పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు
నడవటం.. పరుగెట్టటం.. చాలా తేలికైన వ్యాయామాలు. వీటికి ఎలాంటి సాధనాలతోనూ పనిలేదు. కాళ్లకు షూ, పరుగెట్టాలనే కోరిక ఉంటే చాలు. ఎవరైనా, ఎక్కడైనా చేసేయొచ్చు. అయితే పరుగెత్తటంలోనూ కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి. దీంతో త్వరగా అలసిపోకుండా, ఎక్కువసేపు పరుగెత్తే అవకాశముంది. గాయాల బారినపడకుండానూ కాపాడుకోవచ్చు. ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు సాగొచ్చు. కాబట్టి పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులేంటో చూద్దాం. * పరుగెత్తేటప్పుడు తలను నిటారుగా ఉంచాలి. సుమారు 30-40 మీటర్ల దూరం మేరకు ముందుకు చూడాలి. పాదాలవైపు, కిందికి చూస్తూ పరుగెడితే మెడ, భుజాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే దవడ, మెడ గట్టిగా బిగపట్టకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి. * భుజాలు కాస్త వెనకగా, కిందికి ఉండేలా చూసుకోవాలి. పైకి లాక్కుని, బిగపట్టి ఉంచితే భుజాలపై బాగా ఒత్తిడి పడుతుంది. శ్వాస సరిగా ఆడదు. దీంతో కండరాలకు తగినంత ఆక్సిజన్ అందదు. * చేతులను మోచేతి వద్ద 90 డిగ్రీల కోణంలో వంచాలి. ముందుకూ వెననకూ కదిలిస్తూ సాగాలి. శరీరానికి అడ్డంగా కదిలించకూడదు. చేతుల కదలికలు శరీరం ముందుకు దూసుకుపోవటానికి తోడ్పడతాయని గుర్తుంచుకోవాలి. * శరీరాన్ని పూర్తిగా న...