Posts

Showing posts with the label తెలుగు నెలలు – శ్రావణ మాసం

శ్రావణ మాసం అన్ని దేవతలకు ప్రీతికరము అని అంటారు కదా !

శ్రావణ మాసం చాలా విశేషమైన మాసము. ఈ మాసం విష్ణుమూర్తులవారికి చాలా ప్రీతికరము. అట్లాగే వరలక్ష్మీ, గౌరీ, సంతోషీమాత, హయగ్రీవ, సదాశివ, సుబ్రహ్మణ్య, కృష్ణ, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా ప్రీతికరమగు మాసము. అందుకని శ్రావణ మాసాన్ని సకలదేవతా మాసము అని కూడా అనవచ్చును. శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం శ్రవణా నక్షత్రం విష్ణుమూర్తుల వారి జన్మ నక్షత్రం. కనుక, శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ రుద్రాభిషేకం ఉత్తరాదిన ఈ మాసంలో శివ ఆరాధనలు కూడా ఎక్కువగా జరుగుతూ వుంటాయి. సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసంలో కాశీ క్షేత్రం భక్తులతో చాలా కోలాహలంగా వుంటుంది. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం విశేషము. శ్రీ మంగళ గౌరీ వ్రతం కొత్తగా పెళ్లి అయిన మహిళలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళ వారం మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సుమంగళీ దేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వరలక్ష్మీ వ్రతం పెళ్ళైన స్త్రీలు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సకల సౌభాగ్యాలు చేకురుతాయి. శ్రీ నాగ...

శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి - నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి - ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. నూతన యజ్ఞోపవీత ధారణ విధానము ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిర...

హయగ్రీవ ఆవిర్భవం

శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం. మెడ నుండి పైదాక గుర్రపు ముఖంతోనూ, మెడ కింద భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండటం ఈ అవతారం విశేషం. ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి. పురాణాల ప్రకారం హయగ్రీవ స్వామి అవతరణ గాధ ఈ విధంగా ప్రచారంలో ఉంది.... హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు, సృష్టికి ముందున్నవాడు. మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపధ్యంలోనే జరిగాయి. పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అమ్మ అలా కుదరదు అంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడ ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం. ఇక అప్పటినుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా వి...

కృష్ణాష్టమి నాడు చదవవలసివ స్తోత్రం

అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం! వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!! వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం! దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!! గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం! అదోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!! అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం! నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!! పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం! శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!! యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్! గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!

శ్రావణ పూర్ణిమ

ఋతువులను అనుసరించి ప్రతి పనినీ ప్రారంభించే మన పూర్వులు, విద్యను ప్రారంభించేందుకూ, ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు. అదే 'శ్రావణపూర్ణిమ.' ఈ రోజున ద్విజులు అధ్యాయోపకర్మలు చేస్తుండేవారు. అదే నేటికి 'ఉపాకర్మ'గా మారింది. అధ్యాయోపకర్మ అంటే వేదాధ్యయనప్రారంభం. ఇది ద్విజులందరికీ వున్నప్పటికీ, నేటి కాలంలో బ్రాహ్మణులే ఎక్కువగా పాటిస్తున్నారు. ఈ రోజున పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనిషత్తుల ఆద్యంతవాక్యాలను పఠించి, ఇంట్లో హోమాలు చేస్తారు. మరునాడు ఉపాకర్మకు అనుబంధంగా 1008 మార్లు గాయత్రీమంత్రజపం చేస్తారు. సామవేదులు విఘ్నేశ్వరచతుర్థి నాడు, ఆయనను విద్యాధిదేవతగా భావించటం వల్ల, ఉపాకర్మ జరుపుకొంటారు. ఇవి నేటికి లాంఛనప్రాయంగా మిగిలిపోయాయి. పూర్వం వేదకర్మాలను ఆచరించేటప్పుడు తప్ప, మిగతా సమయాల్లో యజ్ఞోపవీతాలను నిరంతరమూ ధరించేవారు కాదు. కనుక వేదాధ్యయనప్రారంభానికి దీక్ష పూనేటప్పుడు, కొత్త యజ్ఞోపవీతాలు ధరించటం ఆచారమైంది. ఆ తరువాత ఇదే కంకణసూత్రధారణంగా మారి, మిగతా కులాలవారిలో రక్షాబంధనకర్మగా ఏర్పడివుంటుంది. రక్షాబంధనాన్ని కూడా ఇదే రోజున చేసుకోవటం వల్ల, ఈ శ్రావణపూర్ణిమకు 'రక్షా...

రాఖీ పండుగ

Image
  'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు. శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్...

మంగళ గౌరీవ్రతము

Image
శ్రావణమాసం అనగానే వివాహితలకు చెప్పలేని హడావుడి. అందులో కొత్తగా పెళ్లైన ఆడవారికి మరీను! ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమే గానీ, మంగళ, శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు. జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే. అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి. ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్...

వరలక్ష్మి వ్రతము

Image
భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ప్రార్థన నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే తాత్పర్యం : మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ...

చుక్కల అమావాస్య నోము

Image
  చుక్కల అమావాస్య : శ్రావణ మాసం అమావాస్య రోజు నుండి మొదలు అగును. ఆ అమావస్యనే చుక్కల అమావాస్య అని కూదా అందురు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు. ఈ వ్రతం ఐదు ఏళ్ళు చేసుకుంటారు. దీనికి దీపస్తంభ వ్రతము అని కూడా పేరు ఉంది.

శ్రీ కృష్ణ జయంతి

ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు . సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు "పైకొని చూడరె వుట్ల పండుగ నేడు ఆకడ గొల్లెతకు ననందము నేడు అడర శ్రావణబహుళాష్టమి నేడితడు నడురేయి జనియించినాడు చూడ గదరే. మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడ...

హరిశ్చంద్రుడు ఆచరించిన అజైకాదశి

హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలసిందే! క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి ఏకాదశి గురించీ స్వయంగా ఆ శ్రీకృష్ణుడే, ధర్మరాజుకి బోధించాడు. ఏకాదశుల మహిమ గురించి కృష్ణుడు, యుధిష్ఠిరునితో జరిపిన సంవాదం అంతా బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని బహుళపక్షంలో వచ్చే ‘అజైకాదశి’ విశేషం ఇదిగో... సత్యానికి కట్టుబడిన హరిశ్చంద్రుని కథ అందరికీ తెలిసిందే కదా! హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించేందుకు విశ్వామిత్రుడు అతడిని రాజ్యం యావత్తునీ దానం రూపంలో స్వీకరించేస్తాడు. అతని భార్య చంద్రమతినీ, కుమారుడు లోహితాస్యుడినీ హరిశ్చంద్రుని నుంచి దూరం చేస్తాడు. చివరికి ఓ చండాలుని దగ్గర అతను ఊడిగం చేసే స్థితికి తీసుకువస్తాడు. తన సర్వస్వాన్నీ కోల్పోయినా కూడా హరిశ్చంద్రుడు సత్యనిష్టకు మాత్రం కట్టుబడే ఉంటాడు. ఒకనాడు తన భార్యాపిల్లలను కోల్పోయిన బాధలో హరిశ్చంద్రుడు బాధపడుతుండగా, అతనికి గౌతమ మహర్షి కనిపించాడు. ఆ రుషి వద్ద తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు హరిశ్చంద్రుడు. దానికి గౌతమ మహర్షి ‘రాజా! మరేమీ చింతించాల్సిన పనిలేదు. నీ అదృష్టవశాత్తూ మరో ఏడు రోజులలో అజైకాదశి వ...

కృష్ణాష్టమి ఈ ఆలయాలలో ప్రత్యేకం

కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తుంది. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారు. అయితే కొన్ని ఆలయాలలో జన్మాష్టమి, మరింత సంబరంగా సాగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా తపించిపోతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఇవిగో... ఉడిపి ఉడిపి (కర్ణాటక)లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. అందుకని ఎక్కడెక్కడి వైష్ణవులో ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇక జన్మాష్టమి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు. ద్వారక ద్వారక అంటే మోక్షాన్ని కల్పించే ద్వారం అన్న అర్థమట. సాక్షాత్తు ఆ కృష్ణుడు పాలించిన ఈ రాజ్యంలో ‘ద్వారకాధీశుని’ పేరుతో కృష్ణుని ఆలయం ఉంది. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలోని స్వామివారికి షోడశోపచారాలు చాలా వేడుకగా జరుగుతాయి. అర్థరాత్రి 11 గంటల...

దేశంలో ఒకోచోట ఒకోలా... కృష్ణాష్టమి!

శ్రీకృష్ణుడు దేవకి కడుపున పుట్టి ఉండవచ్చు, యశోద ఇంట పెరిగి ఉండవచ్చు, ద్వారకని పాలిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని ఉండవచ్చు. కానీ ఆయన ఏదో ఒక ఇంటికో, ప్రాంతానికో పరిమితం అయినవాడు కాదు. కోట్లమంది హిందువుల గుండెల నిండా కొలువైనవాడు. అందుకే భారతదేశం యావత్తు ఆయనని తమని తోచినరీతిలో ఆయన పుట్టినరోజుని జరుపుకొంటుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన సందర్భాలు ఇవిగో... మహారాష్ట్ర కృష్ణాష్టమి వేడుకల గురించి ప్రస్తావన రాగానే మహారాష్ట్రే గుర్తుకువస్తుంది. అక్కడ జరిగే దహీహండీ (ఉట్టి) కార్యక్రమం అంత ప్రసిద్ధి మరి! అయితే ఇవి సాదాసీదాగా సాగవు. కృష్ణాష్టమికి కొన్ని వారాల ముందు నుంచే ప్రతి పేటలోని కుర్రాళ్లు, ఉట్టి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు. కృష్ణాష్టమి సమయానికి వీరంతా ఒక మండలిగా ఏర్పడి.. ఉట్టి కొట్టే పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్టుకి బహుమతులు కూడా భారీగానే అందుతాయి. మణిపూర్ మణిపూర్‌ వాసులకు కృష్ణారాధన ఎక్కువే! దాంతో కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంఫాల్‌ వంటి చోట్ల ఉన్న కృష్ణుని ఆలయాలు కిటకిటలాడిపోతాయి. ఆ రాష్ట్రానికే ప్రత్యేకమైన మణిపురి నృత్యంలో శ్రీకృష్ణుని రాసలీలలను ప్రదర్శిస్తారు...

కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి?

హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా! శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసకోవాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను ప...

నాగపంచమి రోజు ఏం చేయాలి?

హిందూ సంప్రదాయంలో నాగపూజకి చాలా ప్రాముఖ్యత కనిపిస్తుంది. సంతానం కలగాలన్నా, కుజదోషాలు తొలగిపోవాలన్నా, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలన్నా... ఆ నాగదేవత అనుగ్రహం ఉండాలని చెబుతారు. పైగా సర్పాలు పంటలు నాశనం కాకుండా కాపాడతాయని రైతుల నమ్మకం. సర్పాన్ని జాగృతం అయిన కుండలినికి సూచనగా భావించేవారూ లేకపోలేదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి వాటిని పూజించేందుకు ఒక పండుగ ఉండటంలో ఆశ్చర్యం ఏముంది! శ్రావణమాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుచుకుంటాము. ఈ నాగపంచమి పండుగ వెనుక బోలెడు కారణాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు కాళియమర్దనం చేసింది ఈ రోజే అని చెబుతారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా... ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు, విష్ణుమూర్తిని కోరుకున్నట్లూ చెబుతారు. ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి. నాగపంచమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలారస్నానం చేయాలి. ఇంటి ముందు ముగ్గువేసి, గడపకి పసుపుకుంకుమలు అద్దాలి. వీలైతే ఇంటి గుమ్మానికి ఇరువైపులా నాగదేవతని ఆహ్వానిస్తూ ఐద...

వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని ఎలా పూజించాలి!

వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాణ్ని ధరించే సంప్రదాయం గురించి తెలిసిందే! ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు? దీన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామా? అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారూ ఉన్నారు. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు... నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట! ఈ నవసూత్రాన్ని తయారుచేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథిపూజ...

పుత్రద ఏకాదశికి ఏం చేయాలి!

హిందూ కాలమానంలో ఒకో ఏకాదశికీ ఒకో పేరు ఉంది.  ఆ పేరు వెనుక ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా! పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్యపురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం- పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాతైనా ఆయన కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి ఉన్నడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమశుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే... రాజుగారికి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే... రాజుగారిక...

వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి?

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము. ఒకవేళ ఈ రోజు ఏదన్నా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కులాలకు అతీతంగా, ఎలాంటి ఆడంబరమూ అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని మన నమ్మకం. ఇంతకీ ఈ వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దామా! వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపుకుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు. కాబట్టి ఇంటి ఈశాన్యభాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి.... దాని మీద కలశాన్ని ప్రతిష్టించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది, దాని మీద కొబ్బరికాయను నిలపాలి. ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మర...

హయగ్రీవ జయంతి విశిష్టత

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీని ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా! హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు ...

ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ!

కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు... రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని మగవారు అందిస్తారు. పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతోంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచీ కృష్ణుని వరకూ ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో... - భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో, ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా త‌న చీర‌కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి ర‌క్ష‌గా చుట్టింది. `న‌న్ను అన్న‌గా భావించి ఆదుకున్నావు కాబ‌ట్టి, నీకు ఎలాంటి ప్ర‌మాదం వ‌చ్చినా నన్ను త‌లుచుకో!’ అని అభ‌య‌మిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘ‌ట‌నే ర‌క్షాబంధ‌నానికి నాందిగా నిలిచిందని చెబుతారు. త‌రువాతి కాలంలో ద్రౌప‌ది చీరను లాగి కౌర‌వులు నిండుస...