సూర్యోపనిషత్
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: ! వ్యశేమ దేవహితం యదాయు: ! స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: ! స్వస్తి న పూషా విశ్వవేదా: ! స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: ! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !! ఓం శాంతి: శాంతి: శాంతి: !!! ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక ! మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని ఒసగెదరుగాక! ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: ! ఓం! అథర్వణవేదంలోని అంగిరసుల సూర్యోపనిషత్ చెబుతాము. బ్రహ్మా ఋషి: ! గాయత్రీ ఛన్ద: ! ఆదిత్యో దేవతా ! హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ ! హృల్లేఖా శక్తి: ! వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ ! చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: ! బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణులు బీజం... హృల్లేఖ శక్తి.....