Posts

Showing posts with the label సాలభంజిక కధలు

సాలభంజిక కధలు - 2

భోజరాజు మళ్ళీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్టించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది. "ఓ! భోజరాజా! మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్యసాహసాలు నీకు లేవు. కావున ఈ గద్దె నెక్కబోవటం నీకు సాధ్యం కాదు ఎందుకంటే, ఉజ్జయనిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణు మూర్తి రాజ్యం కంటే గొప్పది. కావున విను, మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరుడు, కుత్సిత బుద్ధి కలవాడు, నీరసాత్ముడు, దూషకుడు, దుర్మార్గుడు, అనాచారుడు, అబద్ధాలు చెప్పేవరు, అవినీతి పరులు, బద్ధ కస్తులు, దుర్భలులు, మదాంధులు, మదన వికారం చెందిన వారు, స్తిరత్వం లేని వారు, ఇలాంటివారు మచ్చుకైన ఉండరు. ఐతే అటువంటి రాజ్యంలో ఒకనాడు ఒక విదీశీయుడు ప్రవేశించాడు" అని ఆ సాలభంజిక చెప్పసాగింది. రాజ దర్శనం కాగానే, రాజుకు నమస్కరించి తాను దేశ దేశాలు తిరిగి వచ్చానని చెప్పాడా విదేశీయుడు. అందుకు రాజు "దేశం నలుమూలలా చుట్టి వచ్చావు గనుక, నీవు చూసిన వింతలేమైనా చెప్పు" అని అడిగాడు. అందులకా సిద్ధుడు "నేను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పు కొండల ప్రాంతంలో ఒక భాగ్య వంతమైన నగరం చేరుకున్నాను. అక్కడ సూర్యప్రభ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా లోతైనది....

సాలభంజిక కధలు - 1

"32 సాలభంజికలు 32 కథలు" చెప్పి భోజరాజుని సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకున్నాయని చెప్పుకన్నాం కదా? ఐతే వాటిలో ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం. విక్రమార్కుడు ఒకనాడు నిండు కొలువులో సభ తీరి ఉన్న సమయంలో అక్కడికి ఒక కవీంద్రుడు వచ్చాడు. అతడు మహా పండితుడు, సకల భాషా కోవిదుడు, సంస్కృత ప్రాకృత చతుర్విధ భాషా విశారదుడు. అందువల్ల మన విక్రమార్కుడిని నాలుగు భాషల్లో దీవించి ఆసనం మీద కూర్చుని, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అదెలా అంటే? ఓ రాజేంద్రా! నా పేరులో ఆరు అక్షరాలుంటాయి. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను "అశ్వవేదినౌతాను" రెండక్షరాలు వదిలిపెడితే "నాట్యకర్తనౌతాను" మూడక్షరాలు తీసేస్తే "గతవిదుడనౌతాను" నాలుగక్షరాలు విడిచి పెడితె "నేర్పరినౌతాను" ఐదు అక్షరాలు వదిలిపెడితే "బుధుడనౌతాను" అన్ని అక్షరాలు కలిపి చదివితే "బుద్ధిబలమున్న వాడినౌతాను" ఇది కేవలం నేతిబీరకాయ చందాన చెప్పటం కాదు, నువ్వు అన్ని విద్యలలోను ఆరితేరినవాడివి గనుక నాపేరు తెలుసుకోగలవు అని విక్రమార్కుడిని ప్రశ్నించి అడిగాడు. అందుకు సకల విద్యా పారంగతుడైన విక్రమార్కుడు నవ్వి ...

సాలభంజిక కధలు -12

ఆఖరికి ముప్పై రెండవ బొమ్మ అయినా కరుణించక పోతుందా అన్న ఆశతో, భోజుడు పరమేశ్వర ప్రార్ధన చేసి, మణి పీఠం  ఎక్కేందుకు వచ్చాడు. అప్పుడు ఆ బొమ్మ ఇలా అంది . " రాజా ! విక్రమార్కుడిని మించిన ధర్మపాలన చెయ్యగల వాడు లేడు . రామ శకం, యుధిష్టర  శకం లాగా, విక్రమార్క శకం చరిత్రలో నిలిపాడు ఉజ్జయినీ పతి . ఇంతకాలం పట్టుదలతో వస్తున్నా మీకు అతని కధలు వినిపించాము. నీవు మాకు శాప విమోచనం కలిగించేందుకు విష్ణు అంశతో పుట్టిన కారణ జన్ముడవు . " "  ఓ భోజరాజా ! మేము పూర్వ జన్మలో ఫార్వతీదేవిని సేవించే చెలి కత్తెలము. ఒకనాడు ఉద్యానవనంలో పూజకోసమై పూలు కోస్తున్నాము. అప్పుడు అదే సమయంలో మనోహరమైన అందచందాలతో మన్మధుని మించిన సోయగముతో ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ దివ్య సుందర మూర్తిని చూసిన మేము చేస్టలుడిగి ప్రతిమల్లా ఉండిపోయాము. అతడి అందచందాలకి పరవశించి వలపు కోర్కెలతో మనోవికారమునకు లోనయ్యాము. మనసులు వశం తప్పి మైమరచి చూపులను మరల్చలేక మత్తు మందు జల్లినట్టు చూడసాగాము. ఆ వింత పార్వతి గ్రహించి కారణం తెలుసుకుని మామీద కోపంతో ' మీరు భూలోకంలో ప్రతిమలుగా పడి ఉండండి అని మమ్మల్ని శపించింది '. అప్పుడు మా తప్పు తెలుసుకున...

సాలభంజిక కధలు - 11

ఇలా కొన్నాళ్ళు జరిగాకా, మనసుండ బట్టలేక, మల్లి సింహాసనం ఎక్కే కోరికతో వచ్చాడు భోజుడు. ముప్పై ఒకటవ సోపానం వద్ద ఉన్న బంగారు బొమ్మ అతడిని అడ్డగించింది. " రాజా! అష్టభోగాల్లో ఇంద్రుడిని మించినవాడు, ధైర్యసాహసాల్లో సాటి లేని వాడు విక్రమార్కుడు. నీవు మరలా మరలా సింహాసనం యెక్క కోరడం అందని మ్రాని పళ్లకు ఆశించడమే! నీకొక కదా చెపుతాను విను, ' అంటూ ఇలా చెప్పసాగింది. అవంతీ నాధుడు ఆరునెలలు రాజ్య పాలన, ఆరు నెలలు దేశాటనం చేస్తాడు కదా! ఒకసారి దేశాంతరం వెళ్లి పద్మాలయం అనే పట్టణం చేరుకున్నాడు . అక్కడ తెల్లని గృహ పంక్తుల మధ్య రత్నం లాగా ప్రకాశించే  దేవాలయాన్ని చూసాడు. సాయంత్రం అవగానే, సంధ్య వార్చి, దైవ ప్రార్ధన చేస్తూ గుడిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలా మాట్లాడుకోసాగారు . " మనం భూలోకం అంటా చుట్టి వచ్చాము. కాని, హిమాలయ పర్వత ప్రాంతం లోని సర్పవనం మాత్రం చూడలేక పోయాము. అక్కడ కఠోరమయిన తపస్సు చేసే యోగీంద్రుడయిన త్రికాలనాధుని దర్శనం మాత్రం చేసుకోలేక పోయాము, ఆ దారిలోని ప్రమాదాలకు, భయంకర సర్పాలకూ భయపడ్డాము. ప్రాణాల మీద తీపి యెంత గొప్పదో కదా, దేనికయినా రాసి ...

సాలభంజిక కధలు - 10

ఆ భాద్రాసనం మీద మోజు తీరక మళ్ళి ఒక రౌ మెరుపు తీగల వంటి కాన్తామనులు వెంట రాగా, మండపం చేరుకున్నాడు మహారాజు . అప్పుడు అతడిని అడ్డుపెట్టి ఆ బొమ్మ ఇలా అంది. " ఓ రాజా! ఆశ వదలక నీవు యెంత కాలం ఇలా నీ సమయాన్ని వ్యర్ధం చేసుకుంటావు ? విక్రమార్కుడంతటి ఉదారత, సాహసం లేక ఈ సింహాసనం ఎక్కడం ఎవరి తరం ? ఆ మాహారాజు గొప్పతనం ఏమిటో నువ్వు విని విని తీరాలి." అని ఇంకా ఇలా చెప్పింది . విక్రమార్కుడు ఒక మండు  వేసవిలో దేశాటనం చేస్తున్నాడు. అలా ప్రయాణిస్తూ, విదర్భ రాయంలో కుండిన పురాన్ని చేరుకున్నాడు. అక్కడి ఉప వనంలో చక్కని దుర్గాలయం ఉంది. ప్రక్కనే ఉన్న కొలను లో స్నానం చేసి , కలువ పూలు తెచ్చి, దుర్గను పూఇంచి, తరువాత అక్కడే కాసేపు విశ్రమించాడు. ఇంతలో అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. అతడు విద్యావంతుడు కనుక, మారువేషంలో ఉన్న రాజును పసిగట్టి, ' నీలో రవి తేజం ఉత్తి పడుతోంది. నీ రూపం చక్రవర్తి లక్షణాలను తలపిస్తోంది. నీవెవరు ? ఎందుకిలా ఒంటరిగా తిరుగుతున్నావు?,' అని అడిగాడు. అందుకు విక్రమార్కుడు, 'పండితోత్తమా! నీ ఊహ సరి అయినదే, నేను క్షత్రియుడను. అవంతీపుర వాసిని. విక్రమార్కుడనువాడను. వింతలూ విడ్డూరాలు తెల...

సాలభంజిక కధలు -9

యెంత మరచిపోదామన్నా మరపురాని సింహాసన శోభ మనసుని వేధించగా, మళ్లీ భోజుడు ఇంకొక ప్రయత్నం చెయ్యబొయాడు . అప్పుడు అక్కడ ఉన్న బొమ్మ , రాజా! నీవేలాగూ ఈ సింహాసనం యెక్కలెవు. చూస్తుంటే, అతని కదామృతం వినగోరి నీవు మరలా మరలా ఇక్కడకు వస్తున్నట్లు ఉంది . నీకొక కదా చెబుతాను, విను, ' అంటూ ఇలా చెప్పసాగింది ... విక్రమార్కుడు దేశాటనం చేస్తూ యోగి వేషలో అడవిలో ప్రయాణిస్తుండగా, అతడికి నట్టడవిలో, 'అంబా, ' అన్న అరుపు వినవచ్చింది . క్రూరమృగాలు సంచరించే అడవిలోకి, ఆవు ఎలా వచ్చిందా, అని ఆశ్చర్యపోతూ అతడు ఆ దిక్కుగా వెళ్ళాడు  . అక్కడి రేగడి మడుగులో, నాలుగు కాళ్ళు కూరుకుపోయి పైకిరాలేక అవస్థ పడుతున్న గోమాత కనిపించింది . కరుణార్ద్ర హ్రుదయుడయిన విక్రమార్కుడు ఆవు పరిస్థితి చూసి చలించిపోయాడు. అయినా, దానిని రక్షించడం తనవంటి వీరుడికి యెంత పని, అనుకుంటూ నెమ్మదిగా మడుగులోకి దిగాడు. కాళ్ళు నెలకి అదిమి పట్టి, ఆవు తోకను పట్టుకు లాగబోయాడు. ఆవు కొంచమయినా కదలలేదు. ఎంతగా ప్రయత్నించినా, ఆవును బయటకు లాగడం విక్రమార్కుడికి సాధ్యపడలేదు. చూస్తుండగానే, నలుదిశలా చీకట్లు అలముకున్నాయి. గుడ్లగూబలు గుహలలో నుంచి బయటకు వచ్చాయి. ఆకాశమంతా...

సాలభంజిక కధలు - 8

శ్రీమహావిష్ణువును భక్తితో ధ్యానించి, తన వారందరూ వెంట రాగా, మళ్ళి, సింహాసనాన్ని ఎక్కలనే కోరికతో వచ్చాడు భోజ రాజు. అప్పుడు అక్కడ కాపలా ఉన్న సాలభంజిక, మహారాజు పట్టుదలను మెచ్చి, ఇలా అంది. " రాజా! ఇలా రోజూ వచ్చి వెళ్ళిపోవడం, నీ వంటి వాడికి తగదు. అలాగని నీకు గద్దెనెక్కే అర్హత కూడా లేదు. ఉజ్జయినీ పతికి కల అత్యుపకార, సాహస గుణాల గురించి చెప్తాను, విను..." దానగుణం రాజులకు పేరు తెస్తుంది. దాన గుణం ఉన్న వాడే చతురుడు, శూరుడు అవుతాడు.  అట్టి ఉదారమయిన  దాతృత్వం కల విక్రమార్కుడు రాజ్యం చేసే సమయంలో, ఒక నాడు రాజు కొలువు తీరి ఉండగా, ఒక భట్టు వచ్చి, ఆ రాజు వైభవాన్ని గొప్పగా కీర్తించాడు. దానితో, సామంత రాజులకు అసూయ కలిగి, వారిలో ఒకడు, ' ఇతనితో సరిపోల్చగల రాజు మరెవ్వరూ లేరా ?' , అని అడిగాడు. దానికా, భట్టు నెమ్మదిగా నవ్వి, ' ఈ మహారాజు దైవ ప్రసాదం వల్ల పుట్టిన సిద్ధపురుషుడు. ఇతని దానాగుణానికి కర్ణుడే సరిపోలడు , ఇక మనమెంత?' అన్నాడు. అది విన్న సామంత రాజు తనకు కలిగిన సిగ్గు, అహంకారం, మనసులోనే దాచుకుని, ఎలాగయినా విక్రామార్కుడిని మించిన కీర్తిని సంపాదించుకోవాలని సంకల్పించాడు. ఇలా ఉండగా, ఒక...

సాలభంజిక కధలు -7

ధారా నగరాధిపతి మరొక సుముహూర్తాన ఉమామహేశ్వరుల ఆరాధన చేసి, పరివారం వెంట రాగా, సింహాసనం యెక్క వచ్చాడు. అక్కడున్న సాలభంజిక, 'నిలు, నిలువు ' మని వారించి, ' నువ్విలా మాటిమాటికీ ఇక్కడికి రావడమే తప్పు. విక్రమార్కుడికి సరిసమానమయిన ఉపకార బుద్ధి లేక, నీవు ఈ సింహాసనం ఎక్కడం తగదు సుమా!' అని వారించింది. ఆ మాటలకు సిగ్గు, ఆశ్చర్యము కలిగిన భోజ రాజు, ' మీ మహారాజు ఎంతటి పరోపకార శీలియో చెప్పు, ' అని అడిగాడు. సాలభంజిక ఇలా చెప్పా సాగింది. " మా విక్రమార్కుడు పాలించే రోజుల్లో, రాజధానిలో, ' విలోచనుడు ' అనే విప్రుడు ఉండేవాడు.అతడి భార్య విలోచన. వారికి చిరకాలము సంతానం కలుగాకపోవడంతో, విశ్వేశ్వరారాధన చెయ్యసాగారు. కొన్నాళ్ళకు ఈశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి, శనిత్రయోదశి పూజలు చేస్తే, సంతానం కలుగుతుందని చెప్పాడు. శివాజ్ఞానానుసారంగా భక్తితో పూజలు చేసిన వారికి చక్కటి పుత్రుడు కలిగాడు. వారు అతనికి 'దేవదత్తుడు' అని నామకరణం చేసారు. ఆ కుమారుడు బుద్ధిమంతుడై, చక్కటి విద్యావంతుడయ్యాడు . యుక్తవయస్సు రాగానే , పెళ్లి చేసుకుని, గృహస్త ధర్మాలను  పాటించ సాగాడు. ప్రతి నిత్యం దగ్గరలో ఉన్...

సాలభంజిక కధలు - 6

భోజ రాజు సింహాసనం మీద మమకారాన్ని చంపుకోలేక, మళ్ళి ఒక శుభ దినాన సింహాసనం ఎక్కే ప్రయత్నం చేసాడు. అక్కడ కాపలా ఉన్న బొమ్మ కోపించి, ' రాజా! నీకు మర్యాద తెలియదా ? విక్రమార్కుడి ధైర్యసాహసాలు ఎక్కడా? నీవెక్కడ?' అని ప్రశ్నించింది. గతుక్కుమన్న భోజుడు, ఆ గుణగణాల గురించి వివరించమని అర్ధించాడు.ఆ బంగారు బొమ్మ చెప్పడం మొదలుపెట్టింది. విక్రమార్కుని రాజ్యంలో వేదవేది అయిన శుశ్రుతుడు అనే ధర్మజ్ఞుడు ఒకడు ఉండేవాడు. అతడు రాజాజ్ఞ మేరకు అనేక తీర్ధ యాత్రలు చేసి, వెనుదిరిగి వెళ్తూ , మార్గ మధ్యంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్న నగరానికి చేరుకున్నాడు. చక్కని ప్రాకారాలతో విరాజిల్లే ఆ నగరంలో, ఆశ్చర్యంగా, పురుషులనే వారే లేరు. దానిని పాలించేది కూడా ఒక సుందర కన్య మాత్రమే! ఆ పట్టణంలో ఒక దేవాలయం పక్కన ఒక ఉక్కు నూనె బావి, చక్కగా అలంకరించబడిన బంగారు వివాహ వేదిక అమర్చబడి ఉన్నాయి. అంతేకాక, దగ్గరలో ఉన్న ఫలకం మీద ఇలా రాసి ఉంది... " ఏ నరుడయితే ఈ మరిగే నూనె బావిలో దూకే ధైర్యం చేస్తాడో, అతనికి ఈ రాజ్యము, అందాల భరిణె అయిన ఈ రాజకుమారి లభిస్తాయి..." అది చదివిన శుశ్రుతుడు ఆశ్చర్యపోయి, ' ఈ మరుగు నూనె బావిలో పడినవాడు , బ...

సాలభంజిక కధలు - 5

విక్రమార్కుడి రత్న సింహాసనం మీద మోజు తీరని భోజరాజు ఒక నాడు, శ్రీకృష్ణుడిని పూఇంచి, తిరిగి సింహాసనం ఎక్కే ప్రయత్నం చేసాడు. ఇంతలో అక్కడున్న బొమ్మ, " ఓ రాజా, మేము యెంత చెప్పినా, నీవు మరలా, మరలా సింహాసనం ఎక్కే ప్రయత్నం చేస్తున్నావంటే, అది కేవలం నీకు విక్రమార్కుడి గుణగణాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తప్ప, మరేమీ కాదు. విక్రమార్కుడి సాహస, దాతృత్వ లక్షణాలను గురించి చెప్తాను, విను, " అంటూ ఇలా చెప్పసాగింది. విక్రమార్క మహారాజు ఒక మారు దేశాటనం చేస్తూ, గంగా తీరం చేరుకొని, అక్కడ ధర్మపురం అనే నగరంలో, ఒక సత్పురుషుడి ఇంట్లో బస చేసాడు. ఉదయాన్నే లేచి, సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి, గంగా నదికి ప్రణమిల్లి, స్నానం ముగించుకుని, పుర వీధుల్లో సంచరించసాగాడు . ఇంతలో అక్కడికి ఒక ముసలిది , భయంతో పెడబొబ్బలు పెడుతూ, ఏడుస్తూ వచ్చి, " అయ్యలారా! నా మొగుడు నదిలో సంధ్య వారుస్తుండగా, ఒక మొసలి పట్టుకుంది. మీలో ఎవరయినా, నా భర్తకి ప్రాణ భిక్ష పెట్టండి," అని మొరపెట్టుకుంది. అప్పుడు నివురుగప్పిన నిప్పు లాంటి విక్రమార్కుడు ముందుకు వచ్చి, " అమ్మ, నువ్వు బాధపడకు. నీ భర్తను నేను రక్షిస్తాను," అని...

సాలభంజిక కధలు -4

ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పుకుందాం  ... పూర్వము సూర్యవంశంలో పుట్టిన సుదర్శనుడనే రాజు అయోధ్యాపురం రాజధానిగా చేసుకుని పరి పాలిస్తూ ఉండేవాడు. అతడు నిత్యం అన్నదానాలు క్రమం తప్పకుండా చేస్తూ దేవతల మెప్పు కోసం యజ్ఞ యాగాలు చేస్తూ మిక్కిలి పేరు పొందాడు. ఐతే ఒకనాడు సరయూ నదీతీరంలో యజ్ఞం చేస్తూండగా, త్రిలోక సంచారి ఐన మన నారదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు సుదర్శనుడు నారదుని భక్తితో పూజించి అర్ఘ్య పాద్యాదులనర్పించి సవినయంగా "ఓ మహాను భావా! మీ రాకవల్ల కృతార్ధుడనయ్యాను, మారాజ్యము పావనమైంది, తమరింకా ఏఏ ప్రదేశాలు చూచి వచ్చారో సెలవీండి" అని ఎంతో వినయ విధేయతలతో అడిగాడు. అందుకు మన నారదుడు అతని సేవలకు మెచ్చి "పరమ ధర్మ శీలుడవైన ఓ రాజా! నీ కీర్తి బ్రహ్మ లోకంలో నలుదిశల పొగడబడు తున్నది. నీ దాన ధర్మాల గురించి నీ ప్రాశస్త్యం గురించి విని నిన్ను చూడాలని వచ్చాను" అని అన్నాడు. అందుకు సుదర్శనుడు "స్వామీ నాపై దయతో మీరిలా వచ్చారుగానీ నేనెంతటి వాడను?" అని ఎంతో వినయంగా నమస్కరించాడు. అందుకు ముని "ఓ ధరణీశా! నీ చరిత్ర బ్రహ్మ లోకంలో చర్చించ బడుతోంది. అంత కంటే ఏం కావాలి? నీవంటి వారి...

సాలభంజిక కధలు -3

ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పు కుందామా? మా విక్రమార్కుడు గర్వం లేకుండా వినయ విధేయతలు కలిగిన రాజు. క్షణంలో కరిగి పోయే కలిమిని సైతం తన మంచితనంతో కట్టి పడేయగల సమర్ధుడు. ఐతే, అంత ధనం ఉన్నప్పుడు తగినంత దాన గుణం ఉండాలి కదా!? అందుకని అశ్వమేధ యాగం చేయాలని తల పెట్టాడు. అందుకు తగినట్టుగా బంధు మిత్ర సపరివారాన్నందరిని ఆహ్వానించాడు. చేసేది పుణ్య కార్యం గనుక "గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, యక్షులు" తమంత తాముగా వచ్చి యాగంలో పాల్గొన్నారు. సరే! వచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములు చేసాడు. ఐతే, వారిలో సముద్రుడు లేక పోవటంతో చింతించి, ఒక పురోహితున్ని కారణం తెలుసుకుని రమ్మని పంపించాడు. ఆ పురోహితుడు వెంటనే బయలుదేరి భయంకరమైన మొసళ్ళు, తిమింగలములు, అనేక సుడిగుండములు ఉండే సముద్రాన్ని చేరాడు. దానికి సమీపంలో నిలబడి సముద్రుడిని పిలిచి పిలిచి అలసి పోయాడు. అప్పుడు తనలో తను "సరసత్వము సన్మానము లేని చోట స్నేహం పనికి రాదను కున్నాడు. దారి దోపిడి వారికి దాన ధర్మాలు చూపించటం లాంటిది." అని ఎంచి మరలి పోవాలనుకుని ఆఖరి సారిగా ఎలుగెత్తి ఇలా పిలిచాడు. "ఓ సముద్రుడా! నేను రా...

సాలభంజిక కధలు - 2

భోజరాజు మళ్ళీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్టించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది. "ఓ! భోజరాజా! మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్యసాహసాలు నీకు లేవు. కావున ఈ గద్దె నెక్కబోవటం నీకు సాధ్యం కాదు ఎందుకంటే, ఉజ్జయనిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణు మూర్తి రాజ్యం కంటే గొప్పది. కావున విను, మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరుడు, కుత్సిత బుద్ధి కలవాడు, నీరసాత్ముడు, దూషకుడు, దుర్మార్గుడు, అనాచారుడు, అబద్ధాలు చెప్పేవరు, అవినీతి పరులు, బద్ధ కస్తులు, దుర్భలులు, మదాంధులు, మదన వికారం చెందిన వారు, స్తిరత్వం లేని వారు, ఇలాంటివారు మచ్చుకైన ఉండరు. ఐతే అటువంటి రాజ్యంలో ఒకనాడు ఒక విదీశీయుడు ప్రవేశించాడు" అని ఆ సాలభంజిక చెప్పసాగింది. రాజ దర్శనం కాగానే, రాజుకు నమస్కరించి తాను దేశ దేశాలు తిరిగి వచ్చానని చెప్పాడా విదేశీయుడు. అందుకు రాజు "దేశం నలుమూలలా చుట్టి వచ్చావు గనుక, నీవు చూసిన వింతలేమైనా చెప్పు" అని అడిగాడు. అందులకా సిద్ధుడు "నేను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పు కొండల ప్రాంతంలో ఒక భాగ్య వంతమైన నగరం చేరుకున్నాను. అక్కడ సూర్యప్రభ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా లోతైనది....

సాలభంజిక కధలు - 1

32 సాలభంజికలు 32 కథలు" చెప్పి భోజరాజుని సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకున్నాయని చెప్పుకన్నాం కదా? ఐతే వాటిలో ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం. విక్రమార్కుడు ఒకనాడు నిండు కొలువులో సభ తీరి ఉన్న సమయంలో అక్కడికి ఒక కవీంద్రుడు వచ్చాడు. అతడు మహా పండితుడు, సకల భాషా కోవిదుడు, సంస్కృత ప్రాకృత చతుర్విధ భాషా విశారదుడు. అందువల్ల మన విక్రమార్కుడిని నాలుగు భాషల్లో దీవించి ఆసనం మీద కూర్చుని, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అదెలా అంటే? ఓ రాజేంద్రా! నా పేరులో ఆరు అక్షరాలుంటాయి. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను "అశ్వవేదినౌతాను" రెండక్షరాలు వదిలిపెడితే "నాట్యకర్తనౌతాను" మూడక్షరాలు తీసేస్తే "గతవిదుడనౌతాను" నాలుగక్షరాలు విడిచి పెడితె "నేర్పరినౌతాను" ఐదు అక్షరాలు వదిలిపెడితే "బుధుడనౌతాను" అన్ని అక్షరాలు కలిపి చదివితే "బుద్ధిబలమున్న వాడినౌతాను" ఇది కేవలం నేతిబీరకాయ చందాన చెప్పటం కాదు, నువ్వు అన్ని విద్యలలోను ఆరితేరినవాడివి గనుక నాపేరు తెలుసుకోగలవు అని విక్రమార్కుడిని ప్రశ్నించి అడిగాడు. అందుకు సకల విద్యా పారంగతుడైన విక్రమార్కుడు నవ్వి "ఓ కవ...

భోజ రాజు

ధారాపురం అనే మహా నగరానికి  రాజు  భోజరాజు.  అతను గొప్ప పరాక్రమమం కలవాడు.  అంతటి సద్గునవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరుపొందాడు.  అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు  నీతిమంతుడు. క్రూర  మృగాల వల్ల  ప్రజలకు   కష్టనష్టాల గురించి విన్న భోజరాజు  తన మంత్రి నీతిమంతుని పిలిచి  క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి  అంతా సిద్దం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో  బయల్దేరారు  భోజరాజు  నీతిమంతుడు. అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు సేవకులు పులులు,  సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు.  చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు  తన పరివారంతో  రాజధానికి  తిరిగి వెళ్ళసాగాడు.  వాళ్ళు ఓ చోట  జొన్న చేను పక్కగా వెళుతున్నారు.  అక్కడ మంచెపై కూర్చుని  ఉన్న ఆచేను యజమాని ఐన  ఓ బ్రాహ్మణుడు  వీళ్ళను చూసి  “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు  అలసిపోయి  ఉన్నారు,...

విక్రమార్కుడి మరణం

రాజులు రాజ్యాలు అంతరించినా, శకాలు మారినా, యుగాలు గడచినా, శక కర్తలుగా యుగ పురుషులుగా మనకి వింత వింత చరిత్రలు, మంచి మంచి పురాణ కధలూ తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే వాటిలో అణు మాత్రమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. అలాంటిదే ఈ విక్రమార్కీయము. ఇంతవరకు విక్రమార్కుడు శివుని వలన వరం పొందాడని చెప్పు కున్నాం కదా! ఐతే ఆ వరము ఎలా నిజమయ్యిందో , ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు, దారి పొడవునా పూలూ ముళ్ళూ ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి. వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలిచి కారణం ఏమిటని అడిగాడు. అందుకు మంత్రి ఐన భట్టి "రాజా! మేడ మీద కాకులు గుడ్ల గూబలూ చేరి అరవటం, పట్టపుటేనుగు మరణించటం, గుర్రములు సైతము కన్నీరు గార్చటం ఇవన్నీ నాకెందుకో అపశకునాలుగా కనిపిస్తున్నాయి. ఏదో కీడును సూచిస్తున్నాయి. ఎందుకో భయంగా ఉంది" అన్నాడు. అందుకు విక్రమార్కుడు నవ్వి "పూర్వము నాకు పరమ శివుడు ఇచ్చిన వరం గుర్తులేదా? ఒక్క సంవ...

విక్రమార్కుడికి శివుడి వరం

భర్తృహరికి విక్రమార్కుడు సవతి తమ్ముడని కదా చెప్పుకున్నాము, ఐతే ఒక రోజు ఆ భర్తృహరి విక్రమార్కుని పిలిచి "తమ్ముడూ ! ఒకప్పుడు మన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వరపుత్రుడుగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వలక్షణ సంపన్నుడవై బుద్ధి మంతుడైన భట్టిని మంత్రిగా చేసుకుని రాజ్య భారాన్ని వహించి ప్రజారంజకమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశంతరం వెళ్ళిపోతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్ష ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గమున పాలన గావించు" అని రాజ్యభారం అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు. అప్పటినుండి విక్రమార్కుడు తన అన్న భర్తృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంత రాజుల్ని గెలిచి వారిని పాదాక్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందుతూ ధనకనక వస్తు వాహనాలతో తుల తూగుతూ పుణ్యరాశిగా పేరు పొందాడు. ఇలా ఉండగా కొంత కాలానికి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు "మరణ మనేది...

విక్రమార్కుడు - సాలభంజిక కధలు

పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా? ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి?భూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది (దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్ని మరోసారి). ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం ఖూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞా పించాడు. ఐతే ఇద్దర...