అక్షయ తృతీయ
అక్షయ తృతీయ అంటే ఏమిటి ? ఇంతకీ అక్షయ తృతీయ అంటే ఏమిటో , ఎలా వచ్చిందో తెలుసుకుందామా ?! అక్షయం అంటే క్షయం లేనిది అని అర్థం . అంటే శాశ్వతంగా ఉండేది . అందుకే బంగారం , స్థలాలు , పొలాలు లాంటి విలువైన వాటిని అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు . ఈరోజు బంగారం కొంటే , మంచిదని , అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు . ఈరోజు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు . అక్షయ తృతీయ పర్వదినం కోసం వ్యాపారులు ప్రత్యేక నగలు తయారుచేస్తారు . ముఖ్యంగా లక్ష్మీదేవి రూపాన్ని చిత్రించిన నాణాలు , రత్నాలు పొదిగిన నగలు ఈరోజు విశేషంగా కొంటారు . పురాణాల్లో అక్షయ తృతీయ విశిష్టత వేద ...