పుష్య మాసం - సంక్రాంతి విశిష్టత
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.
ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటి తో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.
సంక్రాంతి సంప్రదాయాలు.
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి.
ముగ్గులు…..
ఓర్పును నేర్పే కళ…
ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.
భోగిమంటలు.
వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.
గంగిరెద్దులు, హరిదాసులు….
భిక్షానికీ ఓ ధర్మం..
ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.
గుమ్మడికాయ….
తీగల్లా అల్లుకుపోవాలి..
ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.
గొబ్బెమ్మలు….
అసహ్యం నుంచి అద్భుతం
కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .
భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.
గాలిపటం.
దారంలాంటిది జీవితం
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.
కోడిపందేలు.
యుద్ధనీతిని గెలిపించే పందెం
పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.
పశు పూజలు
శ్రమకు కృతజ్ఞత
సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.
***************************************************************************
సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మన ప్రత్యక్ష దైవము. అతడు అన్ని జీవరాశులకు ఆధారము, ఆలంబన అందించే అద్భుతమైన తేజోరాశి. ఖగోళ శాస్త్రం రవిని స్థిరతారగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు చేసినా మనం అనుసరించేది చూసేది గ్రహకూటముల, నక్షత్ర రాశుల గతులు మరియు సూర్యగమనం. మనకున్నవి పన్నెండు రాశులు. సూర్యుడు నెలకొక రాశిలో కాలం గడిపి, ఆ తరుణం గడచిన పిదప ఒక రాశిని వదలి తరువాతి రాశిలో ప్రవేశిస్తుంటాడు. సూర్యుని ప్రవేశం జరిగిన రాశికి సూర్యుడు సంక్రమిస్తాడు. అదే సంక్రమణం. దీనినే సంక్రాంతి అంటాము. అలా సూర్యుడు పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కలిగిస్తాడు. అయితే ఇందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం. ఇది సూర్యుని ఉత్తరదిక్కు ప్రయాణం. ఈ ప్రయాణాన్నే ఆయనం లేదా ఆయణం అంటారు. ఉత్తరాయణం శుభప్రదమైనది. ఇది పుణ్యకాల ప్రారంభం. ఈ పుణ్యకాలంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఎక్కువగా. ఈ పుణ్యకాలం కోసమే తండ్రి శంతనుని నుండి స్వచ్ఛంద మరణం వరంగా పొందిన కురుపితామహుడైన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో విపరీతంగా గాయపడి ఒరిగినపుడు అర్జునుడు అమర్చిన అంపశయ్యపై ఉత్తరాయణ ఆరంభమయే వరకు నిరీక్షించాలనుకుంటాడు.
ఉత్తరాయణ శుభారంభం అయిన మకర సంక్రాంతి చాల విశిష్టమైనది. ఉత్తరాయణంలో సూర్యునిగమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమంగా పెరుగుతూ వస్తుంది. సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే సూర్యునికిరణాలు ఎక్కువగా సోకితే అది మనకు కూడ మంచిదికాదు. ఎందుకంటే సూర్యరశ్మి లోని అతి నీలలోహిత కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధమైన క్యాన్సర్ ను ఇతర రుగ్మతలను కలిగిస్తుంది.
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. మకర సంక్రాంతి మనకు శుభతరుణం. సంక్రాంతి మనకు తెస్తుంది క్రొత్త కాంతి. ఈ పండగ ముఖ్యంగా మూడు దినాలు. భోగి, సంక్రాంతి, కనుము.
సంక్రాంతికి ముందు రోజు భోగి. ఈ రోజు తూర్పు తెల్లారక ముందే నిద్ర లేచి భోగిమంట వేస్తారు. పిల్లలు ఆవు పేడతో చేసిన భోగిపిడకలు దండలుగా గుచ్చి భోగి మంటలో వేస్తారు. భోగి దినం సాయంత్రం పసిపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగిపళ్ళులో నేరేడు పళ్ళు, కొత్త పైసలు, చెరుకు ముక్కలు, చాక్ లేట్లు కలిపి పసిపిల్లలను ఎవరి ఒడిలోనైనా కూర్చోపెట్టి తలమీదుగా జారుతూ భోగి పళ్ళు పోస్తారు.
మరునాడు సంక్రాంతి పండుగ. ఇదే మకర సంక్రాంతి. ఇది ముఖ్యంగా దీనినే పెద్ద పండుగ అంటారు. పండిన పంటలు నూర్పుకు వచ్చి, తమ కష్టానికి ప్రతిఫలం లభించిన రైతులు పెద్దయెత్తున ఈ పండగ జరుపుకుంటారు. ఇళ్ళముందు ముదితలు, ఆడ పిల్లలు పేడ నీళ్ళతో కల్లాపి జల్లి, ముగ్గులు పెట్టి, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. పగటి పూడ గాలిపటాల (పతంగుల) పండగ ఉంటుంది. ఇళ్ళలో బొమ్మల కొలువులు పెడతారు. హరిదాసులు ఇంటింటికీ తిరిగి రావమ్మా మహాలక్షి రావమ్మ అని పాడుతుంటారు.
కనుమును పశువుల పండుగ అని కూడ అంటారు. రైతులు గంగిరెద్దులను అలంకరించి ప్రతి యింటికి పోయి అయ్యవారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు అని సన్నాయి వాయిస్తూ గృహస్థుల నుండి బియ్యం, కానుకలు గ్రహిస్తారు.
ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. సంక్రాంతి అందరికీ ఇష్టమే అయినా, రైతులకి మరీ ప్రియమైన, పెద్ద పండుగ. అప్పుడే పంట చేతికి రావడంతో ఎంతో ఇష్టంగా, ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవరోజు కనుమ.
జయసింహ రాసిన ‘కల్పధ్రుమం’లో సంక్రాంతిని ఇలా వర్ణించారు
“తత్ర మేశాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూవస్మాద్రాసే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి”
దీని అర్ధం ఏమిటంటే మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందు ఉన్న రాశి లోంచి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి
************************************************************************************************
క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి:
తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప క్రాంతిమయ పర్వదినం సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. మన కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఏవైనా పొరపొచ్చాలు, బేదాభిప్రాయా లు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసి మెలిసి జరుపుకునే అద్భుత రోజులే ఈ పండగలు . ఈ “సంక్రాంతి” అనడం లో “సం” అంటే మిక్కిలి “క్రాంతి” అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని “సంక్రాంతి” గా పెద్దలు వివరణ చెబుతూ ఉంటారు. అన్నదాతలు సంవత్సరమంతా కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకు చేరి, తద్వారా ధనలక్ష్మి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగ బంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో “సంక్రాంతి”ని “తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః” అని అభివర్ణించారు.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే లేక చేరే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించి న ప్పటి నుండీ మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమై న అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణ ము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకుని ఉండే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంచేతే మహా భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన కురువృద్ధుడై న భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణంలో రథసప్తమి నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు. ఆది శంకరాచార్యుడు ఈరోజు నే సన్యాసం పుచ్చుకున్నాడు. అంతటి మహత్తరమైన పర్వదినం మకర సంక్రాంతి లేక పెద్ద పండుగ. ఈ పండగను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలలోనే కాక, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో కూడా పాటిస్తారు. మనకు వచ్చే పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి పాటించడం జరుగుతుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్స రం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం అవన్నీ వేరువేరు రోజుల్లో వస్తాయి.
తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా మధ్య దినమైన రోజును ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. పుష్య మాసంలో వచ్చే ఈ పండుగ పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు ఈ దినాలలో నిర్వర్తించాలి. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. కాల చక్రానికి అనుగుణంగా సంచరిస్తూ ఉండే దేవతా స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. సంక్రాంతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్థాపన జరిగి అధర్మమును రూపు మాపిన రోజు సంక్రాంతి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయన ను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.
సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయి న వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణా లు ఇవ్వాలి అని విధి. కానీ, మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇచ్చినా.. ఇవ్వక పోయినా..ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇవ్వాలి.
మహిళలు ఎంతో అందంగా రంగ వల్లులు తీర్చిదిద్దే రోజు సంక్రాంతి. దానికి ఆరోగ్య రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా ఎంతో ప్రాముఖ్యం ఉందని పెద్దలు చెప్తారు. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతంగా భావిస్తే… ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం గా చెప్తారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుని స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి (స్టాటిక్ ఫోర్స్) చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్) కు సంకేతాలనీ.. శ్రీచక్ర సమర్పణా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. మన నేటి మహిళ లు కాంక్రీట్ జంగిల్స్ లో నివసిస్తూ రంగవల్లుల సంస్కృతిని మరచిపోకుండా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు.
మట్టి తో ఒక బొమ్మను చేసి (సంక్రాంతి పురుషుడు), సంవత్సరాన్ని బట్టి ఒక వాహనాన్ని చేసి దానిపై కూర్చుండ జేసి, మేళ తాళాల తో, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు. ఇంకా.. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించితే.. హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తరతమ భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం. గంగిరెద్దు ముందు వెనుకల చెరో ప్రమధునితో, ఎత్తైన మూపురం శివలింగ ఆకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ ప్రదేశం ధర్మభద్దమైనదని అర్ధం. “జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమే నంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం. ఇన్ని పరమార్ధాలు గల హరిదాస బృందం ఆ పర్వదినాన మన ఇంట అడుగు పెడితే పావన మే కదా!
సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మల కి సిద్ధిస్తాయని ఓ నమ్మకం. మగపిల్లలు పతంగులు (గాలి పటాలు) ఎగురవేసి ఆనంది స్తారు. తమ తమ ఇంటి ఆచారం ప్రకారం కొందరు స్త్రీలు సావిత్రీ వ్రతం లాంటి నోములను నోచుకుంటారు. దీనివల్ల కుటుంబసౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సౌభాగ్యం సిద్ధిస్తుందని వారి నమ్మకం. ఇరుగు పొరుగులను పిలిచి పండు తాంబూలాలను, నువ్వుండలను ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదాలను తీసుకొంటారు. కొందరు సంక్రాంతి నాడు రాముని పూజచేస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్నీ పఠిస్తారు. బలిచక్రవర్తికి ఉన్న త్యాగ గుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. తెలంగాణ అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కుంటారు. ఇవే కాక ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీప దానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడి కాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు తీరుతాయి. బుద్ధి వికాసం కలుగుతుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును తీర్చి పేరంటాలూ చేస్తారు.
పండ్రెండు సంవత్సరాలు బాలునిగా, వీర పద్మాసన భంగిమలో కూర్చుని, కుడిచేతి ని చిన్ముద్రగా చేసుకుని ఆ కొండమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకరవిళక్కును నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. పుష్యమాసములో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రొజున గోదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. అంతేకాక సంక్రాంతినాడు, కొత్త అల్లుళ్ళ రాక, బావామరదళ్ళ పరిహాసాలు కేవలం మన తెలుగు లోగిళ్ళలోని ప్రత్యేకత.
సంక్రాంతికి ముందు రోజు ‘భోగి’ పండుగ జరుపుకుంటా రు. మూల మూలల చెత్తా, పనికిరాని వస్తువులూ ఒకచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడ లు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న చిన్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.
సంక్రాంతి మరుసటి రోజు ‘కనుమ’. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ.
పండుగలు మన హైందవ జీవన స్రవంతిలో ప్రముఖ భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ప్రతి పండుగ వెనుకా తప్పక ఒక సందేశం దాగి వుంటుంది. వైజ్ఞానికంగా మన మహర్షులు ఎంతో పరిశోధించి ఏర్పరచిన ఈ పండుగలన్నీ మానావాళికి హితాన్ని బోధించేవే! సంక్రాంతి పండుగ జరుపుకోవడంలో కూడా ఎన్నో ప్రయోజనాలు న్నాయి. ఇంత చక్కని ఆనందాలను మనకుఅందించే “సంక్రాంతి” పండుగలను మనం ఘనంగా జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ పౌష్య లక్ష్మినీ..సంక్రాంతి లక్ష్మీని.. మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.

Comments
Post a Comment