(Telugu) Subconscious mind
[:te]
ఒక వ్యక్తి పరీక్షహాలులో కూర్చుని పరీక్ష రాస్తున్నాడు.మధ్యలో ఒక ప్రశ్న గుర్తుకురాలేదు. ఒక నిమిషం గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించి రాకపోతే, ఆ తర్వాత ప్రశ్నలు రాస్తున్నాడు. ఇంకొక కొంత సేపటిలో పరీక్ష అయిపోతుందనగా, తనకు కావల్సిన ప్రశ్న తళుక్కున గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ప్రశ్నను వ్రాసి బయట పడ్డాడు, అది సివిల్స్ సర్వీసెస్ పరీక్ష. రిజల్టులో దేశంలోనే మొదటిస్థానంలో నిలచి ఎంతో మందికి స్పూర్తినిచ్చాడు. ఇదంతా ఆ చివర వ్రాసిన ప్రశ్న వల్లనే అంటే.. అందరూ ఒప్పుకోవాల్సిందే!
ఇదంతా ప్రతిమనిషి జీవితంలోనూ ఏదో ఒకసారి జరిగేదే, కానీ ఎవరైనా ఇది ఎలా జరిగింది, దేని వలన మనం మరిచిపోయిన ఆ ప్రశ్నను వ్రాయగలిగాము? ఆలోచించారా? ఒకసారి ఆ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే..
మనిషికి చేతన, అచేతనావస్థలు అని రెండే ఉంటాయని అందరికీ తెలుసు.చేతనావస్థ అంటే మన ప్రమేయంలో మనకి తెలిసి పని చేయగలిగే స్థితి. అచేతన అవస్థ అంటే నిద్రపోయేటప్పుడు, సృహ కోల్పోయినప్పుడు, కోమాలోకి వెళ్ళినప్పుడు, ఏ పని చేయలేని స్థితి. ఇప్పుడు ఈ రెండింటినీ పరీక్ష సంఘటనకు అణ్వయిస్తే..
మనం పరీక్ష రాస్తున్నప్పుడు చేతనావస్థలో ఉంటాం. ఒక ప్రశ్న గుర్తుకు రాలేదు. ఆ ప్రశ్న వదిలేసి వేరే ప్రశ్న రాస్తున్నాం.(చేతనావస్థ మనం వ్రాసే ప్రశ్న మీద పనిచేస్తుంది). అంటే మనము అచేతెనావస్థలో లేము(మనకి తెలిసి పరీక్ష రాస్తున్నాం కాబట్టి). మరి చేతనావస్థ తన పని తాను చేసుకుంటుండగా, అచేతనావస్థ ఏ పనీ చేయలేని సందర్భంలో మనకి రాని ఆ ప్రశ్నను వెతెకి పట్టుకుని చేతనావస్థకు అందజేసింది ఎవరు?
అదే అతఃచేతనావస్థ.
అతఃచేతనావస్థ.. అదొక అనంతశక్తి; గొప్ప సెర్చ్ ఇంజన్, విధేయమైన సేవకుడు.. ఇలా చెప్తూపోతే దాని లక్షణాలు అనేకం. దాన్నే మనం ‘ది పవర్ ఆఫ్ సబ్ కాన్ష్యస్ మైండ్’ అంటాము.
ఏదో ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాము, మనం తిరగాల్సిన సందులోకి మన ప్రమేయం లేకుండా బండి తిప్పేస్తాము. ఎంతో లీనమై సినిమా చూస్తూ ఉంటాము, ఉన్నట్టుండి ఏదో సత్వరమే చేయాల్సిన పని గుర్తుకు వస్తుంది. పొద్దున్నే లేవాలని అనుకుని పడుకుంటాము, ఆ సమయం దగ్గర పడే సరికి ఉలిక్కి పడి లేస్తుంటాము. ఇవన్నీ అతఃచేతనావస్థ లో చేసే పనులే.అసలు ఏమిటి ఈ అతఃచేతనావస్థ, ఏమిటి దీని స్థితి, ఏమిటి దీని తత్వం, శక్తి, ఉపయోగాలు?
దీని స్థితి(subconcious state)
ఎప్పుడైతే మనిషికి చేతనాచేతనావస్థలు (conscious, unconscious) కాకుండా ఉండే స్థితి ఉంటుందో, అదే అతఃచేతనావస్థ(subconscious state). ఉదాహరణకి, ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయేముందు వచ్చే మగతగా ఉండే స్థితి, అతఃచేతనావస్థ. యోగాలో చెప్పబడే సమాది స్థితి. హిప్నాటిజంలో వెప్పే హిప్నాటైజ్డ్ స్టేట్ ఇవన్నీ అతఃచేతనావస్థకి సంబందించినవే. ఇలాంటి స్థితిలో subconscious mind చాలా ఉత్తేజితంగా ఉండి సూచనలను తీసుకోవడానికి ఆ తర్వాత అమలుపరచడానికి సిధ్ధంగా ఉంటుంది.
దీనితత్వం
subconscious mind ఒక విధేయమైన సేవకుని వంటిది. మీరి ఏ పని చెప్తే ఆ పని చేసుకుపోతుంది. సామన్యంగా మనిషి conscious state లో ఉన్నప్పుడు ఏదైనా పని చేయాల్సివస్తే conscious mind తర్కిస్తుంది. ఈ పని ఎందుకు చేయాలి, చేస్తే మంచిదా కాదా, ఎప్పుడు చేయాలి అని ఆలోచించి, నిర్ణయంచి పని ప్రారంభిస్తుంది. unconscious state లో నిర్ణయాలు తీసుకోబడవు. కానీ subconscious mind మనం ఏ పని చెప్తే అంత బలంగా చేసుకుపోతుంది.
దీని శక్తి
దీనికున్న శక్తి అమోఘం, అద్భుతం. చరిత్రలో చాలా విషయాలు subconscious state లో ఉన్నప్పుడు కనిపెట్టినవే. న్యూటన్ ని తీస్కుంటే ఎన్నో ప్రయోగాలు చేతనావస్థలో చేసి సరదాగా చెట్టుకింద కూర్చున్నప్పుడు పండు క్రింద పడటం చూసి, గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. అలానే చాలామంది మేధావులు ఎన్నో ప్రయోగాలు చేసి వదిలేస్తే ఆ తర్వాత ఎప్పుడో subconscious mind తళుక్కున వాటి పరిష్కారాలు అందిస్తే వాటిద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేశాము. మనం ఏదో పనిలో ఉన్నప్పుడు అంతకుముందు ఆలోచించిన సమస్యయొక్క పరిష్కారాలని తళుక్కున తెలిపేదే ఈ subconscious mind. చరిత్రలో subconscious mind కి సంకేతాలు పంపండంద్వారా మత్తుమందులేకుండా, నొప్పి తెలియకుండాఆపరేషన్ చేసిన సందర్భాలున్నాయి. హిప్నాటిజం వంటి పధ్ధతులన్నీ subconscious mind కి ఇచ్చే సూచనలే.మనల్ని ఏ ఆలోచనా లేని స్థితికి తీసికు వెళ్ళి అక్కడ మనకు ఉపయోగపడే, కావాల్సిన సంకేతాలిచ్చి జీవన విధానం మెరుగుపడేలా చేస్తారు. ఏ ఆలోచనాలేని స్థితిలోనే కదా, క్రొత్త ఆలోచనలు తీసుకుని అమలుచేయడానికి అవకాశం ఉండేది. అదే విధంగా యోగాలో కూడా మనిషి ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని ఆలోచనలూ పోయి ఒకానొక స్థితిలో నిశ్చల స్థితికి చేరుకుంటాడు. దాన్నే సమాదిస్థితి అంటారు. అదే subconscious state. పూర్వం ఋషులు తపస్సు ద్వారా గాఢమైన subconscious state కి చేరుకుని దానికి సంకేతాలివ్వడం ద్వారా ఎక్కడికైనా వెళ్ళగల్గిన స్థితిని, వాక్ శుద్దిని సంపాదించారని చదువుకున్నాం. ఈ విధంగా మనిషి కోరుకున్న దాన్ని సాధించుకునేందుకు శాస్త్రపరంగా ఉపయోగించిన వస్తువే ఈ subconscious mind, దీని శక్తి అమోఘం. ప్రపంచంలో ఎలాంటి పనైనాగానీ దాని దోవలో అది చేసుకుపోతుంది.
దీని ఉపయోగాలు
దీనికున్న శక్తి ద్వారా, దీని ఉపయోగలను కూడ అంచనా వేయవచ్చు. చెడు అలవాట్ల నుండి, ఫోబియాలనుండి బయటకు చేరుకోవటానికి, లక్ష్యాలను చేరుకోవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది తాగుడు, సిగరెట్లు, పాన్ మసాలాలకు అలవాటు పడిపోతారు. కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడలంటే భయం, కొంతమందికి నీరంటే మరికొంతమందికి నిప్పంటే భయం. కొంతమంది ఏం చెప్పినా దాని వల్లన వచ్చే నష్టాలను గురించే ఆలోచించి భయపడుతుంటారు. కొంతమంది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని. కొంతమంది మంచి ఉద్యోగం సంపాదించాలని, ఇలా ప్రతి ఒక్కరికీ ఎదో ఒక లక్ష్యం, ఎదో ఒక భయం, ఎదో ఒక వ్యసనం ఉంటూనే ఉంటాయి. వీటన్నింటినీ subconscious స్థితిలో subconscious mind కి పదే పదే సూచనలివ్వడం ద్వారా అదిగమించవచ్చు. ఇలా దీని ఉపయోగాలు అనేకం. ఇలా దీని ఉపయోగాలు అనేకం, దేనికైన దీనిని అణ్వయించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.
దీన్ని ఉపయోగించే విధానం
ఇదే అన్నింటి కంటే ముఖ్యమైన విషయం. దీన్ని ఉపయోగించే విధం తెలుసుకునే ముందు, అసలు శాస్త్రపరంగా subconscious mind పని చేసే విధానం గురించి తెలుసుకోవాలి. subconscious state లో ఉన్నప్పుడు ఇచ్చే సంకేతాల్ని సూచనల్ని subconscious mind record చేసుకుని పనిచేసుకుపోతూ ఉంటుంది. మీరిచ్చే సంకేతాలు మంచివైనా, చెడ్డవైనా, చిన్నవైనా, పెద్దవైనా వాటిని అమలుపరుస్తుంది. మీ ఆలోచనలు మంచివైతే ఫలితం మంచిగా, చెడ్డవైతే చెడుగా ఉంటుంది. ముఖ్యంగా మీరిచ్చే సంకేతాలు వాస్తవానికి దగ్గరగా నిజజీవితంలో సాధ్యమయ్యేదిగా ఉండాలి. ఉదాహరణకి ఒక పరీక్షలో పస్ట్ రావాలనుకోవడం, కలెక్టరో, ఇంజనీరో లేక దేశానికి ప్రధానిమంత్రి అవ్వాలనుకోవడం అన్నీ నిజజీవితంలో జరగడానికి అవకాశం ఉన్నవే. కానీ, పక్షిలాగా ఎగరాలునుకోవడం, చెట్టులాగా మారిపోవాలనుకోవడం ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలు. కాబట్టి మనం ఇచ్చే సూచనలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. సూచనల్ని మంచివై ఉంటే మంచిది. అంటే ఎవడిమీదో కక్ష తీర్చుకోవాలని, దొంగతనాలు దొమ్మీలు చేయాలని, బాంబులు పెట్టాలని లాంటి ఆలోచనలు, సూచనలు ఇవ్వడంద్వారా ముందు మనలో వ్యతిరేక భావనలు పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టీ సానుకూల భావనలు పెంపొందొంచే విధంగా సమాజానికి, మనకీ ఉపయోగపడేలా మన సూచనలు ఉంటే తద్వారా వచ్చే ఫలితం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. మనం కోరుకున్న పనిని అనుసరించి దాన్ని సాధించడానికి మనం చేసే శ్రమను బట్టి subconscious mind తన ఫలితాల్ని అందిస్తుంది. మీరు పరీక్షలో ర్యాంక్ సంపాదించాలని మీరు రోజూ సూచనలిస్తూ మీరు మాత్రం చదవకుండా సినిమాలకి తిరిగితే మాత్రం ఫలితం శూన్యమే! పరీక్షలో ఫలితం ఒక సంవత్సరంలో తెలిస్తే , కలెక్టర్ అవ్వాలంటే ఆ ఫలితం రావడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. మనం కోరిన కోర్కెను బట్టి ఇచ్చిన సూచనల్నీ బట్టి, subconscious mind ఫలితాల్నిస్తుంది. ఫలితం వచ్చేదాకా మీరుమాత్రం సుచనలిస్తూనే ఉండాలి, దానికి తగ్గ పరిశ్రమ, కృషి చేయాలి. మధ్యలో ఎక్కడ ఆపినా ఆ పని పూర్తి అవదు.
subconscious mind మీరు సూచనలు ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వవచ్చు. కానీ subconscious state లో ఇచ్చిన సంకేతాలు subconscious mind లో బాగా record అయి పని తొందరగా జరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి నిద్రపోయేముందు వచ్చే మగత సమయంలో కనుక మీరు మీ సూచనలను క్రమం తప్పకుండా ఇచ్చినట్లైతే అద్భితమైన ఫలితాలు కనిపిస్తాయి.
సమాజంలో ప్రతిపని వెనుకా, subconscious mind హస్తం ఉంటుంది. బాంబ్ పేలిన, బంద్ జరిగినా, హత్యల్లాంటి వ్యతిరేక సంఘటనలూ, శాంతి సదస్సులు, ఒలింపిక్ పతకాలు, లాభాలు వంటి సానుకూల ఘటనలూ, బస్సులో సీటు దగ్గర నుండి నోబెల్ బహుమతి వరకు వచ్చే ఫలితాలన్నింటికీ, subconscious mind లో వాటి తాలూకూ భావనలు బలంగా ముద్రించుకుపోవడమే కారణం. కాబట్టి సమాజం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రతి మనిషీ తన మనసులోని వ్యతిరేక భావనలను తీసి సానుకూల భావనలను నింపుకోవాలన్న, వ్యక్తి, సమాజాభివృద్ది జరగాలన్నా, subconscious power ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతా మనవారే, అంతా మంచికే జరుగుతుంది అనుకోవడం ద్వారా వ్యతిరేక భావనలు తొలగించవచ్చు. ఈ విధంగా మనిషికి, సమాజానికి కావాలిసిన సానుకూల సూచనలన్నింటినీ subconscious prayer గా మీకందిస్తున్నాను. ఉదయం లేవగానే మీ యొక్క లక్ష్యాలతోపాటు ఈ prayer ని కూడా ఒకసారి subconscious mind కి పంపించి చూడండి. తేడా మీరే గమనిస్తారు. అద్భుతాలు సాధిస్తారు.
Subconscious Prayer
నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. విద్య, వినయం, ఆరోగ్యం, సంపదలతో సంతోషంగా ఉన్నాను. ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఇప్పటివరకూ చాలా సాధించాను, ముంది చాలా సాధించబోతున్నాను, సాధిస్తాను. నేను అన్ని పనులూ సమర్థవంతంగా చేయగలను. నా మనస్సులో నా అభివృద్దికై వచ్చే ప్రతి సత్సంకల్పమూ కార్యరూపం దాల్చుతుంది. వాటి ఫలాలు త్వరలోనే నా ముందుకు వస్తాయి. ఒక కొడుకుగా, విద్యార్థిగా, అన్నిటికీ మించి ఒక వ్యక్తిగా పరిపూర్ణత సాధిస్తాను. అందరూ నాతో మంచిగా వ్యవహరిస్తారు. నేనుకూడా అందరితో మర్యాదగా వ్యవహరిస్తాను. సమాజం నాకు అన్ని విధాలా సహకరిస్తుంది. కష్టాలన్నీ, నష్టాలన్నీ అవలీలగా అధిగమించి అత్యున్నత శిఖరాలనధిరోహించి ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాయలకు గురిచేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా జనుల హృదయాలలో చోటు సంపాదిస్తాను. ఆ శక్తి నాలో ఉంది. నేను చేసే ప్రతీ పని ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతుంది. ప్రపంచంలోని అన్ని విషయాలను నేను ఆనందిస్తాను. అన్ని పనుల్నీ అనుకున్నదానికంటే ముందే పూర్తిచేస్తాను. దానికి తగిన శ్రమ చేస్తాను. అలా అని నేను గర్వాంధుడను కాను. వినయం భూషణంగా వ్యవహరిస్తాను. భగవంతుని ఆశీస్సులు నాతోనే ఉన్నాయి. నా యొక్క subconscious mind కి ఉన్న అద్వితీయ శక్తిద్వారా అద్భుతాలు సాధిస్తాను, సాధిస్తాను, సాధిస్తాను. ప్రపంచశాంతికి నా వంతు సహాయం చేస్తాను. ఇది నిజం.
ఓం శాంతి,శాంతి,శాంతిః[:]

Comments
Post a Comment