Posts

Showing posts with the label చలి కాలం

రేగుపళ్లతో ఆరోగ్యం

ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో తినాలన్నది పెద్దల మాట. అలా చూసుకుంటే చలికాలంలో విస్తృతంగా కాసే పండు రేగు. భోగి పండుగ వస్తోందంటే చాలు, ఇంట్లో పిల్లలకి ఆ రేగితో భోగి పండ్లు పోయకపోతే అదో వెలితిగా తోస్తుంది. పండు అంటేనే పోషకాహారానికీ, ఆరోగ్యానికీ సూచన. ఇక రేగు పండు అంటే మరింత ఆరోగ్యం, మరిన్ని పోషకాలు అంటున్నారు నిపుణులు. - రేగుపండు అనగానే ఠక్కున గుర్తుకువచ్చే అంశం జీర్ణవ్యవస్థ. చలికాలం సహజంగానే మన జీర్ణవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రేగుపండ్లు ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణం కాకపోవడం, ఉబ్బరంగా ఉండటం, గొంతులో మంట వంటి సమస్యలలో రేగు దివ్యంగా పనిచేస్తుంది. - చలికాలంలో పెద్దలకే జీర్ణశక్తి సరిగా ఉండనప్పుడు ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది. ఇప్పుడంటే ప్రోబయాటిక్‌ పొడులూ, డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌తో కూడిన టానిక్కులూ చలికాలంలో పిల్లలకి అందిస్తున్నారు. కానీ ఒకప్పుడు చలికాలంలో పిల్లలకి రేగుపండ్లని అందించడం వల్ల సున్నితంగా ఉండే వారి జీర్ణశక్తికి బలం చేకూరేది. - చలికాలంలో మనకి పెద్దగా దాహం వేయదు. దాంతో మంచినీరు తగినంతగా తీసుకోం. దీని వల్ల మన శరీరంలో అనేక సమస్యలు ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్...