(Telugu) ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
👉1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో .
👉2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో .
👉3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో .
👉 4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో . మాంసాహారం -విషాహారం అని తెలుసుకో .
👉 5. కక్ష కన్నా క్షమ గొప్పది . క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో .
👉 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో .
👉 7. నవ్వును దగ్గరకు తీసుకో ఇతరులతో నీ భావాలు పంచుకో.
👉 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో.
👉9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో.
👉 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో .
👉11. శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో.
👉12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో.
13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో .
👉 14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో.
👉 15. TV కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో.
👉17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో.
👉18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
👉 19. వారానికి ఒక్కసారి ఉపవాసం, ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో.
👉 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో.
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో.
👉22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో.
👉23. ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో.
👉24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో.
👉25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
👉 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .
Comments
Post a Comment