(Telugu) నక్క-పొట్టేలు కథ
[:te]"పూర్వం ఒక చోట బాగా బలిసిన రెండు పొట్టేళ్ళు పోట్లాడుకొంటున్నాయి. అవి దూరంగా వెనుకకు వెళ్ళిపరుగున వచ్చి ఢీ కొనడం మొదలుపెట్టాయి. రెండూ బాగా బలిసి ఉండటం చేత ఒకదానినొకటి తీసిపోక పోట్లాడుకొనుచున్నాయి. వాటి తలలు పగిలి అవి రెండు ఢీ కొన్నచోట రక్తం గడ్డకట్టింది. ఆ పోట్లాట చూచిన ఒక నక్క ఆ నెత్తురు చూడగానే దానికి నోరూరింది. పొట్టేళ్ల వెనక్కి దూరంగావెళ్ళిమరలా వచ్చి ఢీ కొనేలోగా ఆ రక్తాన్ని నాకేయాలనుకొంది. అలా నాకుతుండగా రెండు పొట్టేళ్ళు రివ్వున వచ్చి ఢీ కొన్నాయి. వాని తలల తాకిడికి మధ్యలో ఉన్ననక్క నలిగి చచ్చింది. దురాశ నక్క ప్రాణాలు తీసింది. మంత్రి పదవికై గల ఆశతో నేను మోసపోయాను" అని దమనకుడు కరటకునితో చెప్పాడు. అంతేకాకుండా "దేవశర్మ" అనే సన్యాసిని మోసగించిన"ఆషాడభూతి" కథను చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.[:]
Comments
Post a Comment