(Telugu) వరాహమిహిర
[:te]1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు,ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర. ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవతున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి కాస్తంత తెలుసుకుందాం. వరహమిహిర ఎవరు? 499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపున్యుడు మరియు జ్యోతిష్కుడు. వరాహమిహిర సూర్య సిద్ధాంత’ పేరు మీదట 1515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు. సూర్య సిద్ధాంతం: సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు మరియు రాక్షసులు, దేవుడు బ్రహ్మ ...