(Telugu) కృష్ణ శతకము
[:te] * అక్రూరవరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా శక్రాది దివిజసన్నుత శుక్రార్చిత నన్నుఁ గరుణ జూడుము కృష్ణా! * అగణిత వైభవ కేశవ నగధర వనమాలి యాదినారయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా! * అనుదినము కృష్ణ శతకము వినినఁ బఠించినను ముక్తి వేడుక గలుగున్ ధనధాన్యము గోగణములు తనయులు నభివృద్ధిఁ బొందు దద్దయుఁ గృష్ణా! * అపరాధ సహస్రంబుల నపరిమితములైన యఘము లనిశము నేనున్ గపటాత్ముఁడనై చేసితిఁ జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా! * అప్పా యిత్తువు దయతో నప్పాలను నతిరసంబు లనుభవశాలీ యప్పా నను గనుఁగొనవే యప్పా నను బ్రోవు వేంకటప్పా కృష్ణా! * అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్ జయ్యన గలఁగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగఁ గృష్ణా! * అల్ల జగన్నాథుకు వ్రే పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయుఁ దల్లియునై చన్నుగుడిపెఁ దనరఁగఁ గృష్ణా! * అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమగర్భమునఁ బుట్టి యాదేవకికిన్ దుష్టునిఁ గంసు వధింపవె సృష్టిప్రతిపాదనంబు సేయఁగఁ గృష్ణా! ఆ (2) * ఆ దండకావనంబున కోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ గావ రమ్మీ వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా! * ఆదివరా...