(Telugu) బ్రాహ్మణస్త్రీ-నువ్వుల కథ

[:te]వర్థమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు, పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని, ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది. రెండు కోళ్ళు, రెండు ఎలుకలు పప్పును కాళ్ళతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి "ఈ నువ్వులు అంటు పడినవి, తద్దినానికి ఇవి పనికిరావు, వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల పప్పు తయారుచేయ"మని భార్యను ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వుపప్పు తీసుకొని నాలుగు ఇళ్ళు తిరిగింది.

ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగాఆ నువ్వుపప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా "బాగుచేసిన నువ్వుపప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో "పిచ్చిదానా! ముడి నువ్వులకు బాగుచేసిన నువ్వుపప్పుని ఎవరైనా ఇస్తారా? మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పునిచ్చి ముడినూగులెందుకు తీసుకుంటుంది. ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా?" అని అడిగాడు. " ఆ విషయం మనకెందుకు? ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఆ కారణాలతో మనకు పని లేదు, నువ్వులను దంచి పప్పు చేసుకొనే శ్రమ లేకుండా చెరిగి బాగు చేసి నూగులు మనికకు మానెడు లభించాయి. అంతేచాలు" అన్నది సంతోషంతో.

అదే విధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా! దానిని తవ్వి చూస్తే సరిపోతుంది. ఉండడానికి చోటు లేకస్థావరం కోసం ఎటో పారిపోతాయి, నీ జోలికి రావు అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును తవ్వాడు. చేయునది లేక నేను, నాతోపాటు మరో నాలుగు ఎలుకలు కూడా మరోచోటుకి పారిపోయినవి. అప్పటినుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని, అడవిలో అయితే ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేనీ అడవికి చేరాను. కొన్నాళ్ళకు ప్రియ మిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత నీస్నేహం దొరికింది. ఇదీ నా చరిత్ర" అని చెప్పగా విని మందరుడు "మిత్రమా! నీవెంత కష్టపడి ఎన్నాళ్లనుండియో కన్నంలోదాచుకున్న ధాన్యము వృదాగా పోయినది కదా! "పేరాశ ప్రాణాంతకం" లోభిసోమ్ము లోకులపాలు" అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చేయుట గాని, తాననుభవించుట గాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో, దొంగలపాలో కావడం ఖాయం. లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది. లోభం వల్ల ఒకనక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఆ కథ చెప్తాను విను అని కథ ప్రారంభించింది.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము