Posts

Showing posts with the label పద్యాలు - మారవి వెంకయ్య

(Telugu) భాస్కర శతకము - మారవి వెంకయ్య

[:te] *  అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టములొక్కరొక్కరిన్ మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్ దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా! * అడిగినయట్టి యాచకుల యాశలెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా! * అతిగుణహీన లోభికిఁ బదార్ధము గల్గిన లేకయుండినన్ మితముగఁ గాని కల్మిగల మీఁదట నైన భుజింపడింపుగా సతమని నమ్ము దేహమును సంపద; నేరులు నిండి పారినన్ గతుకఁగ జూచుఁ గుక్క తన కట్టడ మీరక యెందు భాస్కరా! * అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా! * అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే యనువుననైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా! * అలఘు గుణప్రసిద్ధుఁడగు నట్టి ఘనుండొకఁ డిష్టుఁడ...