలంగా ఏర్పడే వాళ్ళే బంధువులు . మంచి చెడ్డలకు కలిసి వస్తారనే కదా వారిని మనం కలుపు కొనేది. మరి అవసర సమయం లో ఉపయోగని ఆ బంధము ఉన్నా లేకపోయినా ఒకటే కదా.! కొలువు అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ ! ఓ సుమతీ.! ...

(Telugu) సుమతీ శతక సూక్తులు

[:te] కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దోసంగ బట్టము కట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతీ భావం: ఒమంచి బుద్ధి గలవాడ! కుక్కది హీనగుణము దానిని మంచి ముహుర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చుండ బెట్టినను హీనబుద్ధి విడవడు. అట్లే హీనుని ఉన్నత స్తానమున కూర్చుండబెట్టినను అతని బుద్ధి మారదు. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ ! ఓ సుమతీ! భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు దాచి ఉంచిన బంగారం రాజులపాలై అతనికి ఉపయోగపడక పోవును. తలనుండు విషము ఫణికి వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్లా విషము గదరా సుమతీ! భావం: ఓ సుమతీ! పామునకు తలయందు విషము ఉందును.తేలుకు విషము తోకలో ఉండును. కానీ, దుర్మాగుడైన మనిషికి తల ,తోక యనక శరీరమంతయు విషము ఉందును. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టాడు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పోదుర సుమతీ! భావం: ఓ సుమతీ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగడుతున్నప్పుడు ఆ తం...

(Telugu) సుమతీ శతక పద్యాలు ...

[:te]ఉత్తమ గుణములు నీచున కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా నెత్తిచ్చి కఱగిపోసిన నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ ! వివరణ : ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లుకానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు . --------------------------------------------------------- అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ! వివరణ : అడిగినప్పుడు జీతమియ్యని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది. -------------------------------------------------------- కనకపు సింహాసమున శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం దొనరఁగఁ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! --------------------------------------------------- స్త్రీల యెడల వాదులాడక బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నింద సేయకెన్నడు సుమతీ! వివరణ : స్త్రీలతో ఎన్నడూ గొడవ పడద్దు, చిన్న పిల్లలతో స్నేహం చేసి మట్లాడవద్దు, మ...

(Telugu) శ్రీరాముని దయచేతను

[:te] శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ! తాత్పర్యం:  మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.[:]

(Telugu) అక్కరకు రాని చుట్టము

[:te] అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! తాత్పర్యం :  అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడుముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును. ఈ పద్యం లో అవసరం లో మన వెంట రాని బంధువులను వదిలెయ్యడమే మంచిదని చెప్తున్నారు. ఈ విషయం లో ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒకఅనుభవం ఎదురయ్యే ఉంటుదని నా అభిప్రాయం. చిన్నప్పటి నుంచి ప్రతీ ఇంట్లో బంధువులను గురించి వచ్చిన ఎన్నో సమస్యలు చూసేఉంటాము. అసలు మనకి ఏదన్నా సమస్య వస్తే దాని పర్యవసానం గురించి బాధ పడటం కన్నా మన బంధువులు ఏమనుకుంటారు, మన గురించి మనకుటుంబాలలో ఎలాంటి మాటలు వినాల్సివస్తుంది అన్న విషయాలే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంటాయి. ఓకోసారి వాస్తవం లో జరిగే దాని కన్నా ముందుగానే ఎక్కువ ఊహించి భయపడి బాధపడే వాళ్ళను నేను, మీరు చాలా సార్లు చూసే ఉంటాము. ఏదయినా విషయం లో మనకి జరిగితే ఎలాస్పందిస్తామో ఎదుటి వాళ్ల గురించి కుడా అలాగే ఆలోచించగలిగితే మనిషిగా మన జీవితానికి కొంతైనా సార్ధకత్వం వస్తుందని నా అభిప్రాయం. ఎలాంటిమాటలక...

(Telugu) అడిగిన జీతంబియ్యని

[:te] అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! తాత్పర్యం :  అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకునిపొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది. కూటికోసం కోటి విద్యలు అన్నట్టుగా...మన జీవనభ్రుతి కోసం ఎక్కడో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం. యజమాని దగ్గర వినయ విధేయతలతో మనకి అప్పగించిన పనిని నిజాయితీగా, బాధ్యతగా చేస్తూ ఉంటాం.  ఐతే ...  అందరు   boss లూ  ఒకలా   ఉండరు  :)  మన చేత బాగా గొడ్డు చాకిరీ చేయించుకుని న్యాయంగా జీతం పెంచాల్సివచ్చినప్పుడు కానీ , తప్పనిసరి అవసరానికి సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, చాలా నిర్ధయగా, అధికార గర్వంతో ప్రవర్తించే యజమాని (boss :) ) దగ్గర ఉద్యోగం చేయడం కన్నా మన సొంత శక్తుల మీద ఆధారపడి బతకడం మేలు అని ఈ పద్యం నుంచి భావం వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా మనకి అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి... ఈ సుమతీ పద్యాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకుందాం. మీరేమంటారూ మరి?? మరొక చిన్న విషయం... ఈ పద్యంలో  మిడిమేలం  అని ఒక పదప్రయోగం ఉంది. గమనించారా..? గర్వం, ...

(Telugu) అడియాస కొలువుఁ గొలువకు

[:te] అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌ విడువక కూరిమి సేయకు మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ! తాత్పర్యం :  వృధా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయంలేకుండా ఒంటరిగా పోకుము. ఈ పద్యంలో ఈ వృధా ప్రయాస అయిన సేవ చేయద్దని చెప్తున్నారు. ఒకోసారి మన యజమానికి ధర్మబద్దంగా ఆలోచించే మనస్తత్వం లేకపోతే, మనం ఎంతో కష్టపడి చేసే పని వల్ల కూడా మనకేమి ఉపయోగం కలగదు. మన సేవ వల్ల ఉపయోగం ఉండదని తెలిసినా కొన్ని పరిస్థితుల దృష్ట్యా తప్పక చేయాల్సివస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన వ్యక్తిత్వానికి సరిపడే నిర్ణయాన్ని తీసుకోడానికి, మళ్లీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి చాలా గుండె ధైర్యం కావాలి. కాని  " స్వధర్మే   నిధనం   శ్రేయః   పరధర్మో   భయావహః "  అని చెప్పినట్టుగా మన సొంత విలువలకి, నిర్ణయాలకి కట్టుబడి ఉంటే కష్టమైనా, సుఖమైనా అందులోనే ఆత్మ సంతృప్తి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక చెడ్డవారితో స్నేహం చేయకూడదని మనం చిన్నప్పుడు చాలా పంచతంత్రం కథల్లో నేర్చుకున్నాము. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అతని చుట్టూ ఉన్న స్నేహితులని బట్టి తెలుస...

(Telugu) అప్పుగొని సేయు విభవము

[:te] అప్పుగొని సేయు విభవము ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్‌ దప్పురయని నృపురాజ్యము దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ! తాత్పర్యం :   రుణము   తెచ్చుకొని   అనుభవించు   సౌఖ్యము ,  ముసలితనంలో   పడుచు   భార్య ,  తప్పులను   కనిపెట్టని   రాజురాజ్యము   సహింపరానివి .  చివరకు   హాని   కలిగించేవి . అప్పు చేసి పప్పు కూడు తరహాలో జీవించకూడదు.. అది ఎప్పటికైనా ముప్పే అని ఈ పద్యం చెప్తుంది. మన పెద్దవాళ్ళు అన్నట్టు పెళ్లి చేసుకోవడానికి కాస్త ఈడు జోడు ఉండాలి అంటూ ఉంటారు. నేననుకోడం ఏంటంటే ఈ శతకం రచనాకాలంలో కన్యాశుల్కం లాంటి దురాచారాలు ఉండేవేమో కదా... అప్పట్లో చిన్న చిన్న అమ్మాయిలని పండు ముదుసలికిచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు ధనం కోసం. అలా చేయడం ఎంత ఘాతుకమో కదా..అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ ముసలినే ఇష్టపడి అతని దగ్గరే ఉండే అవకాశం చాలా తక్కువ కదా..ఆయా మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఇవన్నీ చాలా సమస్యలకి దారి తీస్తాయి చివరికి. ఇక పోతే ..తప్పులను కనిపెట్టని రాజు రాజ్యం.. అంటే జనాల కోసం కాకుండా తమ స్వార్ధం చూసుకునే ఈనాటి ప్రభుత్వాలు, రాజకీయనాయకుల లాగ అన్నమాట. ఇవన్నీ ఎప్పటికైనా హాని కలిగించేవేనని ఈ పద్యం లో నీతి వ...

(Telugu) అల్లుని మంచితనంబును

[:te] అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్‌ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ! తాత్పర్యం:  అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములోఉండవు. అల్లుడు అనేవాడు ఎప్పుడూ అత్త మామలని పీడించడానికే తప్ప మంచిగా ఉండడని ఈ పద్యంలో చెప్తున్నారు. మన తెలుగు సాంప్రదాయంలో కట్నాలు, సారెలు, సాంప్రదాయాలు కూతురికి ప్రేమగా కానుకలు ఇచ్చేందుకు వచ్చాయి. కానీ, చివరికి అవి అల్లుడి హక్కులాగా మారాయి. మనంప్రపంచం చాలా మారింది, అందరూ చదువుకుని చాలా విజ్ఞానవంతులవుతున్నారు. అందుకని అబ్బాయిలు చాలా మారిపోతున్నారు అనిఅనుకుంటున్నారు అందరూ. మారే వాళ్లు చాలా తక్కువ శాతం మంది. ఎంత చదువుకున్నా, ఏ దేశం వెళ్ళినా కట్న కానుకలని మాత్రం మర్చిపోట్లేదు. అన్నిటికంటే బాధాకరమైన సంగతి ఏంటంటే మన భారతదేశం లో వేరే అన్ని రాష్ట్రాల్లో ఈ కట్నాల గోల మన తెలుగు వాళ్ళంత లేదు. ఇందులో మనమే ప్రధమ స్థానం. మా అబ్బాయికి 2 కోట్లు కట్నం అని ఒకళ్ళు, 4 కోట్లు అని ఒకళ్ళు...చివరికి ప్రస్తుతం పెళ్లి వ్యాపారం కూడా real estate ని మించిపోతుంది. విదేశాలకి వెళ్...

(Telugu) ఆఁకొన్న కూడె యమృతము

[:te] ఆఁకొన్న కూడె యమృతము తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్‌ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ! తాత్పర్యం:  లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యంకలవాడే వంశశ్రేష్ఠుడు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం అమృతంలాగా ఉంటుందంటున్నారు. ఈ సంగతి మనందరికీ కనీసం ఒక్కసారయినా అనుభవం అయ్యే ఉంటుదని కదా...! అసలు అలాంటివి అప్పుడప్పుడు జరిగితేనే మనకు కూడా ఆ విలువ తెలిసి వస్తుంది. ఈ సంగతి చెప్తుంటే నాకొకటి జ్ఞాపకం వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చదవడానికి హాస్టల్ లో మొదటిసారిగా చేరాను. మెస్ కి వెళ్ళిన ప్రతీ పూట నా కంచంలో కనీసం సగభాగం పడెయ్యడానికి ఉండేది. నిజానికి ఆ హాస్టల్ లో భోజనం చాలా బావుంటుంది. ఆ సంగతి నాకు తరవాత వేరే వేరే hostels కి వెళ్ళినప్పుడు అర్ధం అయింది :) అప్పట్లో నాకు రోజూ సరిగ్గా తినబుద్ది కాక పడేస్తూనే ఉండేదాన్ని. అలా ఎంత అన్నం వేస్ట్ అయ్యిందో అప్పుడు ఆలోచించలేదు కానీ, ఇప్పుడు గుర్తు వస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అయితే ఒక సారి నేను Masters చదువుతున్నప్పుడు ఒక ఆదివారం ఉదయం నుంచి ఏమీ తినక చాలా ఆకలిగా ఉంది. మా మ...

(Telugu) ఇమ్ముగఁ జదువని నోరును

[:te] ఇమ్ముగఁ జదువని నోరును అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్‌ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! తాత్పర్యం:  ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితోసమానం సుమా! ఈ సృష్టిలో ప్రతీ జీవి తన భావాలని ఇంకో జీవికి తెలియపరుస్తుంది ఏదో ఒక రకంగా..ఏ సైగలతోనో...కానీ, మరే జీవికీ లేనిది, మనుషులకి మాత్రమే ప్రత్యేకంగా దేవుడిచ్చిన వరం...మాట్లాడగలగడం. కానీ, చాలా సార్లు చాలామంది మనుషులు నోరు తినడానికి మాత్రమే ఉన్నట్టు ప్రవర్తిస్తారు. లేదా...ఏదయినా మాట్లడేయచ్చు నోరు ఉంది కాబట్టి అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఈ పద్యం లో చూడండి ఏమి చెప్పారో...చక్కగా నోరారా చదవని, అమ్మా, తమ్ముడూ..అని ప్రేమగా పిలవని నోరు...మట్టి గుంటతో సమానం అంటున్నారు. దీనితో పాటు మనం పాటించాల్సింది ఇంకోటి ఉంది. మనకి నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని నోటికెంత మాటొస్తే అంత మాటలు మాట్లాడకూడదు. మీరు గమనిస్తే, ఎదుటి వాళ్లు భయం చేతనో, ప్రేమ చేతనో ఎదురు మాట్లాడలేరు అనుకున్నప్పుడే అలా అడ్డదిడ్డంగా మాట్లాడే పొగరు వస్తుంది. ఉదాహరణకి చాలా మంది పై అధికారులు ...

(Telugu) ఉడుముండదె నూరేండ్లును

[:te] ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌ మడుపునఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ! తాత్పర్యం:  ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటిజీవితాలన్నీ నిరుపయోగాలే. మానవునిజీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి. ఈ సృష్టి లో ఎన్నో రకాల జీవులున్నాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవికి, ప్రతీ వస్తువుకీ ఏదో ఒక అర్ధం ఉంటుంది తప్పకుండా.. నిజం చెప్పాలంటే ప్రాణులన్నీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలి. అప్పుడే ఈ సృష్టి సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా లాంటి జీవులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది degrade అవ్వదు. అలాగే శాఖాహారులు, మాంసాహారులు అయిన ఎన్నో జీవులు దేని జీవన విధానం అది పాటించడం వల్లనే ఈ జీవన చక్రంఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ...ఇంక మనిషి విషయానికి వస్తే, ఈ జీవ పరిణామ క్రమంలో ఎదిగిన అన్నీ జీవుల్లోకీ ఉన్నతమైన, తెలివైన ప్రాణి మానవుడే. అందుకే మనం మిగతా అన్ని జీవుల్ని మచ్చిక చేసుకోడమే కాకుండా ఎన్నోరకాలుగా exploit కూడా చేస్తున్నాము. అన్ని జీవులకంటే బాగా అభివృద్ధి చెందిన మెదడు మనిషికి మాత్రమే ఉంది. ఆల...

(Telugu) ఉత్తమ గుణములు నీచు

[:te] ఉత్తమ గుణములు నీచు కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ! తాత్పర్యం:  బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లుకానేరదో అదేవిధంగా లోకంలో నీచునకుఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు. చెడ్డవారి గురించి, మూర్ఖుల గురించీ, నీచ స్వభావం గురించి మన తెలుగులో ఎన్నో తెలుగు పద్యాలు ఉన్నాయి కదా...! ఇదీ అందులో ఒకటి. ఎన్ని కిలోల ఇత్తడి తెచ్చి ఇచ్చినా బంగారం తో సమానం కాదు అనే ఉపమానం ఉపయోగించి ఈ పద్యంలో నీచుని స్వభావాన్ని వివరిస్తున్నారు. మంచి-చెడు అంటే నాకొకటి గుర్తొస్తుంది. ఈ ప్రపంచంలో మంచి-చెడు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అసలు అది మన ఆలోచనల్లో ఉంటుందని నాకనిపిస్తుంది. అంటే...మంచి-చెడు అనేవి relativity (తెలుగులో??) కి సంబంధించినవి కదా..అంటే ఒకరి దృష్టిలో మంచి అయినది మరొకరి దృష్టిలో చెడు అయ్యే అవకాశం ఉంది. అలాగే పరిస్థితిని బట్టి మంచిచెడులు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఏదన్నా అపాయంలో ఉన్నప్పుడు ఒక ప్రాణిని చంపినా గాని అది తప్పు అవ్వదు. కానీ, అదే మరో పరిస్థితిలో అయితే తప్పు అవుతుంది కదా..ఒకోసారి ఇద్దరు మనుషులకి భేదా...

(Telugu) ఉదకము ద్రావెడు హయమును

[:te] ఉదకము ద్రావెడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌ మొదవుకడ నున్న వృషభము జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ! తాత్పర్యం:  నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్నఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకువెళ్లకుము. ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆయా సమయాల్లో ప్రవర్తించాలని ఏ పద్యంలో నీతి. ఆ విషయాన్నే ఉదాహరణలతో ఈ పద్యంలో వివరించారు. చదువుసంధ్యలు లేని ఒక మామూలు మనిషికి కూడా అర్ధమయ్యే రీతిలో రాయడమే సుమతీ శతకం యొక్క గొప్పతనం. ఇక్కడ చెప్పిన సందర్భాలు ఆ కాలానికి సరితగ్గవి కానీ, ఇప్పుడు మనకి ఎదురయేవి కాదులే..! మనం ఎవరైనా తెలిసిన వాళ్ళింటికి వెళ్ళామనుకోండి . ఒకోసారి మనం పరాయి వాళ్ళం ఉన్నా గానీ, వాళ్ళింట్లో ఏదో పరిస్థితి వల్ల వారి స్వంత విషయాలు మాట్లడుకోడమో, వాదించుకోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు మనం అల్లాంటి పరిస్థితి నుంచి బయటపడడం మంచిది. అనవసరంగా వారి స్వవిషయాల్లో ఆసక్తి గానీ, జోక్యం గానీ చేసుకోకపోడమే మనకి మంచిది. ఒకోసారి వాళ్లు వాదించుకుంటూ, మరో పక్క మనకి చెప్తూ ఉంటారు. "చూడండి...ఎలా చేసారో...ఎప్పుడూ ఇంతే. మీరే చెప్పండి నా తప్పేముంది. అదీ...ఇదీ.....

(Telugu) ఉపకారికి నుపకారము

[:te] ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! తాత్పర్యం:  మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారంచేసేవాడే నేర్పరి. చూసారుగా..పైన పద్యాన్ని..మీకేమనిపిస్తుంది? అదంతా నిజమే కానీ, ఈ రోజుల్లో అంత మహాత్ములెవరుంటారు? ఒకవేళ అలా చేద్దామనుకున్నా అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో బతకలేరు. ఇప్పటి పరిస్థితులు అలాంటివి మరి. ఏం చేస్తాం?? అని ఒక నిట్టూర్పు విడుస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో సరిగ్గా చెప్పానా? :) నాకయితే ఎవరికీ ఉపకారం చేయకపోయినా ఫరవాలేదు కానీ, అపకారం మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది. మనం ప్రపంచంలో జరిగే చాలా సంఘటలని చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అసలెటుపోతోంది? ఏమిటీ విపరీత సంఘటనలు..అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరి మీదో కోపంతో ఎవరో బాంబులు పెట్టి, దానికి అభం శుభం తెలియని సామాన్య ప్రజలు పార్కుల్లోనూ, హోటళ్ళలోనూ , రోడ్ల మీద ఇలాంటి మామూలు ప్రదేశాల్లో బలి అయిపోతుంటే చాలా బాధేస్తుంది. కానీ, ఏమి చెయ్యాలో అర్ధం కాదు. మతాల పేరు మీద, దే...

(Telugu) ఎప్పుడు దప్పులు వెదకెడు

[:te] ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్‌ సర్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ! తాత్పర్యం : నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకుప్రాణభయంతో కూడినదే సుమా! ఎలాంటి యజమాని కొలువు చేయకూడదో.. ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పని చేయకూడదనీ, అలా చేస్తే పాము నీడలో బ్రతికే కప్పలాగా ఎప్పుడూ అపాయమేనని అంటున్నారు. ఏంటోనండీ.. ఈ పద్యం లో ఇలా ఉంది కానీ, అసలు అలాంటి ఉత్తమమైన బాస్ లు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారండీ బాబూ? అవునా కాదా...? మీరే చెప్పండి. అసలు ఉద్యోగం దొరకడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాస్ చాలా మంచి వాడవ్వాలని కోరుకుంటే మనకి ఇంక ఉద్యోగాలొచ్చినట్టే... కదా... :( అంటే నా ఉద్దేశ్యం బాసులందరూ విలన్లని కాదు గానీ..ప్రతీ బాస్ లో కొంచమైనా విలనిజం ఉంటుదని అన్నమాట...అంతే కదా మరి...హ్హ హ్హ హ్హ... అసలు టీ టైములో టీ తాగడం కంటే కూడా సహోద్యోగులందరూ సేద తీరేది బాస్ ని తిట్టుకునే కదా.. :) ఏది ఏమైనప్పటికీ ఈ పద్యం మన ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా అన్వయించుకోడం కష్టమే అనిపిస్తుంది...

(Telugu) ఎప్పుడు సంపద కలిగిన

[:te] ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌ దెప్పలుగ జెరువునిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ! తాత్పర్యం:  చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు. ఈ పద్యం తెలియని తెలుగు వాళ్లు దాదాపుగా ఉండరనుకుంటున్నాను. పెద్దగా చదువురాని వాళ్లు కూడా ఈ పద్యం చెప్తూ ఉంటారు. మరి ఈ పద్యం లో ఉన్న విషయం అలాంటిది కదా..! నిజానికి ఈ పద్యం లో నీతి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితంలోకి తరచి చూసినా కనీసం ఒక్క అనుభవం అయినా కనిపిస్తుంది. ఒకటేమిటిలే.. చాలానే ఉంటాయి. ఈ పద్యం లో బంధువులు అన్నారు గానీ, స్నేహితులకీ, కుటుంబ సభ్యులకీ కూడా ఇది చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. అంటే అందరూ అలా ఉంటారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, అలాగే ఎక్కువ శాతం మంది ఉంటారన్నది మాత్రం అందరూ ఒప్పుకునే వాస్తవం. ఏదో సినిమా పాటలో చెప్పినట్టు.. డబ్బుంటే సుబ్బారావు గారు అంటారు లేకపోతే సుబ్బి గాడు అంటారు. అంటారు అంటారు కాదు గానీ..మనందరం అలాగే అంటాం కదండీ..!! ఉదాహరణకి ఎవరన్నా కోట్ వేసుకుని కనిపించారనుకోండి.. ఎవరయ్...

(Telugu) ఏరకుమీ కసుగాయలు

[:te] ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! తాత్పర్యం:  భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగిపారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా! చూసారుగా ఈ పద్యం..! మీరేమంటారు మరి.. :) బంధువులని దూషించకూడదంటా ... ఇంతకుముందే బంధువుల గురించి వచ్చే అపాయాలని గురించి అనుకున్నాం కదా..! ఇప్పుడేమో ఇది...ఏది ఏమైనా సందర్భానుసారం నీతిని కూడా తీసుకోవాలి. అంటే బంధువులందరినీ ఏమీ అనకూడదు...వేరే వాళ్ళని అనచ్చని కాదు గానీ.. ఎవరినైనా పూర్తిగా విషయ పూర్వాపరాలు తెలుసుకోకుండా మాట జారకూడదు. అది స్నేహితులైనా, బంధువులైనా సరే...! కానీ, ఒకవేళ బంధువులైనా కూడా నిజంగా చెడు చేయాలనుకునేవారిని దూషించకుండా ఎలా ఉంటాం? :) అంతే కదా..! పచ్చి కాయలు తినద్దంట..:) అయినా పచ్చివి తింటే అరగదు మొదటి పాయింట్..ఇంకోటి ఏంటంటే, పచ్చివి కోసేసి వృథా చేయడం కన్నా పండే దాకా ఉండడం ఉత్తమం కదా..! :) ఇలా కాదు కానీ, అలాంటి పసి మొగ్గల్నీ, పసి పిందెలనీ కోసేయ్యకూడదు అని కూడా కవి ఉద్దేశ్యం అయ్యి ఉండచ్చు అనుకుంటున్నా.. ఒక రకంగా అది మనిషి మనస్తత్వాన్ని కూడా ప్రతిబింబిస్...

(Telugu) ఒకయూరికి నొక కరణము

[:te] ఒకయూరికి నొక కరణము నొక తీర్పరియైన గాక వొగిఁదరుచైనం గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ! తాత్పర్యం :  ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలుపుట్టి సమస్తం చెడిపోవుటసహజము. చూశారుగా ఈ పద్యంలో నీతి. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఏ పని అయినా ఎవరు చేయాలో వాళ్లు చేయాలి. అలాగే ఒకేసారిఎక్కువమంది తల దూర్చకూడదు. అలా చేస్తే అది ఖచ్చితంగా నష్టానికే దారి తీస్తుంది చివరికి. ఇంగ్లీషులో కూడా ఇదే అర్ధాన్ని చెప్పే ఒక ప్రసిద్ధ సామెతఉంది. "Too many cooks spoil the broth" అని. ఎక్కువమంది ఒకే వంటలో వేలు పెడితే ఎలా ఉంటుందండీ మరి?? నువ్వు ఉప్పు వేసావా? కారం వేసావా? అది వేస్తే ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. అనుకుంటూ ఒకటికి రెండు సార్లు వేసి లేదా మర్చిపోయి..అందరి పాక శాస్త్ర ప్రావీణ్యంపోటాపోటీగా ఉపయోగించి చివరికి మొత్తం పారబోయాల్సి వస్తుంది.అంతేగా మరి..! ఇదే కాకుండా..ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే.. ఒకేసారి చాలామంది బోలెడు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి అన్ని విరుద్ధమైనభావాల్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఎక్కువ కంగారుని, అయోమయాన్ని, భయా...

(Telugu) ఒల్లనిసతి నొల్లనిపతి

[:te] ఒల్లనిసతి నొల్లనిపతి నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే గొల్లండు గాక ధరలో గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ! తాత్పర్యం:  తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు. పైన చూసారుగా..! స్నేహమైనా, ప్రేమైనా, చివరికి ఉద్యోగం చేయాల్సిన చోట కూడా ఇరువైపులా నుండి పరస్పర అంగీకారం, ఇష్టంఉండాలని ఈ పద్యంలో చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా.. ఇంకా మన చుట్టూ ఉన్న సమాజంలో బలవంతపు ప్రేమలు, పెళ్ళిళ్ళు, లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏ మనిషికైనా ప్రతీ విషయంలో తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఏ రంగు డ్రెస్వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏమి తినాలి... ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలోమనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్క అభిరుచికి గానీ, అభిప్రాయానికీ గానీ కారణాలు అడిగితేమనమెవ్వరమూ సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనిషి భావాలకు, మనసు స్పందనకు కారణాలు ఉండనవసరం లేదు. యాధృచ్చికంగా దీనికి సంబంధించిందే ఈ రోజు పొద్దునే 'మ...