(Telugu) పొదుపు ప్రాధాన్యం తెలియాలి..
[:te]మహిళలు ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. మగవాళ్లతో సమానంగా సంపాదిస్తున్నారు. కానీ చివరి దశలో లేదా రిటైర్‌మెంట్‌దగ్గరపడే నాటికి మగవాళ్లకు ఉన్నంత ఆర్థిక భద్రత ఉండటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
మగవాళ్లతో పోలిస్తే మహిళలు పొదుపు విషయంలో సంప్రదాయ విధానాలనే పాటిస్తున్నారు. దీని వల్ల వాళ్లు చేస్తున్న పొదుపు సత్ఫలితాలని ఇవ్వడం లేదు. దాంతో పదవీ విరమణ తర్వాత జీవితంలో ఒడుదొడుకులని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం భవిష్యత్తులో ఎదురయ్యే అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 62 శాతం మగవాళ్లు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుంటే, కేవలం 45 శాతం మహిళలే భవిష్యత్తు ఫండ్‌ని ఏర్పాటు చేసుకొంటున్నారు.
*వివిధ పద్ధతుల్లో పొదుపు చేయడాన్ని మగవాళ్ల హాబీగా ఎక్కువ మంది స్త్రీలు భావిస్తున్నారట. పొదుపు , భవిష్యత్తుకి చాలా అవసరమని భావించడం లేదు బ్యాంకు రేట్ అనే సంస్థ అద్యయనం ప్రకారం 30 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్కులు అత్యవసర నిధిపై పెద్దగా దృష్టి సారిచడం లేదు. చిన్న వయసు వాళ్లూ, రిటైర్‌మెంట్ వయసు వాళ్లూ ఈ విషయంలో చురుగ్గా ఉంటున్నా మధ్య వయస్కులే మెరుగ్గా ఉండకపోవడానికి కారణమంటే... బహుళా పిల్లల చదువులూ, బాధ్యతలూ ఆ వయసులో ఎక్కువగా ఉండటమూ ఓ కారణం అంటున్నాయి అధ్యనాలు. అయితే కొత్త తరం వాళ్లు అంటే పద్దెనిమిది నుంచి 30 సంవత్సరాల వయసు అమ్మాయిల్లో చాలామంది ఐదు నెలలకు సరిపడే డబ్బుని ఊహించని ఖర్చుల కోసం పక్కనపెడుతున్నారట.[:]

Comments
Post a Comment