Posts

Showing posts with the label కృష్ణాష్టమి

కృష్ణాష్టమి నాడు చదవవలసివ స్తోత్రం

అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం! వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!! వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం! దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!! గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం! అదోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!! అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం! నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!! పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం! శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!! యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్! గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!

శ్రీ కృష్ణ జయంతి

ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు . సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు "పైకొని చూడరె వుట్ల పండుగ నేడు ఆకడ గొల్లెతకు ననందము నేడు అడర శ్రావణబహుళాష్టమి నేడితడు నడురేయి జనియించినాడు చూడ గదరే. మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడ...

కృష్ణాష్టమి ఈ ఆలయాలలో ప్రత్యేకం

కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తుంది. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారు. అయితే కొన్ని ఆలయాలలో జన్మాష్టమి, మరింత సంబరంగా సాగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా తపించిపోతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఇవిగో... ఉడిపి ఉడిపి (కర్ణాటక)లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. అందుకని ఎక్కడెక్కడి వైష్ణవులో ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇక జన్మాష్టమి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు. ద్వారక ద్వారక అంటే మోక్షాన్ని కల్పించే ద్వారం అన్న అర్థమట. సాక్షాత్తు ఆ కృష్ణుడు పాలించిన ఈ రాజ్యంలో ‘ద్వారకాధీశుని’ పేరుతో కృష్ణుని ఆలయం ఉంది. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలోని స్వామివారికి షోడశోపచారాలు చాలా వేడుకగా జరుగుతాయి. అర్థరాత్రి 11 గంటల...

దేశంలో ఒకోచోట ఒకోలా... కృష్ణాష్టమి!

శ్రీకృష్ణుడు దేవకి కడుపున పుట్టి ఉండవచ్చు, యశోద ఇంట పెరిగి ఉండవచ్చు, ద్వారకని పాలిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని ఉండవచ్చు. కానీ ఆయన ఏదో ఒక ఇంటికో, ప్రాంతానికో పరిమితం అయినవాడు కాదు. కోట్లమంది హిందువుల గుండెల నిండా కొలువైనవాడు. అందుకే భారతదేశం యావత్తు ఆయనని తమని తోచినరీతిలో ఆయన పుట్టినరోజుని జరుపుకొంటుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన సందర్భాలు ఇవిగో... మహారాష్ట్ర కృష్ణాష్టమి వేడుకల గురించి ప్రస్తావన రాగానే మహారాష్ట్రే గుర్తుకువస్తుంది. అక్కడ జరిగే దహీహండీ (ఉట్టి) కార్యక్రమం అంత ప్రసిద్ధి మరి! అయితే ఇవి సాదాసీదాగా సాగవు. కృష్ణాష్టమికి కొన్ని వారాల ముందు నుంచే ప్రతి పేటలోని కుర్రాళ్లు, ఉట్టి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు. కృష్ణాష్టమి సమయానికి వీరంతా ఒక మండలిగా ఏర్పడి.. ఉట్టి కొట్టే పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్టుకి బహుమతులు కూడా భారీగానే అందుతాయి. మణిపూర్ మణిపూర్‌ వాసులకు కృష్ణారాధన ఎక్కువే! దాంతో కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంఫాల్‌ వంటి చోట్ల ఉన్న కృష్ణుని ఆలయాలు కిటకిటలాడిపోతాయి. ఆ రాష్ట్రానికే ప్రత్యేకమైన మణిపురి నృత్యంలో శ్రీకృష్ణుని రాసలీలలను ప్రదర్శిస్తారు...

కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి?

హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా! శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసకోవాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను ప...

శ్రీకృష్ణాష్టమి

భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు 5000 సం.॥ ల క్రితం దేవకి మరియు వసుదేవుల బిడ్డగా ఈ భూమిపై అవతరించాడు. చూడండీ!!, సాక్షాత్తు భగవంతుడు మానవుడిగా ఈ లోకంలో జరిగే అధర్మాన్ని , అన్యాయాలని నిర్మూలించి మళ్ళీ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనకోసమై దిగివచ్చాడు.!! ఇదీ భగవంతునికి మనపై ఉన్న ప్రేమ, కరుణ, ఆప్యాయత మరియు బాధ్యత. శ్రీకృష్ణ పరమాత్ముడు మనలాగా ఇంట్లోనో , వైద్యశాలల్లోనో పుట్టలేదు , ఆయన పుట్టే సమయానికి అయన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవులు చెరసాలలో ( జైల్లో) ఉన్నారు, అలా చేసింది ఆయన మేనమామ ( అంటే దేవకి అన్న అయిన ) అయిన కంసుడు. అలా భగవంతుడు చెరసాలలలో సరిగ్గా అష్టమి నాడు పుట్టాడు అందుకే మనం ఈ రోజుని శ్రీకృష్ణ జన్మాష్టమి అని పండుగగా జరుపుకుంటాము. కంసునికి ఒక ఆసారి ఆకాశవాణి (అశరీర వాణి) ద్వారా ఒక విషయం తెలుస్తుంది , అదేటంటే దేవకి వసుదేవులకు పుట్టే సంతానము (బిడ్డ) ఆయనని (కంసున్ని) చంపుతాడని.!!. అందుకే కంసుడు తన చెల్లి , బావ అయిన దేవకి వసుదేవులని చెరసాలలో పెట్టాడు.!! ఈవిధంగా 7 సార్లు దేవకి కన్న ప్రతీ బిడ్డని చంపేసాడు , కాని 8వ సారి అలా జరగలేదు , ఈసారి కృష్ణ పరమాత్ముడు జన్మించాడు , కాని ఆ కృష్ణపరమాత్ముని మా...