Posts

Showing posts with the label సుబ్రహ్మణ్యేశ్వరుడు

స్కందగిరివాసా... సుబ్రహ్మణ్యేశ్వరా..!

‘నమో దేవాయ మహా దేవాయ సిద్ధాయ సంతాయ నమో నమః శుభాయ దేవసేనాయ షష్ఠి దేవాయ నమో నమః’ అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నిండుమనసుతో ఆరాధించే భక్తులు లెక్కకుమిక్కిలిగానే ఉన్నా ఆయన కొలువుదీరిన ఆలయాలు మాత్రం అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి సికింద్రాబాద్‌కు చెందిన స్కందగిరి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఆ ఆలయ విశేషాలు... మార్గశిరమాసం, శుక్లపక్షం, ఆరో తిథి... శివపార్వతుల ద్వితీయ పుత్రుడైన కుమారస్వామి జన్మించిన సుదినం. అదే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. ఆ రోజుని ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చిస్తారు. కుమారస్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. దేవగణాలకు సేనాధిపతి అయిన కుమారస్వామిని షష్ఠినాడు దర్శించుకుని, అభిషేకించి, తమ శక్తికొద్దీ పేదలకు అన్న, వస్త్ర, వస్తు దానాలు చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాలనుంచీ విముక్తి కలుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఐదు తలల పాము రూపంలో ఈ లోకాన్ని సంరక్షిస్తుంటాడనీ పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున పుట్టలో పాలుపోయడం ద్వారా కుమారస్వామిని పూజిస్తారు. సర్పదోషం ఉన్నవాళ్లు షష్ఠిరోజున...

శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి

శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగాతెలుసుకుందాము. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింప...

కుజదోష నివారణకు

కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాళి రోజు 9సార్లు 12 రోజులు పారాయణ చేసి వల్లీ, దేవసేనా అష్టోత్తర శతనామాలు ఒకసారి చదవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యమాలా మంత్రము రోజుకొకసారి 40 రోజులు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అదీ కుదరకపోతే సుబ్రహ్మణ్య కవమ్ రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం 27 రోజులు పారాయణ చేయగలరు. అలాగే సుబ్రహ్మణ్య కరవలాంబ స్తోత్రం రోజుకు 80 సార్లు చొప్పు న 11 రోజులు పారాయణ చేయడం ఉత్తమం. ఇకపోతే.. ఏడు మంగళవారములు ఉదయం ఆరు గంటల నుంచి ఏడుగంటల లోపున శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించడం కుజదోషాన్ని నివారించవచ్చు. ఏడు మంగళవారములు కుమార స్వామికి గానీ, నాగేంద్రస్వామి పుట్టకుగాని 70 ప్రదక్షిణలు చేయగలరు. అలాగాకుంటే ఆదివారం ఖచ్చితముగా రాహుకాలములో సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటలోపుగా నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చేయండి. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టమన్ను చెవికి కచ్చితముగా పెట్టుకోవాలి. పాలుపోయాలి. కొబ్బరికాయ కొట్టి రావాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే శనివారం ఉదయం 9-30 నుంచి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4-3...

సిరులిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు

లయకారుడైన శివుని ఆభరణాలుగా సర్పాలను చూస్తాం. వినాయకుని యజ్ఞోపవీతంగాను, మహావిష్ణువు తల్పంగా గూడా నాగులే దర్శనమిస్తాయ. తారకాసుర సంహారానికి దేవతల కోరికపై శివ వీర్యం వలన జన్మించిన సుబ్రహ్మణ్యశే్వరుడే నాగదేవతగానే ఆరాధిస్తారు. ఒక్క హైందవ సంప్రదాయంలోనే గాక బౌద్దజైన సంప్రదాయాల్లోనూ నాగారాధన కనిపిస్తుంది. సర్పాన్ని జాతీయ చిహ్నంగా గల ప్రాచీనులు కూడా ఉండేవారని చరిత్ర చెప్తోంది. ఇలా సర్పపూజ ప్రపంచం మొత్తంమీద చాలాచోట్ల కనిపిస్తుంది. ఇలాంటి సర్పపూజ సింగరాయపాలెంలో ప్రత్యేకతను సంతరించుకొంది. 1954 సంవత్సరంలో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం, సింగరాయపాలెం, మరియు చేవూరు పాలెం, గుళ్ల సింగరాయపాలెంగా ప్రసిద్ధి చెందిన శింగరాయపాలెం గ్రామంలో ఒక దేవతా సర్పరాజము శ్రీ బాబాజీ మఠములోనుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తటాకంలోకి వచ్చి స్నానం చేసి తిరిగి వెళ్లు సందర్భంలో చేవూరుపాలెంకు చెందిన ఇద్దరు రైతు సోదరులు అయిన అనందాసు వెంకటేశ్వరరావు (వెంకన్న), కీ.శే. ఇసుకపల్లి సుబ్బారావులు ఆ దేవతా సర్పరాజంపై రాళ్లు విసిరారు. ఆ సర్పరాజం తల నేల బాదుకుని మరణించింది. ఆ సర్పమును గ్రామస్తులు చేవూరుపాలెం కాలువగట్టుపై పాతిపెట...

సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగాతెలుసుకుందాము. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహాని...

సుబ్రహ్మణ్య షష్ఠి

Image
        తెలుగునాట దీపావళి పండుగ తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్బరాయుడి షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి, అని, స్కంద షష్ఠి అని అనేక రకాలుగా పిలుచుకోవటం కనిపిస్తుంది. సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు క...

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు!

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ... తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే! దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు. వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపు...

ఆరు ముఖాల స్వామికి ఆరు ఆలయాలు

పంచారామాల గురించి విన్నాము. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత స్థాలాలు, 108 వైష్ణవ దివ్యదేశాలు... అన్నింటి గురించీ వినే ఉంటాము. కానీ అమ్మవారికీ, శివునికీ, విష్ణుమూర్తికీ ఉన్నట్లు కుమారస్వామికి కూడా కొన్ని క్షేత్రాలు ఉన్న విషయం తెలుసా! శివపుత్రుడు కుమారస్వామికి ఆరు ముఖాలు ఉంటాయని చెబుతారు. ఆయనను ఆరుగురు అక్కచెల్లెల్లు పెంచారని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆరు అనే సంఖ్యను ఆ స్వామికి ప్రతీకగా భావిస్తుంటారు. ఆయనకు ఎన్ని క్షేత్రాలు ఉన్నా, అందులో ఆరు క్షేత్రాలను మరింత మహత్యం ఉన్నవిగా పేర్కొంటారు. 15వ శతాబ్దంలో తమిళ భక్తి సాహిత్యంలో ఈ క్షేత్రాలను తొలిసారిగా పేర్కొన్నారట. వీటిని తమిళనాట ‘ఆరు పడై వీడు’ (ఆరు పుణ్యక్షేత్రాలు) అని పిలుస్తారు. అవేమిటంటే... తిరుపరన్‌కుండ్రం – ఆరు పైడైవీడులో ఇది తొలి క్షేత్రం. మధుర మీనాక్షిని దర్శించుకునేవారు, ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఈ తిరుపరన్‌కుండ్రం ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు. ఇంద్రుని కుమార్తె దేవసేనని, కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడే అని భక్తుల నమ్మకం. తిరుచెందూరు – కుమారస్వామి ఆరు ప్రముఖ ఆలయాలలో సముద్రతీరాన ఉన్న ఏకైక ఆలయం తిర...

ప్రపంచంలోనే ఎత్తయిన కుమారస్వామి విగ్రహం

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, శరవణుడు... పేరు ఏదైతేనేం! ఆ శివుని కుమారుని తమ ఇష్టదైవంగా భావిస్తారు భక్తులు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఎక్కడ ఉన్నా, ఆయనని పూజించుకునేందుకు ఓ ఆలయాన్ని నిర్మించుకుంటారు. అలా మలేసియాలో స్వామివారి వైభవాన్ని చాటుతున్ని ఆలయమే ‘బటూ గుహ’లో నెలకొల్పిన స్వామివారి సన్నిధి! తమిళప్రజలు కుమారస్వామిని మురుగన్‌ అన్న పేరుతో కొలుచుకుంటారు. మురుగన్‌ అంటే అందమైనవాడు అని అర్థం. మరి ఆ అందమైన రూపం ఎంత ఎత్తుగా ఉంటే, చూసేందుకు అంత కన్నులపండువగా ఉంటుంది కదా! అందుకనే మలేసియాలో 140 అడుగుల ఎత్తయినా మురుగన్ విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచంలోనే ఇది ఎత్తియిన మురుగన్ రూపం! అయితే ఈ విగ్రహం ఒక ఆరంభం మాత్రమే. బటు గుహల ప్రవేశద్వారం వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని దాటుకుని వెళ్తే... కుమారస్వామికి సంబంధించిన అనేక ముఖ్యాలయాలు దర్శనమిస్తాయి. బటూ గుహలు సున్నపురాతితో ఏర్పడిన సహజసిద్ధమైన గుహలు. ఇవి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందని చెబుతారు. విశాలమైన ఈ సున్నపు గుహలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తూ ఉండేవారు. అలా ఒకసారి మలేసియాలో స్థిరపడిన తంబూస్వ...

కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు!

దక్షిణభారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతాఇంతా కాదు. తమిళనాడులో మురుగన్‌ అంటూ ముద్దుగా పిలుచుకున్నా, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్నా... ఆ షణ్ముఖునికే చెల్లింది. అందుకే ఆయనను ఆరాధించేందుకు ఎన్నో పర్వదినాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో ఒక ముఖ్యమైన పండుగే ‘కుమార షష్ఠి’. ఆ పండుగ సందర్భంగా ఆయన వైభవాన్ని ఓసారి తల్చుకుందాం!!! విజయాలకు – కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే! రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టులావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే... ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట! సంతానానికి - ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సం...