Posts

Showing posts with the label వేమన శతకం

(Telugu) వేమన శతకము

[:te]చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియుఁ గొదవ గాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత? విశ్వదాభిరామ వినుర వేమ! తా|| వైరాగ్యముతో ఆత్మానందము నోండేది ఓ వేమా! వినుము. నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యము చేసిననుఆది చాలా ఘనమైన ఫలము నిచ్చును. చాలా చిన్నదైన మఱ్రి విత్తనము నుండి మహావృక్షము పుట్టుట లేదా? ఆత్మశుద్ధి లేని యాచారమది యేల? భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ వినుర వేమ! తా||పెద్దల నుండి వచ్చిన యాచారమును అంతకరణ శుద్ధితో పాటించవలెను. ఆ శుద్ధి లేని యాచారము వ్యర్దము. వంట చేయు పాత్రలను ముందు శుబ్రపరచవలెను. ఆది లేనిచొ ఆ వంట తినుటకు యోగ్యము కాదు. అట్లే స్నానాదులతొ బాహ్యశుద్ది కలిగియుండుటే కాక మనసునుకూడా కామక్రోధాదులు లేకుండ ప్రశాంతముగా నుంచుకొని శివ పూజా చేయ వలెను. మనసున మాలిన్యములుంచు కొని పైకి ఆడంబరరముగా శివ పూజా చేసినా ఫలము శూన్యము. గంగిగోవుపాలు గంటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినుర వేమ! తా : మేలైన ఆవు పాలు గరిటెడైనను అవి పిల్లలకు ఆరోగ్యామును, దేవతలకు ప్రీతిని గలిగించును. గాడిద పాలు కుండెడు ...

(Telugu) వేమన పద్యాలు

[:te] తల్లిదండ్ర్రుల గౌరవాన్ని సమాజంలో కుటుంబ ప్రతిష్టని కాపాడాల్సిన బాధ్యత బిడ్డలదే. దాన్ని గుర్తెరగకపోతే మొత్తం వంశమే అప్రతిష్టపాలవుతుందని ఈ పద్యం ద్వారా చక్కని ఉపమానంతో వేమన ఎలా వివరించారో చూడండి ఉత్తముని కడుపున ఓగు జన్మించిన వాడు చెరచు వాని వంశమెల్ల చెఱకు వెన్ను పుట్టి చెరచదా తీపెల్ల విశ్దాభిరామ వినురవేమ. ఓగు అంటే మూర్ఖుడు, చెడ్డవాదని అర్ధం. ఉత్తముని ఇంట్లో చెడ్డవాడు పుడితే కుటుంబ గౌరవమంతా మట్టికలుస్తుంది. అంతే కాదు, అలాంటివాడివల్ల మొత్తం వంశానికే చెడ్డపేరు వస్తుంది. అదెలా అన్నదానికి చెఱకుతో చక్కగా పోల్చి చెప్పాడు వేమన. చెఱకుకి కంకిలా ఒక పువ్వు పూస్తుంది. దాన్ని వెన్ను అంటారు. కాటుక తెగులు వెన్నుకే వస్తుంది. కాని, దాని వల్ల చెఱకుగడ మొత్తం బెండులా మారి తీపంతా పోతుంది. కాబట్టి పిల్లలు ఎంత బాద్యతగా మెలగాలన్నది ఈ పద్యం ద్వార తెలుసుకోవచ్చు. [:]

(Telugu) వేమన పద్యాలు

[:te]అనువుగాని చోట నథికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువు గాదు కొండ అద్దమందు కొంచమై యుండదా? విశ్వదాభిరామ వినుర వేమ! అల్పుడెపుడుఁబల్కు నాడంబరముగాను సజ్జ నుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ వినురవేమ! అనగ అనగ రాగము అతిశయిల్లుచు  నుండు తినగ తినగ వేము తియ్య నుండు సాధనమున పనులు సమకూరు ధర లోన విశ్వదాభిరామ వినుర వేమ! అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పుతినెడు కుక్క చెరకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ! ఆత్మశుద్ధి లేని ఆచరమేల భాండ శుద్ది లేని పాకమేల చిత్తశుద్ది లేని శివ పూజ లేలయ విశ్వదాభి రామ వినుర వేమ ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమ ! కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం బిది విశ్వదాభిరామ వినుర వేమ! గంగిగోవు పాలు గంటిడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ! చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు చదువు జదివెనేని సరసుడగును చదువు మర్మమెరిగి చదువగ చూడుము విశ్వదాభిరామ వినుర వేమ...

(Telugu) వేమన పద్యాలు

[:te] *  అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెఋగకున్న నీశ్వరుడెఋగడా? విశ్వదాభిరామ వినురవేమ *     అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ మెలగెడు జనులెల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము విశ్వదాభిరామ వినురవేమ * అగ్నిచేతబట్టి యా పరమేశుని నిందచేసి నరులు నీరుకారె? దక్షు క్రతవులోని తల్లడమెఋగరా? విశ్వదాభిరామ వినురవేమ * అధికుడైన రాజొకల్పుని జేపట్ట వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా? విశ్వదాభిరామ వినురవేమ * అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ * అనల మించుకైన గనలి మండునుగాని చనువుగాని యొఱుక మనికి నిడదు తనువు మఱచువాడె తత్త్వజ్ఞుడగునయా విశ్వదాభిరామ వినురవేమ * అనువుగాని చోట నధికులమనరాదు కొంచమయిన నదియు గొదువ గాదు కొండ యద్దమందు గొంచమై యుండదా విశ్వదాభి రామ వినుర వేమ * అన్నిదానముల కంటె నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనములేదు ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ * అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ * అలమెఱుగు ...

(Telugu) వేమన పద్యాలు

[:te]అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును. కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉండును. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణములు, ఆకారములు కలియున్ననూ మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా ఉండునని భావం. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: ఓ వేమా! మంచి ఆవు పాలు కొంచమైనా ఉపయోగంగా ఉండును. కానివి కడవ నిండా ఉన్న గాడిద పాలు పని ఏమి? భక్తితో పెట్టిన భోజనం కొద్దిగా అయినా చాలును కదా! అని భావం. అనువుగానిచోట నధికులమనరాదు కొంచెముండుటెల్ల...