కాత్యాయిని తల్లి
ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ! తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్! పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ! సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం! నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః ఆ తల్లి ఎంతమందికో కోరుకుంటే కూతురిగా వస్తుంది కాని, ఆవిడ మహా పతివ్రత కాబట్టి భర్తగా మాత్రం ఆ పరమశివుడినే వరిస్తుంది. ఒకప్పుడు కాత్యాయన మహర్షి తనకి బిడ్డలు కలగాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఈయనని అనుగ్రహిద్దాం అనుకున్నాడు పరమశివుడు. అందులో అంతర్లీలనంగా ఒక చమత్కారం జరిగింది. ఒకప్పుడు కైలాస పర్వతం మీద కూర్చుని పరమశివుడు ఉంటే, ప్రణయ వినోదంగా భర్తతో ఆటలాడుతూ పార్వతీదేవి వెనకనుండి వచ్చి ఆయన రెండు కన్నులు మూసింది. ఆయన కళ్ళు సూర్యచంద్రులు. ఆయన కళ్ళు మూసేటప్పటికి లోకమంతా చీకటి అయింది. పరమశివుడు లోకాలను ఆదుకోవడం కోసం మూడవ కన్నుని తెరిచి అగ్ని సంబంధమైన కాంతిని వర్షించాడు. ఆమె అన్ని తెలిసిన తల్లే. అయినా ఏమీ తెలియని దానిలా భర్త వంక చూసి నేను ప్రణయానికి మీ కన్నులు మూసినప్పుడు లోకానికి జరిగిన ఇబ్బంది గమనించాను. ఇంత మంది ఇబ్బంది పడడానికి నేను కారణం అయ్యాను. నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల...