Posts

Showing posts with the label భగవద్గీత

పద్మశ్రీ ఘంటశాల భగవద్గీత

1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను. యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి. 2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా... (1:32) ౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. (2:11) 4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు. (2:13) 5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నద...

భగవద్గీతను ఎందుకు చదవాలి? చదివితే ఏమి అవ్వుతుంది ?

ఒక అందమైన కధ ఒక పెద్దాయన రైతు..కొండలపైన ఉన్న తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటారు…మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు… పొద్దున పూట తాత లానే తానూ భగవద్గీత చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…ఒకరోజు తాతని అడిగాడు…తాతా.. నువ్వు చదివినట్టు నేనూ భగవద్గీత చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే..మర్చిపోతున్నాను..అసలు భగవద్గీత ఎందుకు చదవాలి మనం..ఏంటి ప్రయోజనం…అని తాతని అడిగాడు మనవడు…పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి…కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..అని చెప్పారు…సరే తాత..అని మనవడు బుట్ట తీసుకెళ్ళి…నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…అది చూసి తాతగారు…ఓరి మనవడా..ఇంకొంచెం వేగం పెంచు..ఇంటికి రావటం లో అని సలహా చెప్పారు…సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు ని...

భగవద్గీత అంటే ఏమిటి?

Image
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? – రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా? – ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? – అది కేవలం హిందువులదా? – పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి ☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ. ☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆల...

అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన భారతీయులు

అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన "వేదాలని పోగొట్టుకున్న వెర్రి సన్నాసులు భారతీయులు" అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది. జీవన ధర్మాన్ని బోదించిన గొప్ప శక్తి ఐన భగవద్గీత ని చనిపోయినపుడు మాత్రమే వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు అని హేళన చేస్తోంది. ఆయుర్వేదంలో ఉన్న గొప్ప ఆరోగ్యాన్ని వొదులుకుని ఇంగ్లీష్ మందుల వెంట పడుతున్న అజ్ఞానులు భారతీయులు అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది. నిత్య యవ్వనం గా ఉంచే యోగ శాస్త్రాన్ని కాపాడుకో లేకపోయిన రోగులు భారతీయులు అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది. "నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన ధ్యానం వొదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు రా తెలివి లేని భారతీయు లారా" అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది. అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవుని కాపాడు కోలేక పోయిన మీకెందుకు రా ఆవేశం" అని హేళన చేస్తోంది. ప్రపంచానికే శాంతిని బోదించిన మీ దేశంలో పుట్టిన బౌద్దాన్ని తరిమి కొట్టిన పిచ్చి ఎదవలు భారతీయులు అని ఈ ప్రపంచం మన పైన ఉమ్మేస్తోంది. అమెరికన్స్ ఐన మేము మీ వేప చెట్టుని పసుపు న...

(Telugu) అనుభూతులు శాశ్వతం కావు!

[:te]భగవద్గీత తొలి అధ్యాయం అంతా అర్జున విషాదంతోనే సరిపోతుంది. కురుక్షేత్రమనే సంగ్రామంలో ఎటు పోవాలో, ఏం చేయాలో పాలుపోని అర్జునుడు, శ్రీకృష్ణుని శరణుకోరే సన్నివేశం ఉంటుంది. ఒక రకంగా అర్జున విషాద యోగం భగవద్గీతకి భూమికను అందిస్తుంది. ఆ తరువాత వచ్చే రెండో అధ్యాయమే సాంఖ్య యోగం! భారతీయ దర్శనాలలో సాంఖ్య దర్శనము ఒకటి. పురుషుడు, ప్రకృతి వంటి విషయాలను సూక్ష్మంగా చర్చించే దర్శనము సాంఖ్యము. అతి క్లిష్టమైన, మేధోపరమైన జ్ఞానంగా సాంఖ్యాన్ని భావిస్తారు. అలాంటి సాంఖ్యంలోని సారాన్ని అర్జునుడికి అందిస్తున్నాడు శ్రీకృష్ణుడు. కేవలం సాంఖ్యం మాత్రమే కాదు! భారతీయ తత్వచింతనలో చాలా అంశాలను భగవద్గీత ఒక చోటకి క్రోడీకరిస్తుంది. ఉపనిషత్తుల దగ్గర్నుంచి భక్తియోగం వరకూ జ్ఞానాన్ని ఒకచోటకి చేరుస్తుంది. అందుకనే భగవద్గీతకు అంత ఆదరణ. శ్రీ కృష్ణుడు సాంఖ్య యోగాన్ని వివరించడంలోని ముఖ్య ఉద్దేశం.. దుఃఖానికి కారణాన్ని చెప్పడం, స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరించడం. ఈ రెండు విషయాలూ సాంఖ్యయోగములోని 14వ శ్లోకంలో కనిపిస్తాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ! ఆగమాపాయినో నిత్యాః తాంస్తితిక్షస్వ భారత ! ఇంద్రియాలు తమ చుట్టూ ఉన్...

గీతా ప్రాశస్త్యం:

గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా గీత శ్రీపద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి వెల్వడిందని వ్యాసుడు భగవద్గీతను వర్ణిస్తూ తెలిపాడు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో భోధించాడని అందరికి తెలుసు. కానీ భగవద్గీత ఆవిర్భావం సంగ్రామం పదకొండవనాడు అనగా మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు జరిగింది. ఇది భగవంతుడు కేవలం అర్జునునికి మనోవేదన తీర్చడానికి చెప్పినది కాదు. మనిషిలోని అంతర్మధనాన్ని దూరం చేసి అతనిని కర్తవ్య ముఖుడుని చేయడానికి చెప్పిన ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. గీతోపనిషత్తుగా ప్రసిధ్దికెక్కిన భగవద్గీతకు 18 పేర్లున్నాయి. అవి వరుసగా: 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద 13. బవఘ్ని 14. భ్రాన్తినాశని 15. వేదత్రయి 16. పర 17. అనంత మరియు 18. తత్యార్ధజ్ఙానమంజరి. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాగా మహాభారతం భీష్మపర్వంలోని 43వ అధ్యాయం నాలుగవ శ్లోక...

భగవద్గీత ఆవిర్భావం

Image
యోగములు 1.  అర్జునవిషాద 2.  సాంఖ్య 3.  కర్మ 4.  జ్ఞాన 5.  కర్మసన్యాస 6.  ఆత్మసంయమ 7.  జ్ఞానవిజ్ఞాన 8.  అక్షరపరబ్రహ్మ 9.  రాజవిద్యారాజగుహ్య 10. విభూతి 11. విశ్వరూపసందర్శన 12. భక్తి యోగము 13. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ 14. గుణత్రయవిభాగ 15. పురుషోత్తమప్రాప్తి 16. దైవాసురసంపద్విభాగ 17. శ్రద్దాత్రయవిభాగ 18. మోక్షసన్యాస గీతా మహాత్యము గీత సంస్కృత పాఠము గీత తెలుగు అనువాదము హిందూధర్మశాస్త్రాలు భగవద్గీత  మహాభారతము  యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన  కౌరవ   పాండవులు  రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా  అర్జునునికి  అతని ...

ఘంటసాల వారి భగవద్గీత

001 పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేనస్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వ్యైతమృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ! త్వామనుసందధామి భగవద్గీతే భవ ద్వేషిణీం భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాన్శము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాన్శము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి, 002 న కాఙ్క్షే విజయఁ కృష్ణ న చ రాజ్యఁ సుఖాని చ కిఁ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా (01:32) స్వజనమును చంపుటకు ఇష్టపడక “నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు” అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, 003 అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ భాషసే గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః (02:11) దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శర...

ఘంటసాల వారి భగవద్గీత - సేకరణ

001 పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేనస్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వ్యైతమృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ! త్వామనుసందధామి భగవద్గీతే భవ ద్వేషిణీం భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాన్శము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాన్శము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి, 002 న కాఙ్క్షే విజయఁ కృష్ణ న చ రాజ్యఁ సుఖాని చ కిఁ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా (01:32) స్వజనమును చంపుటకు ఇష్టపడక “నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు” అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, 003 అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ భాషసే గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః (02:11) దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శర...