(Telugu) సృష్టి మంచిదా, చెడ్డదా?
[:te]రమణ మహర్షి! గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా నిలిచి సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని అందించినా... రమణ పథం చాలా భిన్నమైనది. 1896 మొదలు, ఐదు దశాబ్దాలకు పైగా రమణులు తిరువణ్ణామలై నగరాన్ని తన కార్యక్షేత్రంగా మలచుకున్నారు. ఆ రమణుని చెంత సేదతీరి తమ ఐహిక దుఃఖాలను, ఆధ్మాత్మిక తృష్ణను తీర్చుకునేందుకు వందలాది జనం నిత్యం అరుణాచలానికి బారులు తీరేవారు. భక్తులు అడిగే ప్రతి ప్రశ్నకూ రమణులు తనదైన శైలిలో జవాబుని అందించేవారు. వాటిలో చాలావరకూ జవాబులు, నిన్ను నువ్వు ముందుగా తెలుసుకో అన్న సూచనతో ముగిసేవి. మరికొన్ని సందర్భాలలో రమణులు తనంతట తానుగా ఏదో ఒక విషయం గురించి అభిప్రాయాన్ని వెల్లడించేవారు. ఉదాహరణకు ‘ఈ ప్రపంచము సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా?’ అని ఓ పుస్తకంలో ఉన్నా ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారో చూడండి... ‘సృష్టి మంచి...