Posts

Showing posts with the label బంధం అనుబంధం

(Telugu) ప్ర 'పంచ' దంపతులు!

[:te] ఈ లోకంలో..కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా.. 5 విధాలుగానే ఉంటారు. మొదటిది లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై.. ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో.. ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం. తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత, ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట. మూడవది బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య .. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట. నాల్గవది ఛాయా సూర్యులు. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు, అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తనభర్త లోకోపకారం...

(Telugu) పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు?

[:te]ఇప్పుడంటే పెళ్లి చూపుల అయిపోగానే అమ్మాయి, అబ్బాయి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. ఇలాంటి తొందర ఒకోసారి బెడిసికొడుతుందని తెలిసినా, కాలాన్ని బట్టి ఊరుకోక తప్పడం లేదు. కానీ ఒకప్పుడు పెళ్లి చూపులు ముగిసిన తరువాత పెళ్లిరోజు వరకూ కూడా అమ్మాయి, అబ్బాయి కలుసుకోకుండా చూసేవారు. ఇక పెళ్లికూతురుని చేసిన తరువాత, పీటల మీద కూర్చునేదాకా ఆమెని చూడకూడదంటారు. వివాహ సమయంలో పెళ్లికూతురు, పెళ్లికూతుర్ల మధ్య ఒక తెరని ఉంచుతారు. వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం ఉంచిన తరువాతే వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు. అప్పుడు కూడా ఒకరి భృకుటిని మరొకరు చూడాలని చెబుతారు. వధూవరుల స్పర్శ, చూపు... రెండూ కూడా శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు తోస్తుంది. జీలకర్ర, బెల్లం రెండింటికీ వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషమూ మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పూ లేకుండానే, తనని అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహబంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తితత్వాన్ని వారు నిలుపుకోవాలనీ... తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలనీ ఈ రెండు పదార్థాల ...

(Telugu) లాలిపాటలే తొలి జీవితపాఠాలు

[:te]బిడ్డ పుట్టగానే బాధ్యత తీరిపోయిందని ఏ తల్లీ అనుకోదు. ఆ పిల్లవాడిని గొప్ప మనిషిగా తీర్చిదిద్ది, ఈ లోకానికి అందించేవరకూ ఆమె విశ్రమించదు. ఆ ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ అద్భుతమే! అందుకే తల్లీబిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్‌టాపిక్‌! అలా ఈమధ్య జరిగిన ఓ పరిశోధనలో, తల్లి లాలిపాట కూడా పిల్లవాడి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది. ప్రాంతానికీ, భాషకీ అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లీ పిల్లవాడిని తన పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైందని అంటారు. ప్రపంచంలో బెస్ట్‌ సింగర్‌ తల్లే అని ఒప్పుకుంటారు. అందుకే మియామీ యూనివర్సిటీ పరిశోధకులు పిల్లవాడి మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 70 మంది పసిపిల్లలని గమనించారు. తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితినీ, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలనీ పరిశీలించారు. లయబద్ధంగా, ప్రేమగా సాగే లాలిపాటని వినగానే పిల్లవాడిలో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది. లాలిపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు తల్లి వంకే చూస్తుంటాడు. పిల్లవాడి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా, పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. ...

(Telugu) ఇటు ఉద్యోగం – అటు కుటుంబం... ఓ సరిత కథ!

[:te]పొద్దున్న లేస్తూనే విపరీతమైన తలనొప్పి. వేడిగా ఒక టీ తాగినా తగ్గని పోటు. ఆ హడావుడిలోనే వంటపని ముగించి, పిల్లల్ని క్యారేజీలు సర్ది స్కూలుకి పంపేసరికి సరిత తలలో నరాలు జివ్వుమనడం మొదలుపెట్టాయి. ఇంకా నయం తన భర్త తన పని తనే చేసుకుంటాడు. అలాగని సరిత పనిలో మాత్రం సాయపడడు. మగవాడు వంటపనీ, ఇంటిపనీ చేయడమా? డామిట్! పిల్లలూ, భర్తా ఎవరి దారిన వారు వెళ్లిపోయారనుకోవడానికి లేదు. తన ఉద్యోగం ఒకటుందిగా! వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుందనో, ఇంట్లో ఉంటే తన చదువు వృధా అయిపోతుందనో.... కారణం ఏదైతేనేం, తనూ ఓ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరాక నిమిత్తమాత్రంగా ఉండటం చేతకాలేదు. జాబ్‌లో చేరిన కొద్ది రోజులకే కంపెనీకి తన ప్రతిభ అర్థమైపోయింది. దాంతో అటు జీతమూ, ఇటు బాధ్యతా రెండూ పెరిగిపోయాయి. సరిత ఆఫీసులోకి అడుగుపెడుతూనే సవాలక్ష సవాళ్లు మెయిళ్ల రూపంలో సిద్ధంగా ఉన్నాయి. వాటికి తోడు ఆఫీసులో పిల్లి ఎలుకా రాజకీయాలతో సమస్యలు మరికొన్ని కాచుకుని ఉన్నాయి. తలనొప్పి తగ్గేందుకు ఓ కాంబిఫ్లామ్ మాత్ర వేసుకుని పనిలో పడిపోయింది సరిత. అంత ఒత్తిడిలోనూ టైమ్‌ చూసుకుంటూనే ఉంది. రేపటి నుంచి పిల్లల పరీక్షలు. రోజూ సాయంత్రం కాసేపు వాళ్లని పుస...

(Telugu) జీవితమనే తుపానులో భయమెందుకు?

[:te]ఆ అమ్మాయిది అందమైన మనసు. ఆ అబ్బాయిది వెనుదిరకని వ్యక్తిత్వం. వాళ్లిద్దిరికీ మధ్య ప్రేమ చిగురించింది. అదో అందమైన ప్రేమకథ! ఆ ప్రేమకి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయ్యింది. పెళ్లయిన కొత్తజంత విహారయాత్రకి బయల్దేరారు. దారిలో నది అడ్డువస్తే, దానిని దాటేందుకు చిన్న నావని తీసుకుని వెళ్లారు. నావ నది మధ్యకి రాగానే అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్తా భీకరంగా మారిపోయింది. సన్నటి చినుకులతో మొదలై పెనుతుపాను చెలరేగింది. అంతటి తుపానుకి నావ అల్లల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఎటు చూసినా కారుమబ్బులు, అన్ని వైపుల నుంచీ సూదుల్లా పొడుస్తున్న చినుకులు. వాటిని చూసి యువతి చిగురుటాకులా వణికిపోయింది. కానీ యువకుడిలో మాత్రం ఎలాంటి కలవరమూ లేదు. పైగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అన్నంతగా అతని మోములో చిరునవ్వు చెక్కుచెదరడం లేదు. యువకునిలోని నిశ్చలత్వం చూసి అతని ప్రేయసికి ఒళ్లుమండిపోయింది. ‘ఇంత ప్రమాదంలో కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా! బెల్లం కొట్టినరాయిలా కదలకుండా కూర్చుండిపోతావేంటి?’ అంటూ అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ప్రేయసి మాటలు విన్న ప్రియుడు ఒక్క ఉదుటున తన ఒ...

(Telugu) స్నేహితులు కాస్తా శత్రువులుగా మారిపోతే!

[:te]అన్ని బంధాలూ అన్నివేళలా సజావుగా ఉండవు. ఒకప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్న తీరున సాగిన స్నేహాలు, మనిషి కనపడితే మొహం చాటేదాకా వస్తాయి. మాటతూలడం వల్లనో, డబ్బు వ్యవహారాలు బెడిసికొట్టడం వల్లనో... కారణం ఏదైనా కావచ్చు- స్నేహమేరా జీవితం అని పాడుకున్నవారు కాస్తా శరణమా రణమా అంటూ యుద్ధమంత్రాలు వల్లిస్తారు. మరి ఇలాంటి పరిస్థితులని దాటేదెలా? మాటలు ఆపవద్దు పోయిన చనువు మళ్లీ తిరిగిరాకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ మాటలని మాత్రం ఆపే ప్రయత్నం చేయవద్దు. మర్యాద కోసమైనా బాగున్నారా? మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి కర్టెసీ సంభాషణలని కొనసాగించే ప్రయత్నం చేయండి. అది కూడా సాధ్యపడదంటారా! కనీసం ఎదురుపడినప్పుడు ఓ చిరునవ్వు నవ్వి చూడండి. లేకపోతే వారి ఉనికి జీవితాతం ఒక పుండులా సలుపుతూనే ఉంటుంది. ఇతరుల జోక్యం వద్దు సాధారణంగా ఏదన్నా బంధం చెడిపోయిన తర్వాత... జరిగినదాని గురించి కనిపించినవారందరికీ పూసగుచ్చినట్లు వివరించడం చాలామందికి అలవాటు. దానివల్ల మన మనసుకి సాంత్వన కలుగుతుందేమో కానీ, విషయం మరింత ప్రచారం అవుతుంది. మీరన్న మాటలు అవతలివారికి చేరి తీరతాయి. అది మరిన్న గొడవలకు, అపార్థాలకు దారితీయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు! మనసు...

(Telugu) నాన్న తోడుంటే – ఏదైనా సాధించవచ్చు

[:te]పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్రని ఎవ్వరూ కాదనలేరు. కానీ బిడ్డల మీద తండ్రి ప్రభావం కూడా అసాధారణమే అంటున్నారు పరిశోధకులు. ఈ మధ్యకాలంలో వెలుగుచూసిన కొన్ని పరిశోధనల తండ్రి కేవలం తెరచాటు మనిషి మాత్రమే కాదనీ... పిల్లలు ఎదిగేందుకు అతని తోడ్పాటు చాలా అవసరమనీ తేల్చి చెబుతున్నాయి. వాటిలో కొన్ని... తండ్రిలానే ఉంటాము పిల్లవాడు పుట్టగానే అతనిది తల్లి పోలికా తండ్రి పోలికా అని బేరీజు వేస్తుంటారు. ఎదిగేకొద్దీ తండ్రి బుద్ధులు వచ్చాయా, తల్లి అందం వచ్చిందా అని తరచి చూసుకుంటారు. నిజానికి పిల్లవాడికి తల్లీ, తండ్రీ ఇద్దరి నుంచీ సమానమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. పైగా మన కణాలకు జీవాన్నిచ్చే ‘మైటోకాండ్రియా’ కేవలం తల్లి నుంచే పిల్లలకు వస్తుంది. కానీ ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో తండ్రి జన్యువులే పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని తేలింది. తండ్రి నుంచి పిల్లవాడికి సంక్రమించిన genetic mutations మరింత బలంగా ఉంటాయట. కాబట్టి వంశపారంపర్యమైన వ్యాధులు వచ్చినా, మంచి రోగనిరోధకశక్తి ఉన్నా... తండ్రిదే కీలకపాత్ర కావచ్చు. తండ్రి ప్రేమకి మంచి మార్కులు టీనేజి పిల్లలకి చదువు మీద ధ్యాస అంతగా ఉండదు. అసలే పరిపరివిధాలా పోతున్...

(Telugu) ఆమె మనసుని గెలుచుకోవాలంటే

[:te]ప్రేమ చిగురించడం కష్టమేమీ కాదు. మన శరీరంలో హార్మోనులే ఆ పని చేసేస్తాయి. కానీ అలా మొగ్గలా మొదలైన ప్రేమ, ఓ అందమైన బంధంగా ముందుకు సాగాలంటే కాస్త కష్టపడాల్సిందే... అందుకోసం ఈ ఉపాయాలు తప్పకుండా మేలు చేకూరుస్తాయంటున్నారు ప్రేమపండితులు. అభిరుచులు తెలుసుకోండి – ఈ విషయం గురించి మరోసారి చెప్పాల్సిన పని లేదు కానీ, మనసుని గెల్చుకునేందుకు రాచమార్గం ఇదే! అవతలి మనిషి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకుంటూ... వాటికి అనుగుణమైన బహుమతులు ఇవ్వాలి. వాటి గురించి మనం కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుని ఓ నాలుగు మాటలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. సహజంగా ప్రవర్తించండి – అవతలివారిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నంలో కాస్త అతిగా ప్రవర్తిస్తూ ఉంటాము. తెలియని విషయం తెలిసినట్లుగా చెబుతూ, మన గురించి అతిశయోక్తులు చెప్పుకొంటూ గడిపే ప్రయత్నం చేస్తుంటాము. ఇలాంటి కృత్రిమమైన మాటలను తప్పకుండా పసిగట్టేస్తారు. అందులోనూ ఆడవారు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ ఇలాంటి డాబుసరి మాటల మీద బంధం ముందుకు సాగినా, అది ఒడిదొడుకులకు లోను కాక మానదు. సానుకూల దృక్పథం – జీవితం పట్ల సానుకూల దృక్పథం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు, సమస్యని విశ్లేషించి సలహాని ...

(Telugu) ఈ జాగ్రత్తలు పాటించకపోతే... కొంప కొల్లేరే!

[:te]సంసారాన్ని ఓ ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు కాస్త ఆదమరచి ఉన్నా, వెనకబడిపోవాల్సిందే! ఆ పొరపొటు ఒకోసారి భాగస్వామిని చేజార్చుకునేంతవరకూ వెళ్లవచ్చు. లేదా శాశ్వతంగా మన పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టవచ్చు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు. ఇంతకీ వారి సలహాలు ఏమిటంటే... కుటుంబంలో ఆఫీసు పెట్టొద్దు కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనలేరు. కానీ కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించకపోతే మన పడే కష్టానికి అర్థమే ఉండదు. కనీసం ఇంట్లో ఉండే సమయంలో అయినా టీవీ, ఫేస్‌బుక్‌లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందే. ఆఫీసులో పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి చెప్పి ఉంచితే... మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన బలపడకుండా ఉంటుంది. ఆఫీసరు మీద ఆవేశం ఇంట్లో వద్దు చాలామంది చేసే పొరపాటే ఇది. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ తాలూకు కోపాన్ని ఇంట్లో వెళ్లగక్కుతూ ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు. ఊరంతా తిరిగివచ్చి, ఇంటి బయట చెప్పులు విడవడంతోనే... రోజువారీ...

(Telugu) మాతృత్వంతో మెదడు మారిపోతుంది

[:te]మాతృత్వం తరువాత తల్లి జీవితం మారిపోతుంది. ఆరోగ్యంలో చిన్నాచితకా మార్పులు వస్తాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే! కానీ ఆమె మెదడులో సైతం మార్పులు వస్తాయనీ... కొన్ని ఏళ్ల తరబడి ఆ మార్పులు ఆమెలో ఉండిపోతాయనీ తేలింది. మాతృత్వం ముందు – తరువాత తల్లి మెదడులో మార్పు నిజమా కాదా తెలుసుకునేందుకు స్పెయిన్‌లోని పరిశోధకులు ఓ 25 మంది స్త్రీలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 30 ఏళ్లు దాటినవారే. త్వరలో తల్లి కావాలని ఆశిస్తున్నావారే. ఆ సమయంలో వీరి మెదడుని స్కానింగ్‌ చేశారు. తిరిగి వారు గర్భం ధరించిన తరువాతా, పిల్లల్ని కన్న తరువాత కూడా వారి మెదడుని పరిశీలించారు. మార్పు కనిపించింది మాతృత్వం తరువాత స్త్రీల మెదడులోని కొన్ని ప్రాంతాలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. ఇతరుల అవసరాలను, అభిప్రాయాలను నిశితంగా పరిశీలించగలిగే భాగంలో ఈ మార్పు కనిపించింది. అయితే దీని వలన వారి జ్ఞాపకశక్తిలో ఎలాంటి లోటూ రాకపోవడాన్ని గమనించారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మాతృత్వం సాధించినా, సహజ పద్ధతులలోనే గర్భాన్ని ధరించినా కూడా ఈ మార్పు కనిపించి తీరింది. అయితే మగవారిలో మాత్రం ఇలాంటి మార్పులేవీ కనిపించలేదు. తండ్రిగా మారక ముందు వారి మ...

(Telugu) నిజమైన ప్రేమ

[:te]అతనో సైనికుడు. ఆ సైనికుడు తను బాధ్యతలు నిర్వహిస్తున్న ఊరిలో, ఒక అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. ఆ అమ్మాయికీ అతనంటే ఇష్టం ఏర్పడింది. కానీ తమ కూతురికి ఒక సైనికుడికి ఇచ్చి వివాహం చేయాలంటే, అమ్మాయి తల్లిదండ్రులకి మనసు ఒప్పలేదు. దాంతో వారి మనసుని కూడా గెలుచుకోవాలని సైనికుడు విశ్వప్రయత్నం చేశాడు. కొన్నాళ్లకి అమ్మాయి తల్లిదండ్రులకి అతని మీద సదభిప్రాయం ఏర్పడింది. ‘ఏ ఉద్యోగంలో ఉండే కష్టనష్టాలు ఆ ఉద్యోగంలో ఉంటాయి. సైనికుడు అయినంత మాత్రాన అల్పాయుష్కుడు అవుతాడా? రాజైనంత మాత్రాన నిండు నూరేళ్లు ఖచ్చితంగా బతుకుతాడా?’ అని తమకి తాము సర్ది చెప్పుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. అందమైన అమ్మాయికీ, సైనికుడికీ ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. ఒక నెల రోజుల్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటుండగా యుద్ధం ముంచుకువచ్చింది. ఇక తిరిగివచ్చాకే వివాహం అనుకుంటూ యుద్ధభూమికి బయల్దేరాడు సైనికుడు. రోజులు గడుస్తున్నాయి. యుద్ధం భీకరంగా సాగుతోంది. ఆ యుద్ధభూమి నుంచే వారానికి ఓ ఉత్తరం రాస్తున్నాడు సైనికుడు. కానీ ఒక్క ఉత్తరానికి కూడా అతనికి బదులు రాలేదు. కారణం... యుద్ధం మొదలైన కొన్ని రోజులకి అమ్మాయి ఉండే పల్లెటూరి మీద శత్ర...

(Telugu) తిరిగివచ్చిన జీవితం

[:te]ఆ రోజు ఎలాగైనా తన మనసులో మాటని భార్య చెప్పాలనుకుని గుండెను రాయి చేసుకుని ఇంటికి బయల్దేరాడు. తన జీవితంలోకి వేరే అమ్మాయి ప్రవేశించిందనీ... అందుకోసం విడాకులు కావలన్న విషయాన్ని తన భార్యకు చెప్పేందుకు బయల్దేరాడు. విడాకులు కావాలన్న నిర్ణయాన్ని వినగానే ఆమె ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె బాధని చూసిన అతను తనకి విడాకులు ఎందుకు కావాలన్న విషయాన్ని మాత్రం చెప్పలేకోపోయాడు. అంతగా ప్రేమించే భార్యని విడిచి తను ఇంకొకరిని ప్రేమిస్తున్నానన్న విషయాన్ని ఎలా చెప్పగలడు! కాకపోతే వివాహం తరువాత కూడా ఆమెను లోటు రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లైన తరువాత తాము ఎన్నో కలలతో నిర్మించుకున్న ఇంటితో పాటుగా, నెలనెలా తన జీతంలో కొంతభాగాన్ని ఆమెకు ఇస్తానని చెప్పాడు. కానీ విడాకులు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ రాత్రంతా తన భార్య మెలకువగానే ఉండటాన్ని గమనించాడు. మర్నాడు ఉదయం అతను ఆఫీసుకి బయల్దేరుతుండగా- ‘‘నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. అందుకు బదులుగా నాకేమీ డబ్బు, ఆస్తి అక్కర్లేదు. కానీ ఒక్క చిన్న షరతు...’’ అంది భార్య. భార్య విడాకులకు ఒప్పుకోగానే అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ‘‘నీ షరతు ఏమిటో...

(Telugu) వెన్నంటి వచ్చే ధైర్యం

[:te]అతని లోకం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఏదో మాయదారి ఇన్ఫెక్షన్‌ సోకి అతని రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. వైద్యులంతా చేతులెత్తేశారు. పరిచయస్తులంతా సానుభూతి చూపేందుకు సిద్ధపడిపోయారు. కానీ ఎవరి ఓదార్పూ కూడా అతనికి స్వాంతన కలిగించలేదు. అకస్మాత్తుగా గుడ్డివాడిగా మారిపోవడం అంటే జీవితం చేజారిపోవడమే అనిపించింది. కానీ ఎన్నాళ్లని అలా ఇంట్లో కూర్చుంటాడు! అతనికి తగినట్లుగా ఏదో ఒక పని చూసిపెడతామని ఆఫీసువాళ్లు కబురుపెట్టారు. దాంతో భార్యని తీసుకుని రోజూ ఆఫీసుకి వెళ్లడం మొదలుపెట్టాడు. మళ్లీ సాయంత్రం వేళకి భార్య ఆఫీసు దగ్గరకి వచ్చి అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది. రోజూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బస్సులో ఆఫీసుకి వెళ్లడం, భార్య అతన్ని ఆఫీసులో దింపేసి ఇంటికి వచ్చి తన పనుల్లో మునిగిపోవడం, తిరిగి ఆఫీసు ముగిసే సమయానికి అక్కడికి వెళ్లి భర్తని తీసుకురావడం... ఇదే వారి దినచర్యగా మారిపోయింది. ఇలా ఒక నెలరోజులు గడిచాయి. ఒక రోజు ఉదయం భార్య, భర్త దగ్గరకి వెళ్లి నిదానంగా ‘‘ఎన్నాళ్లని ఇలా రోజూ మీతో పాటు రాగలను. పైగా ఏదో ఒక రోజు మీరు ఒంటరిగా వెళ్లక తప్పదు. అందుకని ఇప్పటినుంచే ఒంటరిగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోరాదా! ...

(Telugu) క్షమాపణ చెప్పడం ఒక కళ

[:te]ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే బంధం ఎల్లకాలం ఒకేలా ఉంటుందని అనుకోలేము. ఒక చిన్న మాటతోనో, అనుకోని చేతతోనో ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడవచ్చు. పట్టుదలకు పోయి ఆ స్పర్థను అలాగే వదిలేస్తే, విలువైన అనుబంధం కాస్తా చేజారిపోతుంది. తప్పు మనవైపు ఉంది అని మన విచక్షణ చెబుతున్నప్పుడు, మనం చెప్పే ఒక చిన్న క్షమాపణతో బంధాలు తిరిగి బలపడతాయి. అందుకే క్షమాపణ చెప్పడం కూడా ఒక కళ అంటున్నారు నిపుణులు. ఆ కళలోని కొన్ని మెలకువలు ఇవిగో... వీలైనంత త్వరగా! తప్పు మనదే అని తేలిపోయినప్పుడు వీలైనంత త్వరగా క్షమాపణ చెప్పేయడం మంచిదంటున్నారు. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ, ఇద్దరి మధ్యా దూరం మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. పట్టుదలలు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. క్షమాపణకి ఎక్స్‌పైరీ డేట్ ఉండకపోవచ్చు. కానీ అప్పటికప్పుడు చెప్పే క్షమాపణలు మరిన్ని అపార్థాలకు దారితీయకుండా కాపాడతాయి. మనస్ఫూర్తిగా చెప్పండి అవతలివాళ్లు ఏడ్చిపోతున్నారనో, తప్పు బయటపడిపోయిందనో.... మొక్కుబడిగా క్షమాపణ చెబుతారు కొందరు. ఇలాంటి క్షమాపణలు అవతలివారు తప్పక పసిగట్టేస్తారు. దానివల్ల తాత్కాలికంగా సమస్య దూరమైనట్లు కనిపించినా, మీ గురించి ఏర్పడిన అపనమ్మకం మాత్రం వారి ...

(Telugu) విరిగిపోని పాత్రలు

[:te]అది ఓ చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివర ఓ పూరిగుడిసె. గుడిసె పేదదే కానీ, అందులో ఉండే తండ్రీకొడుకులు మాత్రం మహా సంతోషంగా ఉండేవారు. పొద్దన లేచిందగ్గర్నుంచీ పొద్దుగూకేదాకా ఊళ్లో ఏదో ఒక పని చేసుకుని వచ్చేవారు. వస్తూ వస్తూ ఇన్ని కట్టెలు కొట్టుకు వచ్చి పొయ్యి రాజేసుకునేవారు. ఉన్నదేదో వండుకుని తినేవారు. కొంతకాలానికి కొడుకు పెళ్లి చేసుకున్నాడు. కొత్తగా వచ్చిన కోడలుతో ఆ ఇంటి సంతోషం రెట్టింపయ్యింది. తండ్రీ కొడుకు ఎప్పటిలాగే నిత్యం ఏదో ఒక పని చేసుకు వచ్చేవారు. కాలం గడుస్తున్న కొద్దీ తండ్రికి ఓపిక తగ్గిపోసాగింది. అతని చేతుల్లో మునుపటి పట్టు లేదు. అతని చేతల్లో మునుపటి దుడుకు లేదు. ఇప్పుడు ఇల్లు గడిచేందుకు కొడుకూ, కోడలూ కలిసి పనికి వెళ్తున్నారు. వారికి పుట్టిన బిడ్డ ఆలనాపాలనా కూడా ముసలాయనకి అప్పగించి ఊరిలోకి బయల్దేరుతున్నారు. కొంతకాలానికి మనవడు పరుగులెత్తే వయసుకి చేరుకున్నాడు. ముసలాయన మాత్రం మరింత నీరసించిపోయాడు. భోజనం చేసేటప్పుడు కూడా ఆయన చేతులు వణుకుతున్నాయి. తినే ప్రతిసారీ కాస్తో కూస్తో కిందా మీదా ఒలకాల్సిందే! భోజనాల బల్ల దగ్గర తన తండ్రి చేసే పని చూసి కొడుకూ, కొడలుకి చిరాకెత్తిపోయేది. ప్రతిరోజూ ఏద...

(Telugu) తండ్రిగా ఉంటే బోలెడు ఆరోగ్యమట!

[:te]ఇంట్లో చిన్న పిల్లల అల్లరితో చిరాకుపడని తండ్రులు ఉండరు. పని చేసుకోనివ్వకుండా, పడుకోనివ్వకుండా కాళ్లకి అడ్డం పడిపోతూ ఉండే పిల్లలను విసుక్కోని నాన్నాలు ఉండరు. కానీ పైపైకి ఇలా విసుక్కుంటున్నా, జీవితంలోని ఈ పార్శ్యం ఎంతో అమూల్యం అని వారికి తెలుసు. అయితే వారికి కూడా తెలియకుండా జరిగే ప్రక్రియ ఏమిటంటే.... పిల్లల వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటం! ఒత్తిడి మాయం! పిల్లల పట్ల అనుబంధం కలిగిన తండ్రులలో ఒత్తిడి శాతం చాలా తక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు పరిశోధకులు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ వంటి సంస్థలు ఎన్నో వందలాది కుటుంబాల మీద పరిశోధనలు చేసిన తరువాతే తేల్చిన అంశం ఇది. ఇలా ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి, అజీర్ణం, డిప్రెషన్, ఛాతీనొప్పి వంటి లక్షణాలు కూడా దూరంగా ఉండటాన్ని గమనించారు. ఆఫీసులో ఆరోగ్యం ఒక పరిశోధన ప్రకారం పిల్లలు ఉన్న తండ్రులు తమ తోటివారికంటే 22 శాతం ఎక్కువ బోనస్‌ను సంపాదించగలుగుతున్నారు. పైకి కాస్త చిత్రంగా కనిపిస్తున్నా దీనికి కారణం లేకపోలేదంటున్నారు పరిశోధకులు. పిల్లలు ఉన్న తండ్రులకి సర్దుకుపోయే లక్షణం ఉంటుందనీ, పైగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడంలాంట...

(Telugu) అందమైన జీవితం కోసం- మినిమలిజం!

[:te]మనిషి బతకడానికి ఎన్ని వస్తువులు కావాలి? ఈ ప్రశ్నకు బదులుగా ఒక జాబితాను రూపొందించడం మొదలుపెడితే ఒక వంద వస్తువులు మించి కనిపించవేమో! కానీ మన చుట్టూ ఎన్ని వేల, లక్షల వస్తువులను పోగేసుకుంటున్నామో కదా! రెండు ఫోన్లు, నాలుగు వాచీలు, ఇరవై జతల బట్టలు, వేల బొమ్మలు... ఇలా మన చుట్టూ ఉన్న వస్తువులను ఒక్కసారి లెక్కపెట్టుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ తరువాత ఇవన్నీ మన జీవితానికి అవసరమా అన్న ఆలోచనా కలగక మానదు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఒక జీవన విధానమే ‘మినిమలిజం’! మినిమలిజం అనే ఆలోచనాధోరణి జెన్‌ తరహా జీవన విధానం నుంచి మొదలైంది. బుద్ధుని బోధనల్లో ముఖ్యమైనది ‘కోరికలను త్యజించాలి’ అన్న సూత్రమే కదా! ఎందుకంటే మనసులో కోరిక అనేది ఉంటే... దాన్ని పొందాలనుకునే తపనలో దుఃఖం ఉంటుంది; ఆ కోరికను సాధించలేకపోయినా దుఃఖం ఉంటుంది; ఇక కోరికను సాధించిన తరువాత, అది అనుకున్నంత సుఖంగా లేదనో... అంతకంటే ఉన్నతమైనది సాధించలేకపోయామనో దుఃఖం సిద్ధంగా ఉంటుంది. మనలోని కోరికలను నిరంతరం రెచ్చగొట్టే ఈ ప్రపంచీకరణలో బుద్ధుడు చెప్పిన ఈ సూత్రం మరింత ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఒక ఫోన్‌ కొన్నవెంటనే మరో కొత్త మోడల్‌ సిద్ధం! ఒక టీవీ కొనాలని వెళ్త...

(Telugu) అందమైన దాంపత్యం

[:te]అనగా అనగా ఒక అన్యోన్యమైన జంట. వాళ్లిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్లందరికీ ముచ్చటగా ఉండేది. అలాగని వారు అందరికంటే అందంగా ఉండేవారని కాదు! ఎప్పుడూ కొట్టుకోకుండా ఉండేవారనీ కాదు! కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసిమెలిసి ఉండేవారు. అలాంటి వారిద్దరి మధ్యా ఒక కథ నడిచింది... ఒక రోజు భర్త ఇంటికి వస్తూనే ‘నేను ఇవాళ దాంపత్యం గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం విని వస్తున్నాను’ అన్నాడు. ‘ఏం చెప్పారేంటి ఆ ఉపన్యాసంలో!’ అంటూ ఆసక్తిగా అడిగింది భార్య. ‘భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదంట. అందుకోసం ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే, వాటి గురించి ముందుగానే చర్చించుకుని తేల్చుకోవాలంట!’ అంటూ చెప్పుకొచ్చాడు భర్త. భార్య ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ‘ఈ ఉపన్యాసం విన్న తరువాత నాకు ఓ ఉపాయం తట్టింది. ఇవాళంతా కూర్చుని నీలో నచ్చని విషయాలు ఏమున్నాయో, ఒక కాగితం మీద రాస్తాను. నువ్వు కూడా నాలో నచ్చని విషయాలు ఏమేం ఉన్నాయో ఒక కాగితం మీద రాసి ఉంచు. అలా కాగితాలలో రాసుకున్న లోపాల గురించి రేపు చర్చించుకుందాం’ అంటూ హడావుడిగా గదిలోకి వెళ్లి ఒక పెన్నూ, కాగితం పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వేళకి భర్త వంటింట్లోకి ...

(Telugu) సుఖమా! సంతోషమా!

[:te]అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు. ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన ...

(Telugu) ఉపనిషత్తులో చెప్పిన ప్రేమ

[:te]ప్రేమ ఎప్పుడూ మోహానికీ, దుఃఖానికీ కారణం అవుతుందంటారు. కానీ ప్రేమలో స్వార్థం నిండినప్పుడే అలా జరుగుతుందేమో! ఎందుకంటే నిజమైన ప్రేమ ఎదుటి మనిషికి నమ్మకం అనే రెక్కలనిస్తుందే కానీ, మోహం అనే సంకెళ్లతో తన ఎదుట బంధించుకోదు. నిజమైన ప్రేమ ఇవ్వగలిగినది ఇస్తుందే కానీ, ఫలితాన్ని ఆశించి బంధాన్ని వ్యాపారంగా మార్చేయదు. అలాంటప్పుడు ప్రేమ మోహానికీ, దుఃఖానికీ కారణం ఎలా అవుతుంది. కాదు గాక కాదు. పైగా తన ప్రేమతో ప్రతి జీవితాన్నీ వెలిగిస్తుంది. అలా వెలిగిన జీవితాలలో తన సార్థకతను చూసుకుంటుంది. ఇది ఎవరో ఒకరు చెప్పింది కాదు. ఏదో ఒక చోట అనుకునే గాలివాటు మాటా కాదు. ఆలోచన ఉన్న ప్రతి మనిషికీ తట్టిన భావం. కావాలంటే ఈ ఉపనిషత్తు మంత్రాన్ని చూడండి... యస్మిన్   సర్వాణి   భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్రకో   మోహః   కః   శోక   ఏకత్వమనుపశ్యతః అని చెబుతోంది ఈశావాస్యోపనిషత్తులోని ఒక మంత్రం. ఆత్మానుభూతిని పొందినవాడికి ఈ ప్రపంచంలోని జీవులన్నీ కూడా తనలోని భాగమే అనిపిస్తుందట. ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ తానున్నానన్న భావన కలుగుతుందట. అలాంటప్పుడు ఇక తారతమ్యాలు ఎలా కలుగుతాయి? అందుకనే ఈ భావనతో ఉన్నవారికి దేనిపట్లా మోహం కానీ, దుఃఖం ...