పితృదేవతా స్తుతి
శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి. నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్! దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః!! నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః! శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!! నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్! శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!! నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి! తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!! నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా! శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!! నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః! వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో ...