Posts

Showing posts with the label వామనపురాణం

హరుని మూడుగా నరికిన హరి

పూర్వం వీతమన్యుడు అనే పేరుగల నిరుపేద బ్రాహ్మణుడుండే వాడు. అతని భార్య ఆత్రేయి. వీరికి ఉపమన్యుడు అనే కుమారుడు ఉన్నాడు. వారు ఎంత దారిద్ర్యం లో ఉన్నారంటే వారి పిల్లాడు పుట్టి బుద్ధెరిగాక పాలు తాగలేదు. కేవలం వరిపిండి కలిపి నీరు తెల్లగాచేసి అవే పాలని అతని తల్లి త్రాగించేది. ఊహతెలిసినప్పటి నుంచీ అవే త్రాగుతున్నాడు ఆ వరిపిండి నీళ్ళే పాలు అనుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు తండ్రితో కూడా ఒకచోట భోజనానికి వెళ్ళి స్వచ్ఛమైన పాలతో చేసిన పరవాన్నం తిన్నాడు. పాల రుచి తెలిసింది. ఇంటికి వచ్చాక తల్లి ఇచ్చిన పిండిపాలు వద్దు అవి అసలు పాలు కావని తనకు అసలు పాలు కావాలని గోలపెట్టాడు. అతడిని బుజ్జగిస్తూ విరూపాక్షుడు అయిన శంకరుడు ప్రసన్నుడు కానివానికి పాలబువ్వ ఎలా వస్తుంది? ఆయన సంతోషిస్తే పాలబువ్వ వస్తుంది అని చెప్పింది. అయితే విరూపాక్షుని ప్రార్థిస్తాను ఆయన ఎవరు అని అడిగాడు. దాంతో ఆమె విరూపాక్షుని ఆవిర్భావ కథ చెప్పింది. పూర్వం శ్రీదాముడనే పేరు గల రాక్షసరాజు ఉండేవాడు. అతడు సర్వలోకాలూ ఆక్రమించి రాజ్యలక్ష్మిని సొంతం చేసుకున్నాడు. విష్ణుమూర్తి కౌస్తుభం  లాగుకోవాలని చూశాడు. వాడి దుర్బుద్ధి తెలుసుకున్న శ్రీహరి కైలాసాని...