ఓర్పు

అనగనగా ఒక ఊరి సమీపంలో రెండు పెద్ద రాళ్ళు ఉండేవి. రాజు దగ్గర పనిచేసే ఒక శిల్పి,అలా వెళుతుండగా ఆ రాళ్ళను చూసాడు. వాటితో మంచి శిల్పాలు చెయ్యచ్చు అని ఒక రాయిని కొట్టాడు. ఆ రాయి నొప్పిభరించలెక ఓ మహాశిల్పి నువ్వు నన్ను శిల్పంగా మార్చవచ్చు కానీ నేను నొప్ప్పిభరించలెక పోతున్నాను నన్ను ఒదిలెయ్ అని చెప్పింది. అప్పుడు శిల్పి తన పక్క రాయిని చెక్కాడు. అది ఒక అద్భుత శిల్పంగా మారింది. దాన్ని మహారాజు చూసి ఆలయం లో పెట్టించాడు. ఆలయానికి గట్టు పెద్దది కావడం తో భక్తులకు ఇబ్భందిగ ఉన్నందుకు మహారాజు మొదటి రాయిని మెట్టుగా వేయించాడు. దానితో ఆ భక్తులు రోజు ఆ రాయిని తొక్కి వెళ్ళేవారు . కానీ శిల్పంగా మారిన రాయి గుళ్ళో హాయిగా పూజలు అందుకుంటుంది .
నీతి ; ఓర్పు వహిస్తే తరువాత సుఖంగా ఉండవచ్చు. ఓక వేళ సుఖం కోరుకుంటే తరువాత కష్టం అనుభవించాలి .
మొదటి రాయి ఓర్పు వహించాలేఖ పోయింది అందుకే చాల కష్టం అనుభవిస్తుంది. రెండవ రాయి ఓర్పు వహించింది అందుకే హాయిగా పూజలు అందు కుంటుంది.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము