లింగాష్టకం యొక్క అర్థం
🔱 బ్రహ్మమురారిసురార్చిత లింగం 🔔బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!! 🔱 నిర్మల భాషిత శోభిత లింగం 🔔నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!! 🔱 జన్మజ దుఃఖ వినాశక లింగం 🔔జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!! 🔱 తత్ ప్రణమామి సదాశివ లింగం 🔔ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!! 🔱 దేవముని ప్రవరార్చిత లింగం 🔔దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!! 🔱 కామదహన కరుణాకర లింగం 🔔మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!! 🔱 రావణ దర్ప వినాశక లింగం 🔔రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!! 🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం 🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!! 🔱 సర్వ సుగంధ సులేపిత లింగం 🔔అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!! 🔱 బుద్ధి వివర్ధన కారణ లింగం 🔔మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!! 🔱 సిద్ధ సురాసుర వందిత లింగం 🔔సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!! 🔱 తత్ ప్రణమామి సదా శివ లింగం 🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!! 🔱 కనక మహామణి భూషిత లింగం 🔔బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ...