Posts

Showing posts with the label తెలుగు నెలలు – ఆశ్వయుజ మాసం

గోవత్సద్వాదశి

* క్షీరసాగరమథనంలో కామధేనువు గోమాత రూపంలో అవతరించినరోజు ఆశ్వియుజ బ.ద్వాదశి, ఈ రోజే గోవత్సద్వాదశి. * గోమాత నంద, బహుళ, సురభి, సుశీల, సుభద్ర అనే పేర్లతో 5 రూపాలలో అవతరించింది. * సృష్టి ఆరంభం నుండి విశ్వమంతటినీ పరిరక్షిస్తున్న  విశ్వానికే మాత, మనందరికీ అమ్మ, ఆ గోమాత పుట్టినరోజును మనమందరం ఘనంగా నిర్వహించుకుందాం. * ఉదయాన్నే గోమాతను దర్శించుకుని, ఆమెకు స్నానం చేయించి చక్కగా అలంకరించాలి. అష్టోత్తరంతో అర్చన చేయాలి. అవకాశం ఉన్నవారు నందినీ వ్రతమాచరించాలి. * తప్పనిసరిగా గోగ్రాసాన్ని సమర్పించాలి. * కనీసం ఒకపూట ఉపవాసం ఉండాలి. * గోశాలలో ప్రత్యేకంగా సామూహిక గోపూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి గోభక్తులందరినీ ఆహ్వానించాలి. * గోవత్సద్వాదశినాడు గోమాతదర్శనం సకల శుభప్రదం.

దీపలక్ష్మీ పూజ

Image
భక్తితో , ఏకాగ్రతతో ప్రతిదినమూ శక్టి కొలదీ శ్రీ మహాలక్ష్మిని పూజించినవారికి ... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణము గా లభిస్తుంది . నియమ నిస్టలతో 9 శుక్రవారారాలు అర్చిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరతాయి . ఆశ్వయుజమాసము లో వచ్చే దీపావళి పండుగరోజున ఆభరణాలకీ , ధనానికీ పూజ చేయడం . . . లక్ష్మీపూజలో ఓ భాగము . ఇంటిని గోమయం తో శుబ్రము చేసి (పూరము ఇల్లు శుబ్రము చేయడానికి ఆవు పేడ, ఆవు మూత్రము తప్ప ఏమీ దొరికేవికావు .. ప్రస్తుతం ఫ్లోర్ క్లీనర్స్ ఎన్నో దొరుకుతున్నాయి ) కల్లాపిజల్లి , ముగ్గులు పెట్టి దీపాలును వెలిగించడమే లక్ష్మీపూజలో ముఖ్యమైనది . వెలుగునిచ్చే దీపం ఒక్కటి ఉన్నా ఆ వెలుగు రేఖల్లో ప్రయాణం చేయడం సులభమవుతుంది. దీపాన్ని లక్ష్మితో పోల్చడం కూడా మన సంప్రదాయంలో ఉంది. దీపలక్ష్మి పూజ దీపావళి సందర్భంగా సర్వత్రా జరుపుకోవడం ఏనాటి నుంచో ఓ ఆచారంగా ఉంది. ఈ ఆచారం వెనుక కొన్ని విశ్వాసాలు, మరికొన్ని సమాజ చైతన్య విషయాలు కూడా ఉన్నాయి. దీప పూజలో ఆశ్వయుజ బహుళ త్రయోదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూజ దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకంతో చేస్తుంటారు. దీపావళి పండుగ అనగానే సాధారణంగా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య అనే రె...

చంద్రోదయ ఉమావ్రతము

Image
విజయదశమి పండుగ తరువాత వచ్చే పండుగ అట్లతదియ . ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఈ పండుగ రోజున చంద్రోదయ ఉమావ్రతాన్ని ఆచరిస్తారు . ఈ పండుగ రోజు ముందురోజు న స్త్రీలు టం పాదాలకు , చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు . తదియ నాడు అట్లు వేసి అమ్మవారికి నివేదన చేస్తారు . పూజా మందిరం లో ఓ పీటను వేసి .. ఆ పీటకు పసువు రాసి కుంకుమ అద్ది ... ఆ పీటపై బియ్యం పోసి చదును చేయాలి . పసుపు తో గౌరమ్మను చేసి కుంకుమ to అలంకరించి తమలపాకు పై ఉంచి అలంకరించిన పీట పై గౌరమ్మను ఉంచాలి .చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచరాల తో ఉమాదేవిని పూజించాలి . గౌరీదేవే ఉమాదేవి ... అందుకే పసుపు ముద్దతో గౌరీ దేవిని చేస్తారు . చంద్రోదయం ను చూసి ఉమాదేవిని పూజిస్తారు కనుకనే "చంద్రోదయ ఉమావ్రతం" అంటారు . అమ్మవారికి పది అట్లను నైవేద్యం గా పెట్టి ఒక ముత్తిడువకు పది అట్లు వాయినం ఇచ్చి పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు .

కోజగారీ వ్రతము

Image
  కోజగారి పూర్ణిమ శరదృతువు లో ఆశ్వీయుజ మాసము పౌర్ణమి నాడు పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్షీ దేవి ఆకాశమార్గములో తిరిగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యములు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. హిందువులు ముఖ్యముగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు. వ్రతము చేయువిధానము ఉదయాన్నే లేచి శుచి శుభ్రముగా స్నానము చేసి ఇంట్లో తూర్పుదిక్కున లక్ష్మీదేవి పూజా మంటపము ఏర్పాటు చేయాలి.లక్ష్మి ప్రతిమను కాని ,ఫొటోనికాని ఉంచి విఘ్నేశ్వర పూజచేసి లక్ష్మీదేవిని ఆస్వాదించాలి.ధూప,దీప నైవేద్యాలు పెట్టి భక్తిశ్రద్దలతో లక్ష్మి అష్ట్రోత్రాలు,శ్లోకాలు చదివి పూజచేయాలి.రోజంతా ఉపవాసముండాలి.రాత్రంతా జాగారం చేసి ... తకిస్తమైన "అక్షక్రీడను (గవ్వలు /పాచికలు) ఆటను ఆడుతూ .. అర్ద రాత్రి లక్ష్మీ దేవిని పూజించాలి . వ్రతకద విదానము : వాలఖిల్య ఋషి ఈ వ్రాత ఉదంతాన్ని ఇతరులందరికీ తెలిపాడు. ఉద్దాలకుడు పేద బ్రాహ్మణుడు . ఇతడికి " వలితుడు" అనే నమాతన్రం . బ్రహ్మచర్యాశ్రమం ముగిసింది . చండిక అనే కన్యను వివాహమాడి...

అట్లతదియ,ఉయ్యాలపండగ,గోరింటాకుపండగ

అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది. ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకొంటారు. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని ఈ పూజ చేస్తే, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. సాధారణంగా- పెళ్ళి అయిన తరవాత పది సంవత్సరాలపాటు తప్పనిసరిగా చేస్తారు. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరుసారి పూజచేసి పేరంటాలను పిలిచి వాయనాలిచ్చి కన్నులపం...

ఆశ్వయుజ మాస వైభవం

అశ్వినీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ నెలలో వైశిష్ట్యం. ఆశ్వయుజం శరత్కాలంలో వస్తుంది. ఇది వర్షాలు తగ్గి ప్రకృతి కాంత కొత్త శోభను సంతరించుకునే కాలం. పుచ్చపువ్వులా వెన్నెల కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. 'ఆకాశ లక్ష్మి చుక్కలనే ముత్యాల దండల్ని ఆకాశగంగలో కడగడానికి సిద్ధం చేసిన కుంకుడు కాయ నురుగు తెప్పల్లా తెల్లగా ఉన్నాయి శరత్కాల మేఘాలు' అంటాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదలో. ఈ నెలలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు దక్షిణాభిముఖుడవుతాడు. సూర్యుడు శక్తి కారకుడైతే, చంద్రుడు మనఃకారకుడు. శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. ఆశ్వయుజ పాడ్యమినుంచి తొమ్మిది రోజులపాటు దేవిని పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలను తొమ్మిదిరోజులపాటు వేడుకగా నిర్వహిస్తారు. దేశంలో ఉత్తరాదిన రామలీలా ఉత్సవాలు చేస్తారు. మహాలయా పితృపక్షం ముగియగానే దేవతారాధన జరపడం అనేది, ఆ పితృదేవతలను తమకు ప్రసాదించిన ఆదిపరాశక్తిని కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో త్రిమాతారూపంగా పూజించడం. అది ఒక యోగం. సమస్త జగత్తును పా...