Posts

Showing posts with the label పుష్కరాలు

(Telugu) పుష్కరాల స్నానంలో పాటించాల్సిన విధులు

[:te]పుష్కరాల సమయంలో గురుడు, ఆయనతో పాటుగా సంచారంలో ఉన్న పుష్కరుడే కాదు... ముక్కోటి దేవతలూ పుష్కరనదిలో నివసిస్తారన్నది నమ్మకం. ఇక భౌతికంగా వేలాది, లక్షలాదిమంది భక్తులు స్నానార్థం రావడం ఎలాగూ ఉండేదే! అందుకే అటు దైవశక్తి పట్ల గౌరవానికీ, ఇటు సాటి భక్తుల పట్ల ఆదరానికీ ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఎన్నో విధి నిషేధాలను విధించారు పెద్దలు. సంకల్పాలు చెప్పుకోవడం, అర్ఘ్యాలు అందించడం వంటివి చేయనివారు సైతం అందరి మంచినీ దృష్టిలో ఉంచుకుని ఏర్పరిచిన ఈ విధులను పాటించడం శ్రేయస్కరం! - కడుపు నిండినప్పుడు భగవంతుడు గుర్తుకురాడు కదా! అందుకే పుష్కర స్నానానికి వెళ్లాలనుకునేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండటం మంచింది. వీలైతే ప్రాతఃకాలంలో పుష్కర స్నానం చేస్తే మరీ మంచిది. - స్నానానికి ముందు సంకల్పం చెప్పుకోవడం కుదరకపోతే, కనీసం గోత్రనామాలను చెప్పుకొని, భగవంతుని స్మరిస్తూ మూడుసార్లు మునకలు వేయాలి. - నగ్నంగా కానీ అర్థనగ్నంగా కానీ స్నానం చేయకూడదు. శరీర పైభాగంలో కూడా పైపంచ వంటి ఆచ్ఛాదనతోనే స్నానం చేయాలంటారు పెద్దలు. - నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలిచి పుష్కర స్నానం చేయాలంటుంది శాస్త్రం. దీని వల్ల మన నుంచి వెలువడే మలినాలు ప్...

(Telugu) పుష్కర స్నానం చేయవలసిన తీరు

[:te]ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణా పుష్కరాలు రానే వచ్చేశాయి. గురుడు కన్యారాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులూ కృష్ణమ్మకు పుష్కరాలు జరుపుకొనేందుకు అంతా సిద్ధపడిపోయారు. పుష్కరాల సందర్భంగా ఏదో ఒక సమయంలో పుష్కరనదిలో స్నానం చేయడం మంచిందంటారు పెద్దలు. ఒకవేళ కుదిరితే ఆ స్నానాన్ని ఆచరించే సమయంలో కొన్ని ప్రార్థనలను కూడా సూచిస్తున్నారు. నదిలోకి దిగే సమయంలో గట్టు మీద ఉన్న చిటికెడు మాత్రమే మృత్తిక (మట్టి) తీసుకుని నీటిలో వేస్తూ... పిప్పలాదాత్సముత్పన్నే క్రుత్యేలోక భయంకరి! మృత్తికాంతే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయ !! ... అనే శ్లోకాన్ని చదువుకోవాలి. పుష్కర స్నానాలు జరిగే సమయంలో వేలాదిమంది ప్రజలు వస్తూ ఉంటారు. గట్లన్నీ మట్టిమట్టిగా మారిపోతుంటాయి. వాటి మీద తడి బట్టలతో వెళ్తే కాసేపటికి అంతా బురదమయం కావడం ఖాయం. బహుశా దానికి నివారణగా ఈ ఆచారాన్ని నెలకొల్పి ఉంటారు పెద్దలు. పైగా పుష్కర స్నానం చేసే చోట నది కాస్త లోతుగా ఉంటే ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. వచ్చినవారంతా తలా ఒక గుప్పెడు మట్టి తీసుకుని వేయడం వల్ల అక్కడి తీరం కాస్త మునకలు వేసేందుకు అనువుగా మారవచ్చు. ఇక పుష్కర సమయంలో వేలాదిమంది ఒక్కసారిగా ...

(Telugu) పుష్కరాల సమయంలో చేయవలసిన దానములు

[:te] మొదటి రోజు దానము బంగారము, వెండి, ధాన్యము, భూమి. ఫలితము మహారాజ యోగం. రెండో రోజు దానము వస్త్రాలు, గోవులు, ఉప్పు, రత్నాలు. ఫలితము వసులోక ప్రాప్తి. మూడో రోజు దానము బెల్లము, పండ్లు, గుర్రాలు. ఫలితము గంధర్వలోక ప్రాప్తి. నాలుగో రోజు దానము నెయ్యి, నూనె, పాలు, తేనె. ఫలితము పుణ్యలోక ప్రాప్తి. ఐదో రోజు దానము ధాన్యము, రథము, ఎద్దు, నాగలి. ఫలితము అష్టైశ్వర్య, ఆరోగ్య సిద్ధి. ఆరో రోజు  దానము ఔషధములు, గంధము, కర్పూరము, కస్తూరి. ఫలితము చంద్రలోక ప్రాప్తి. ఏడో రోజు దానము గృహము, పీఠము, పల్లకి, శయ్య. ఫలితము రాజ యోగము. ఎనిమిదోరోజు దానము కందమూలాలు, పూలు, చందనము. ఫలితము ఇంద్రలోక ప్రాప్తి. తొమ్మిదోరోజు దానము పిండప్రదానం, దాసి, కన్య, కంబళి. ఫలితము సంతాన సిద్ధి, సూర్యలోక ప్రాప్తి. పదో రోజు దానము ముత్యాలు, పూలు, వెండి ఫలితము సమస్త భూమినీ దానం చేసినంత ఫలితం. పదకొండవరోజు  దానము పుస్తకాలు, యజ్ఞోపవీతము, తాంబూలము ఫలితము స్వర్గలోక ప్రాప్తి. పన్నెండవరోజు  దానము గో, సువర్ణ, తిల, అశ్వ... వంటి షోడశ దానాలు. సమారాధన. ఫలితము అనంతకోటి పుణ్యఫలితం. [:]

(Telugu) ఇదీ పుష్కరుని కథ!

[:te]పూర్వం తుందిలుడు అనే మహర్షి పరమేశ్వరుని ప్రస‌న్నం చేసుకునేందుకు ఘోర‌మైన త‌ప‌స్సుని చేశాడు. అత‌ని తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వ‌రాన్ని కోరుకోమ‌ని అడ‌గ‌గానే... `నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా వ‌రాన్ని ప్రసాదించ‌మ‌ని` వేడుకున్నాడు తుందిలుడు. దానికి ఈశ్వరుడు త‌న‌లోని జ‌ల‌శ‌క్తికి ప్రతినిధిగా తుందిలుని నియ‌మించాడు. అలా ముల్లోకాలలో ఉన్న న‌దుల‌న్నింటికీ తుందిలుడు అధిప‌తి అయ్యాడు. ఈ ప్రపంచంలోని జీవ‌రాశులు అన్నింటికీ నీరే జీవనాధారం కాబట్టి తుందిలునికి, పుష్కరుడు... అంటే `పోషించేవాడు` అన్న పేరు వ‌చ్చింది. కాలం ఇలా సాగుతుండగా బ్రహ్మదేవుడు ప్రాణుల‌ను సృష్టించే ప‌నిని మొదలుపెట్టాడు. అందుకోసం బ్రహ్మదేవునికి పుష్కరుని సాయం కావ‌ల‌సి వచ్చింది! దాంతో ఈశ్వరుని అనుమతితో పుష్కరుడు బ్రహ్మదేవుని ద‌గ్గరకు వెళ్లి, ఆయ‌న‌కు సృష్టిలో సాయ‌ప‌డ్డాడు. బ్రహ్మదేవుని ప‌ని ముగిసిపోయిన తరువాత కూడా పుష్కరుడు ఆయ‌న వ‌ద్దనే ఉండిపోయాడు. ఆ స‌మ‌యంలో దేవ‌త‌ల‌కు గురువైన బృహ‌స్పతి, భూమి మీద జీవులంద‌రికీ సాయ‌ప‌డేందుకు పుష్కరుని త‌న‌తో పంప‌మ‌ని బ్రహ్మదేవుని అడిగాడు. కానీ పుష్కరునికేమో బ్రహ్మదేవుని వదిలి వెళ్లడం ఇష్టం ల...