గోదా దేవి
ఆండాళ్ తల్లి అపర జానకీ మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞ శాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్తుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయముండదు. గోదాదేవి లేని వైష్ణవాలయముండదు. సీతమ్మ శ్రీరాముని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. అట్లే ఆండాళ్ శ్రీరంగనాథుని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. గోదాదేవి పూర్వజన్మ వృత్తాంతము : చూడి కొడుత్త నాచ్చియార్ జన్మ గురించి ఒక భగవత్‌గాథ ప్రాచుర్యంలో ఉంది. పురుషోత్తమక్షేత్రంగా ప్రసిద్ధిచెందిన పూరీలో వసంతాచార్యులనే భక్తాగ్రేసరుడు జగన్నాథుని ఆలయంలో ప్రథమ అర్చకుడిగా సేవలందించేవాడు. ఎక్కడాలేని విధంగా దైవం పక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకు వెలితిగా ఉండేది. శ్రీకృష్ణావతారంలోని సుభద్ర ఎందుకు వెలసిందో అనే అనుమానం ఆయనను వేధిస్తూండేది. ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు. శ్రీకృష్ణావతారం సందర్భంగా ఆ అవతారపురుషుని అసమాన సౌందర్యం చెల్లెలు సుభద్రనూ సమ్మోహపరచిందనీ, అందుకే స్వయంభూ అయిన పూరీ క్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన పక్కన ఈ క్షేత్ర...