Posts

Showing posts with the label భృగు మహర్షి

భృగు మహర్షి

భార్గవస గోత్రీకులకు గోత్ర పురుషుడు భృగువు. కానీ, 'భార్గవుడు' అనగానే మనకు భార్గవరాముడు గుర్తుకు రావటం సహజం. 'భార్గవరాముడు' అంటే పరశురాముడు. 'భృగు' శబ్దంలోంచి వచ్చిందే భార్గవుడు. భార్గవరాముడు లేదా పరశురాముడు భృగు వంశంలోని వాడే. భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు.మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. 'భృగు' శబ్దానికి తెలుగులో ప్రథమావిభక్తి ప్రత్యయం అయిన 'వు' చేరటంవల్ల ఆయన పేరు 'భృగువు' అయింది. భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు. భృగువు మహర్షి బంధుత్వాలు భృగు మహర్షి, దక్షప్రజాపతికి అల్లుడు. దక్షుని కుమార్తె ఖ్యాతికి ఆయన భర్త. ఈ దంపతులకు ధాత, విధాత అని ఇద్దరు కుమారులు. దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది. యజ్ఞాల ప్రస్తావన వచ్చింది కనుక, ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. యజ్ఞాలలో దేవతలకు సోమరసాన్ని నివేదించే విధానాన్ని భార్గవ వంశమునులే ప్రవేశపెట్టారు. ఈయనకు ప...