Posts

Showing posts with the label పద్యాలు - ధూర్జటి

(Telugu) శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి

[:te]   *  "అమ్మా, యయ్య" యటంచునెవ్వరిని నేనన్నన్శివా ! నిన్ను నే సుమ్మీ నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియు దండ్రియున్ గురుఁడు నీవేకాన సంసారపుం జిమ్మంజీకటిఁ గప్పినన్ గడుపు నన్ శ్రీకాళహస్తీశ్వరా ! * అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్బూని యానంద తా రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా రికిగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా !! * అడుగంబోనిక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై యడుగంబోయినబోదు నీదుపదపద్మారాధక శ్రేణియు న్నెడకున్ నిన్ను భజింపగా గనియు నాకేలా పరాపేక్ష ? కో రెడిదింకేమి ? భవత్ప్రసాదమమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా !! * అమరస్త్రీలరమించినన్ జెడదు మోహంబింతయున్, బ్రహ్మ ప ట్టము సిద్ధించిన నాసదీరదు, నిరూఢక్రోధమున్ సర్వలో కముల న్మ్రింగినమాన, దిందుగల సౌఖ్యంబొల్ల, నీసేవ చే సి మహాపాతక వారిరాశిఁ గడతున్ శ్రీకాళహస్తీశ్వరా !! * అయవారై చరియింపవచ్చు తన పాదాంభోజ తీర్ధంబులన్ దయతో గొమ్మనవచ్చు సేవకుని నర్థప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చు గాని, నరుల న్నిందింప, నిన్నాత్మ ని ప్క్రియతన్ గానగరాదు పండితులకున్ శ్రీకాళహస్తీ...