Posts

Showing posts with the label దాశరధీ శతకము

(Telugu) దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)

[:te] *  అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండలవంటివైన వెసఁ గూలి నశింపక యున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గక మానునె మోక్షలక్ష్మికై దండయొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయొనిధీ! * అగణిత జన్మకర్మ దురితాంబుధిలో బహు దుఃఖవీచికల్ దెగిపడ నీదలేక జగతీధవ! నీ పదభక్తినావచేఁ దగిలి తరింపఁ గోరితిఁ బదంపడి నాదు భయంబు మాన్ పవే తగదని చిత్తమందిడక, దాశరథీ! కరుణాపయోనిధీ! * అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ విగతనమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ ద్గగనధునీ మరంద పదకంజవిశేష మణిప్రభా ధగ ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! * అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స ద్ద్విజ్జముని కోటికెల్లఁ గులదేవతయ్యు దినేశ వంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా డ్ఢ్వజ! మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ! * అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ కనుజుడుగా జనించి, కుజనావళినెల్ల నడంచి, రోహిణీ తనయుడనంగ బాహుబల దర్పమునన్ బలరామమూర్తివై తనరిన వేల్పవీవె గద! దాశరథీ! కరుణాపయోనిధీ! * అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజగోత్రజుఁ డాదిశాఖ కం చెర్ల కులోద్భవుండన బ్రసిద్ధుడనై భవదంకితంబుగా నెల్లకవుల్ ను...